హోమియోపతీ వైద్య విధానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
పంక్తి 4:
==చరిత్ర==
[[File:Beydeman Gomeopatiya vzir.jpg|thumb|left|1857 painting by [[Alexander Beydeman]] showing historical figures and personifications of homeopathy observing the brutality of medicine of the 19th century]]
హోమియోపతీ అన్నది హోమోయిస్ (ఒకే రకమైన), పేథోస్ (బాధ, రోగ లక్షణం) అనే రెండు గ్రీకు మాటలని సంధించగా పుట్టిన మాట. కనుక కావలిస్తే దీనిని తెలుగులో సారూప్యలక్షణవైద్యం అనొచ్చు. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధంపదార్థం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్ (Samuel_Hahnemann; 1755-1843) అనే జర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి లక్షణంగా అప్పటి వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి లోపాలు కనిపించటం సహజం. ఈ లోపాలని సవరించటానికి ఆయన ఒక కొత్త పద్ధతిని కనిపెట్టేడు. అదే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ భక్తులు ఇప్పుడు వాడుకలో ఉన్న "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు. అంతేకాని ఇంగ్లీషు వైద్యులు ఎవ్వరూ వారి వైద్యపద్ధతిని "ఎల్లోపతీ" అని అనరు.
 
==విభిన్న పద్ధతులు==
పంక్తి 18:
'''మొదటి సూత్రం.''' మనం ఇచ్చే మందు రోగానికి, రోగ లక్షణాలను తగ్గించటానికి కాదు; మనిషికి. ఒకే రోగం అందరిలోనూ ఒకే లక్షణాలని చూపించదనేది సర్వులూ గమనిస్తూన్న విషయమే. ఇది పటిష్టమైన సూత్రమే అని మానసిక శాస్త్రంలో ప్రావీణ్యత ఉన్నవారు ఒప్పుకుంటున్నారు. ఈ సూత్రానికి “mind over matter” అని ఇంగ్లీషులో భాష్యం చెప్పొచ్చు. కనుక రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మూల కారణం ఉంటుందనేది వీరి సిద్ధాంతం. కనుక రోగి ఎన్ని లక్షణాలు ఏకరవు పెట్టినా వాటన్నిటికి ఒకే ఒక మందు (remedy) ఇస్తారు - సనాతన హోమియోపతీలో. మందుల ఖాతాలో ఉన్న ఏ మందు ఏ రోగికి నప్పుతుందో ఎంపిక చెయ్యటం చాల కష్టం. పది పుస్తకాలు చదివినంత మాత్రాన అబ్బే ప్రతిభ కాదు ఇది; అనుభవం ఉండాలి. అందుకనే హొమియోపతీ వైద్యం అందరి చేతిలోనూ రాణించదు. అందుకనే కాబోలు, అధునాతనులు ఈ సూత్రాన్ని సమయానుకూలంగా విస్మరిస్తారు.
 
'''రెండవ సూత్రం.''' రోగికి ఏ మందు ఇవ్వాలనే ప్రశ్నకి సమాధానం చెబుతుంది ఈ సూత్రం. ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి చేత ఏదైనా మందు తినిపించినప్పుడు ఆ వ్యక్తి శరీరంలో ఏయే లక్షణాలు పొడచూపుతాయో అయా లక్షణాలు ప్రదర్శించిన రోగికి అదే పదార్ధంపదార్థం మందుగా పనిచేస్తుంది. ఈ సూత్రానికి “ఉష్ణం ఉష్ణేన శీతలం” అని సంస్కృతంలో భాష్యం చెప్పొచ్చు. ఈ సిద్ధాంతాన్నే లాటిన్ భాషలో similia similibus curentur అంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సింకోనా తింటే చలిజ్వరం లక్షణాలు కనిపించేయనుకుందాం. అప్పుడు చలిజ్వరంతో బాధ పడే రోగికి అతి చిన్న మోతాదులలో సింకోనా ఇస్తే రోగ లక్షణాలు ఉపశమించి, క్రమేపీ రోగం నయమవుతుందని సనాతన హోమియోపతీ వాదిస్తుంది. ఎల్లోపతీ వైద్యంలో కూడ ఈ సూత్రం ఉంది. టీకాల మందులు దీనికి ఒక ఉదాహరణ. ఏ రోగం బారి నుండి తప్పించుకోవాలంటే ఆ రోగం లక్షణాలను శరీరంలో పుట్టిస్తుంది టీకాల మందు. [[కలరా]], [[మసూచికం]](smallpox), [[పోలియో]], [[టెటనస్]], [[నుమోనియా]], [[ఫ్లూ]] మొదలైన వాటికి ఎన్నిటికో “టీకాల మందులు” (vaccinations) కనిపెట్టేరు. పుప్పొడి (pollen) పడని వాళ్ళకి కూడ టీకాల మందులు ఉన్నాయి. [[మలేరియా]] వంటి వ్యాధులకి కూడ టీకాల మందుల కోసం వేట సాగుతోంది. కనుక ఈ సూత్రంలో లోపం లేదు. కాని ప్రాయోగికమైన విషయాలలో బేధాభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకి, టీకాలు వేయించుకున్న వ్యక్తి రక్తం పరీక్ష చేసి చూస్తే టీకాల వల్ల శరీరంలో వచ్చిన మార్పు (ప్రతికాయాలు (antibodies) కనిపించటం) ఏమిటో స్పష్టంగా కనిపిస్తుంది. అంటే టీకా మందు వల్ల శరీరం ఎలా స్పందిస్తుందో రక్తం పరీక్ష చేసి మనం రుజువు చూపించవచ్చు. హోమియోపతీ మందు వేసుకున్న తరువాత శరీరంలోని రక్తంలో కాని, జీవకణాలలో కాని ఎటువంటి మార్పు వస్తుందో ఇంతవరకు ఎవ్వరూ ప్రమాణాత్మకంగా రుజువు చేసి చూపించలేకపోయారు.
 
