తెల్కపల్లి రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==ఉద్యోగ ప్రస్థానం==
తాను చదువుకొన్న [[బందరు]] [[జాతీయ కళాశాలలోకళాశాల]]లో 1923లో ఒక సంవత్సరం అధ్యాపకుడిగా పనిచేసి ఆనాటి విద్యార్థులైన [[మరుపూరు కోదండరామిరెడ్డి]], వై.బి.రెడ్డి, [[బెజవాడ గోపాలరెడ్డి]], కౌతా ఆనందమోహన్, కౌతా రామమోహన్ వంటి ఉద్ధండుల మెప్పును పొందాడు. కర్నూలులో వెల్లాల శంకరశాస్త్రి ఇతని ప్రియశిష్యుడు. బందరు జాతీయ కళాశాలలో [[విశ్వనాథ సత్యనారాయణ]] ఇతనికి సహాధ్యాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ కుమారుడైన అర్జునరావుకు ఇతడు సంస్కృతం నేర్పించాడు. 1921లో బెజవాడలో గాంధీని దర్శించాడు. గాంధీ విదేశీ వస్తు బహిష్కరణ పిలుపుననుసరించి ఖద్దరును ధరించాడు.
 
1924లో స్వగ్రామానికి తిరిగివచ్చి [[గద్వాల]] రాణి ఆది లక్ష్మిదేవమ్మ ఆస్థానంలో సంస్కృత విద్వాంసుడిగా నియమించబడ్డాడు. ఇతడు గద్వాల మహారాణికి ఆంతరంగికుడు. గద్వాల రాణికి కుటుంబ, పాలనాపర సమస్యలు వచ్చినప్పుడు ఇతడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇతడు 1959లో రాజాపురం గ్రామానికి మొదటి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై కిరోసిన్‌తో నడిచే వీధి దీపాలను ఏర్పాటు చేయడమేకాక పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించి వచ్చిన డబ్బును దుర్వినియోగపరచకుండా గ్రామ అభివృద్ధికి ఉపయోగించిన గొప్ప ప్రజానాయకుడు.
 
1924లో స్వగ్రామానికి తిరిగివచ్చి గద్వాల రాణి ఆది లక్ష్మిదేవమ్మ ఆస్థానంలో సంస్కృత విద్వాంసుడిగా నియమించబడ్డాడు. ఇతడు గద్వాల మహారాణికి ఆంతరంగికుడు. గద్వాల రాణికి కుటుంబ, పాలనాపర సమస్యలు వచ్చినప్పుడు ఇతడు తగిన సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇతడు 1959లో రాజాపురం గ్రామానికి మొదటి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై కిరోసిన్‌తో నడిచే వీధి దీపాలను ఏర్పాటు చేయడమేకాక పంచాయతీ అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించి వచ్చిన డబ్బును దుర్వినియోగపరచకుండా గ్రామ అభివృద్ధికి ఉపయోగించిన గొప్ప ప్రజానాయకుడు.
==బహుముఖ ప్రతిభ==
ఇతడు బహుముఖీన ప్రతిభావంతుడు. కేవలం సంస్కృత రచనలేకాక ఆయుర్వేదంలో ఇతడు దిట్ట. ఇతని ఆయుర్వేద చిట్కాలు, ప్రసంగాలు ఆకాశవాణిలో ఎన్నో ప్రసారమైనాయి. ఎంతో మంది రోగులకు స్వయంగా ఆయుర్వేద మందులను తయారు చేసి ఇచ్చి స్వస్థత చేకూర్చాడు. అంతేగాక వడ్రంగి, కంసలి వంటి వృత్తులలో కూడా ఇతనికి ప్రవేశం ఉంది. తన ఇంటి తలుపులకు తానే స్వయంగా చెక్కిన వాణీ విలాస నిలయః అన్న అందమైన అక్షరాలు, తన ఇంటిలో స్వయంగా తయారు చేసుకున్న కర్ర స్టాండ్లకు చెక్కిన మామిడి పిందెల అలంకరణ ఇతడి ప్రతిభకు నిదర్శనాలు.