శారద యస్. నటరాజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శారద యస్. నటరాజన్''' తెలుగు కథా రచయిత. ఆయన "శారద" అనే కలంపేరుతో విజయవాడ, [[తెనాలి]] నేపథ్యంతో అద్భుతమైన కథలు నవలలు అందించారు.
==జీవిత విశేషాలు==
ఆయన [[తమిళనాడు]] కు చెందిన [[పుదుక్కోట]]లో భాగీరధి, సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు 1924లో జన్మించాడు. వారిది అతి బీద బ్రాహ్మణ కుటుంబం. వారికి పూట గడవటమే కష్టం. అట్టి పరిస్థితులలో, నటరాజన్ జోలెబట్టి మధూకరం తెచ్చుకొని చదువు కొనటమే కాకుండా, తల్లి తండ్రులను కూడా పోషించాడు. తీరిక సమయాలలో, దేవాలయాల వద్ద గంధం, విభూతి అమ్మి కొంత ధనాన్ని సంపాదించేవాడు. అతి చిన్న వయసులోనే, ప్రాచీన, ఆధునిక తమిళ సాహిత్యాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. ఎక్కువగా హాస్య, వ్యంగ్య రచనలు ఆయనను ఆకట్టుకున్నాయి. సహజంగా ఆయనకూ సునిశితమైన హాస్య దృష్టి అబ్బింది.నటరాజన్ తన రెండవ ఏటనే తల్లిని కోల్పోయాడు. అక్కలిద్దరినీ తెనాలికి చెందిన వారికిచ్చి వివాహం చేయటంతో, సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్ తో తెనాలికే చేరాడు. 1937 లో తెనాలికి వచ్చారు. మొదటినుండి పుస్తకాలను చదవటం, స్వయంగా కొత్త విషయాలను నేర్చుకోవటం నటరాజన్ కు అలవాటు. అలానే, ఆయన, ఆంగ్ల, ఫ్రెంచి భాషలను నేర్చుకోవటమే కాకుండా, నెమ్మదిగా ఆ భాషల్లో ఉన్న కథలను తమిళం లోకి అనువదించటం ద్వారా, తనలోని రచయితను మేల్కొలిపాడు. తెనాలికి వచ్చినప్పుడు ఆయనకు తెలుగు మాట్లాడటం గానీ, వ్రాయటం గానీ తెలియనే తెలియదు. తెలుగును నేర్చుకోవాలని ఆయనకు ఎంతో ఉబలాటం ఉండేది. కానీ, అతని ముందర ఉన్న సమస్య పొట్టనింపుకోవటం, తండ్రిని పోషించటం. తెనాలిలో మారీసుపేటలో ఉన్న 'ఆంధ్ర రత్నహోటల్ 'లో సర్వర్ గా చేరాడు. ఇక తెలుగు నేర్చుకోవటం తప్పని సరి అయింది, హోటల్ కు వచ్చిన వారితో మాట్లాడటం మొదట నేర్చుకున్నాడు. తరువాత స్వయంగా తెలుగు భాషను చదవటం, వ్రాయటం నేర్చుకున్నాడు. ఆ రోజుల్లోనే, ఆయన ఆంగ్ల పత్రికలలోని పజిల్సును పూర్తి చేసేవాడు. అలా, చాలా సార్లు బహుమతులు కూడా పొందాడు. తెలుగులో ప్రాచీన సాహిత్యం వైపు పోకుండా, ఆధునిక, సమకాలీనపు సాహిత్యాన్ని విశ్లేషణాత్మకంగా చదవటం అలవాటైంది. కొడవటిగంటి, చలం లాంటి వారి సాహిత్యాన్ని బాగా అర్ధం చేసుకున్నాడు. కనిపించిన ప్రతి తెలుగు పుస్తకాన్ని చదివే వాడు. అలా నటరాజన్ కాస్తా'శారద' అయ్యాడు. ఆయనకు తెనాలిలో తెలుగు నేర్పిన అధ్యాపకుడు తురగా వెంకటేశ్వరరావు. ఆయన,'శారద'చేత గజేంద్రమోక్షం, శ్యామలాదండకం లాంటివి కంఠస్థం చేయించారు. శారద, తన పదిహేనవ ఏటనే తండ్రిని కూడా పోగొట్టుకున్నాడు. ఏకాకి అయిన 'శారద' తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. ఒక రకమైన షాక్ కు గురయ్యాడు. తండ్రికి దహన సంస్కారాలు చేసిన నాటి రాత్రే మూర్ఛ వ్యాధికి గురయ్యాడు 'శారద'. ఆఖరికి ఆ వ్యాధే అతనిని మృత్యులోకాలకు తీసుకొని వెళ్ళింది. కాలువ పక్క పడిన అతని మృతదేహాన్ని మరుసటి రోజుకు గానీ గుర్తించలేకపోయారు. అలా అర్ధాంతరంగా ముగిసింది 'శారద'జీవితం.
పంక్తి 9:
నటరాజన్ బాల్యం పుదుక్కోటైలో గడిచింది. తల్లి పోయేనాటికి నటరాజన్ కి రెండేళ్ళు. తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్‌కి ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. నటరాజన్ కడసారి బిడ్డ. ఇద్దరు అక్కలకి తెనాలిలో అబ్బాయిలకిచ్చి పెళ్లి చేసాడు తండ్రి. ఒక అల్లుడు భీమారావు హోటల్ యజమాని. ఆయన మామగారు కోరినమీదట బావమరిది నటరాజన్ కి హోటల్లో ఉద్యోగం ఇచ్చాడు. తెనాలి వచ్చేనాటికి నటరాజన్ కి పన్నెండేళ్లు. అక్కడ పని ఎక్కువా జీతం తక్కువా అయి శారద తిండికి చాలానే తిప్పలు పడ్డాడు.
 
పదిహేనేళ్ళు తిరక్కుండా తండ్రి గతించాడు. తండ్రి దహనక్రియలు అయింతరువాత, యింటికి తిరిగి వస్తూ, మూర్ఛ వచ్చి రోడ్డుమీద పడిపోయేడుట. ఆ మూర్చవ్యాధితోనే 32వ ఏట 1955లో17.8.1955 మరణించేడున మరణించారు.
 
==కథలపై ఆశక్తి==
"https://te.wikipedia.org/wiki/శారద_యస్._నటరాజన్" నుండి వెలికితీశారు