'''మూడవ సూత్రం.''' ఇచ్చే మందు అతి సూక్షమమైన మోతాదులో ఇవ్వాలి. సాధారణంగా రోగి వేసుకొనే మూడు మాత్రలలో మందు ఒక పాలు ఉంటే పంచదార (కాకపోతే ఆల్కహాలు, కాకపోతే నీళ్ళు) 1,000,000,000,000 పాళ్ళు ఉంటుంది. ఇంత తక్కువ మోతాదులో ఉన్న మందు ఎలా పని చేస్తుందో, దాని వెనక ఉన్న తర్కం ఏమిటో ఇంతవరకు ఎవ్వరూ నిక్కచ్చిగా రుజువు చేసి నిర్ద్వందంగా చెప్పలేకపోయారు.
 
==తధాస్తు ప్రభావం==
ఇంగ్లీషులో [[ప్లసీబో]](placebo) అనే మాట ఉంది. లాటిన్ లో ఈ మాటకి "అలాగే! సంతోషిస్తాను" అనే అర్ధం ఉంది. అలాగే వైద్య శాస్త్రంలో "ఈ మందు గుణం చేస్తుంది" అని చెప్పి వైద్యుడు పంచదార మాత్రలు ఇచ్చినా కొందరిలో గుణం కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్ని శాస్త్రీయ పద్దతిలో అనేక కోణాలనుండి రుజువు చేసేరు. ఈ సందర్భంలో ఔషధం లేని ఉత్త పంచదార మాత్రలని ప్లసీబో అంటారు. దీనిని తెలుగులో "తధాస్తు మందు" (placebo) అనిన్నీ, ఈ ప్రభావాన్ని తధాస్తు ప్రభావం (placebo effect) అనిన్నీ అనొచ్చు; ఎందుకంటే సంస్కృతంలో తధాస్తు అంటే "అలాగే జరుగుతుంది" అని ఆర్ధం కనుక.
 
హోమియోపతీ వాడకంలో కనిపించే గుణం కేవలం తధాస్తు ప్రభావమే అని ఆధునిక శాస్త్రీయ దృక్పధపు వాదన. తధాస్తు ప్రభావం వల్ల కనిపించే గుణం ఉత్త ఊహాజనితమూ కాదు, మనస్సు మనని మభ్య పెట్టటమూ కాదు. ఈ ప్రభావం వల్ల వ్యాధి నిజంగా నయం అవుతుంది. నమ్మకంతో తులసిదళంతో నూతినీళ్ళు తాగినా కొందరిలో గుణం కనిపిస్తుంది. అలాగని నూతినీళ్ళకి మహత్తు ఉందనడం శాస్త్రీయం అనిపించుకోదు. వచ్చిన చిక్కల్లా ఈ తధాస్తు ప్రభావం అందరిలోనూ కనిపించదు. ఈ దృగ్విషయం (phenomenon) పరిపూర్ణంగా అర్ధం అయిననాడు హోమియోపతీ వైద్యం కూడ ఎలా పని చేస్తున్నదో అర్ధం అవటానికి సావకాశాలు ఉన్నాయి.
పంక్తి 50:
*మర్రిపాటి నమశ్శివాయ శర్మ, వృద్ధుల వైద్యంలో హోమియోపతీ, Haniman Institute of Homeopathy, 7-6-44 బుర్రావారి తోట, శ్రీకాకుళం - 532001
*George Vithoulkas, The Science of Homeopathy, B. Jain Publishers Pvt. Ltd., New Delhi - 110 055
 
 
== అంతర్జాలపు లంకెలు ==
Line 74 ⟶ 73:
 
{{వైద్య శాస్త్రం}}
 
[[వర్గం: ప్రత్యామ్నాయ వైద్యాలు]]
 
<!-- Interwiki Links -->