కృష్ణాష్టమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కృష్ణ జన్మాష్టమి''' ([[సంస్కృతం]]: कृष्ण जन्माष्टमी) [[విష్ణువు|శ్రీ మహావిష్ణువు]] బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో [[దశావతారాలు|ఎనిమిదవ అవతారము]] [[శ్రీకృష్ణుడు]] జన్మదినము. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.[[File:యశోదమ్మతో బాలకృష్ణ.png|frame|right|upright=0.5|అల్లరి కన్నయ్య]]
 
== తిథి ==
[[శ్రీకృష్ణుడు]] [[దేవకి]] [[వసుదేవుడు|వసుదేవులకు]] [[దేవకి]] ఎనిమిదో గర్భంగా [[శ్రావణమాసము]] కృష్ణ పక్షం [[అష్టమి]] తిథి రోజు [[కంసుడు]] చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన [[పంచాగం]] ప్రకారం [[శ్రావణ బహుళ అష్టమి]] తిథి. ఇదే రోజు [[రోహిణి]] నక్షత్రము కొద్ది సేపు చంద్రాయుక్తమై ఉంటుంది. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారము [[2006]] సంవత్సరములో [[ఆగష్టు]] నెల 15-16 తారీఖులలో వచ్చింది. [[2007]] సంవత్సరములో [[సెప్టెంబర్]] నెల 4వ తారీఖున జరుపుకునుతాము
 
== కృష్ణాష్టమి పండుగ విధానం ==
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా [[ఉపవాసం]] ఉండి, సాయంత్రాం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు,అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు.ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు.
 
పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.[[File:గోపాలుడు.png|thumb|గోపాలుడు]]
 
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని [[బ్రహ్మాండ పురాణం]] చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది..
పంక్తి 14:
 
===గుజరాతీల సంప్రదాయం ఆదర్శం ===
గుజరాత్‌ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీజగదాష్టమి అని పిలుస్తారు. గుజరాతీల సంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి పండగకు నాలుగురోజుల ముందునుంచే పూజలు ప్రారంభమవుతాయని జిల్లా కేంద్రానికి సమీపంలోని జీఎస్‌ ఎస్టేట్‌లో నివాసముండే గుజరాతీలైన తోడికోడళ్లు జ్యోతి, కాజల్‌ తెలిపారు. పండగకు నాలుగురోజుల ముందు వచ్చే చవితినాడు ఆవు, లేగదూడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు. కృష్ణుడు గోవులను సంరక్షించేవారు అయినందున గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. అన్నం తినకుండా రెండ్రోజుల ముందుగానే మిఠాయిలు, ఫలహారాలు, కార, చుడువా, గారెలు వంటివి తయారుచేసుకుంటారు. ప్రత్యేకంగా మినపప్పు పిండితో తయారుచేసిన ‘అడిది’ పేరుగల మిఠాయిలు తయారుచేస్తారు. ఒకరోజు ముందు నుంచే ఉపవాసదీక్షలు పాటిస్తారు.[[File:గోపాలుడు.png|thumb|గోపాలుడు]] అన్నం స్వీకరించకుండా ఫలహారాలు తీసుకుంటారు. రాత్రి దోసకాయ గుజ్జును తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు. దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు. రాత్రి 12 గంటల తర్వాత అందులోంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ నిర్వహిస్తారు. అనంతరం వూయలలో ఉంచి భక్తి, జోలపాటలతో భజన నిర్వహిస్తారు. వెన్న, పెరుగు, డ్రైప్రూట్స్‌తో తయారు చేసిన పదార్థాలను అలంకరించిన కుండలో ఉంచి మహిళలు, యువతీ, యువకులు అందరూ కలిసి ఉట్టికొట్టే (దహీహండీ) కార్యక్రమం నిర్వహిస్తారు. అదే సమయంలో స్త్రీలు దాండియా నృత్యాలు చేయగా, పురుషులు ప్రత్యేక నృత్యప్రదర్శనలతో ఆనందోత్సవాలను పంచుకుంటారు. చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహీహండీని పగులగొట్టిస్తారు. అనంతరం మరునాడు ఉదయం వంటలు చేసుకొని భోజనాన్ని ఆరగిస్తారు.
 
===ప్రత్యేక నృత్యాలతో అలరించే లాబానా ప్రజలు===
"https://te.wikipedia.org/wiki/కృష్ణాష్టమి" నుండి వెలికితీశారు