"ఉన్నవ లక్ష్మీబాయమ్మ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| birth_name =ఉన్నవ లక్ష్మీబాయమ్మ
| birth_date = [[1882]]
| birth_place = [[గుంటూరు జిల్లా]] [[సత్తెనపల్లిఫిరంగిపురం]] తాలూకాలోనిమండలం [[అమీనాబాదు]]
| native_place =
| death_date = [[1956]]
'''ఉన్నవ లక్ష్మీబాయమ్మ''' దేశసేవిక, సంఘసంస్కరిణి. ఈమె ప్రముఖ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, విద్యాదాత అయిన [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] సతీమణి. గుంటూరు శారదా నికేతనము స్థాపకురాలుగా ప్రసిద్ధి చెందినది.
లక్ష్మీబాయమ్మ నడింపల్లి సీతారామయ్య రామలక్ష్మమ్మ దంపతులకు 1882లో [[గుంటూరు జిల్లా]] <nowiki>[[ఫిరంగిపురం]]</nowiki> మండలం [[అమీనాబాదు]] గ్రామంలో మధ్యతరగతి నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.<ref>http://www.streeshakti.com/bookL.aspx?author=3</ref> కుటుంబంలో అందరికంటే చిన్నదైన కారణంగా అభ్యుదయభావాలతో పాటు సాంప్రదాయక విద్యను అందుకున్నది. తన 10వ ఏట గుంటూరుజిల్లా [[వేములూరిపాడు]]కు చెందిన ఉన్నవ లక్ష్మీనారాయణతో 1892లో వివాహం జరిగింది.
 
1902లో ఉన్నవ దంపతులు గుంటూరుజిల్లాలో ఒక వితంతు శరణాలయం స్థాపించారు. ఎంతో సాహసంతో వితంతు పునర్వివివాహాలు జరిపించారు. ఇంతలో రాజమండ్రి నుండి [[కందుకూరి వీరేశలింగం]] పంతులు గారు ఈ దంపతుల్ని పిలిచారు. వీరేశలింగం అక్కడ స్థాపించిన ఆశ్రమం, శరణాలయ కార్యకలాపాలను ఈ దంపతులకు చూపించారు. అక్కడి వారంతా కలసి ఆశ్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారో వీరు పరిశీలించి ఒక్క సంవత్సరం పాటు అక్కడ గడించిన అనుభవంతో 1908లో ఉన్నవ దంపతులు గుంటూరు తిరిగి వచ్చారు. 1914నుండి స్వాతంత్య్రం సంపాదించుకోవాలనే ఆకాంక్ష భారతీయుల్లో బలంగా నాటుకుపోయింది. ఉన్నవ దంపతులతోపాటు [[అయ్యదేవర కాళేశ్వరరావు]], [[రాయప్రోలు సుబ్బారావు]], [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు వంటి స్వాతంత్ర్య సమరయోధులు తరచూ [[పొట్లపూడి]]లో సమావేశమౌతుండేవారు. స్వరాజ్య సంపాదన గురించి ఆంధ్రరాష్ర్ట నిర్మాణానికై ఆలోచనలు జరిపేవారు.
8,824

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1962660" నుండి వెలికితీశారు