పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. ఏదైనా ఫెర్మెంటో పాలనే పెరుగు అనడం అర్థవంతంగా లేకపొయినా, పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. రష్యాలో గొర్రెలు,మేకలు పాలనించి కూడా పెరుగు తయారుచేస్తారు.
==చరిత్ర==
"యోగార్ట్" అనేది [[టర్కీ]] దేశం నుంచి వచ్చిందని చరిత్ర నమ్ముతోంది. ఒకానొకాయన ఎడారిలో వెళుతున్నప్పుడు తను కూడా కొన్ని పాలను ఒక చర్మపు సంచిలో పోసుకుని వెళ్ళాడట. కొన్ని గంటల తర్వాత ఆ సంచిని తెరిచి చూసేసరికి పాలు కాస్త గడ్డ కట్టి ఘనపదార్థంగా మారాయట. ఈ విధంగా పెరుగు కథ మొదలైనదని చరిత్ర. బహుశ చర్మపు సంచిలోని బాక్టీరియా, ఎడారి సూర్యుడి వలన పాలు పెరుగుగా మారి ఉండవచ్చు. ఏది ఏమైనా పెరుగు అనేక దేశల్లో ఎంతో కాలం నుంచి ఆహార పదార్థంగా వాడబడుతోంది. మనదేశంలో పెరుగు సంపూర్ణాహారం. మన దేశం తో పాటు [[రష్యా]], టర్కీ, ఈజిప్టు, యూరప్, అమెరికా లలో చాలా కాలం నుండి దీనిని వాడుతున్నట్టుగా మనకి దాఖలాలున్నాయి. ఈ మధ్యన పెరుగులోని ఆహార విలువల్ని గమనించి ప్రపంచంలో పెరుగు వాడకం కూడ ఎక్కువైనదని చెప్పాలి.
 
==ఆహారపు విలువలు==
పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు