బొడ్డు బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{in use}}
'''బొడ్డు బాపిరాజు''' [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఏలూరు]] పట్టణానికి చెందిన కవి రచయిత. ఇతడు [[1912]]లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు బొడ్డు వేంకట వేంకటసుబ్బారాయుడు. ఇతడు [[గరికపాటి మల్లావధాని]] వద్ద సంస్కృతాంధ్రాలలో కావ్యాలు, వ్యాకరణము అభ్యసించాడు.
==అవధానము==
ఇతడు [[1932]], [[నవంబర్ 18]]వ తేదీన [[ఏలూరు]] ''ఆదివారపు పేట''లో ఒక అష్టావధానాన్ని తన 20వ యేట విజయవంతంగా నిర్వహించాడు. ఈ అవధానంలో వర్ణన, సమస్య, పుష్పగణనము, చతురంగ ఖేలనము, దత్తపది, సంభాషణము, వ్యస్తాక్షరి, ఆకాశపురాణము అనే ఎనిమిది అంశాలు ఉన్నాయి. ఈ అవధానంలో పృచ్ఛకులుగా శతావధానులు [[వేలూరి శివరామశాస్త్రి]], [[దోమా వేంకటస్వామిగుప్త]], [[కాకర్ల కొండలరావు]], [[హరి రామలింగశాస్త్రి]], అష్టావధానులు [[గరికపాటి మల్లావధాని]], [[కొత్తపల్లి సుందరరామయ్య]] పాల్గొన్నారు. ఈ అవధానానికి [[చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి]] అధ్యక్షునిగా వ్యవహరించాడు.
 
ఈ అవధానంలో ఇతడు పూరించిన సమస్య: ''<big>నువ్వులు నానిపోవుటకు నూరు యుగమ్ముల కాలమయ్యెడిన్</big>''
 
పూరణ:<poem>పువ్వులఁగోయు నన్నిపుడు పొంతకు రమ్మనఁబేరులేదె? ఓ
నువ్విట కేగుదెమ్ము వడి నువ్వని నువ్వని మాటిమాటికిన్
నవ్వుచుఁ బల్కకుండినను నాతిరొ! నువ్వని పిల్తువింక నీ
నువ్వులు నానిపోవుటకు నూరు యుగమ్ముల కాలమయ్యెడిన్
</poem>
==రచనలు==
# శ్రీ చందనాలు (ఖండకావ్యము)
"https://te.wikipedia.org/wiki/బొడ్డు_బాపిరాజు" నుండి వెలికితీశారు