మాయని మమత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
సేవాసదనం ధర్మకర్త జగన్నాథం సదనం నిధులను చందాలను దుర్వినియోగం చేయడాన్ని బయట పెడతాడు మధు. దానితో మధు అంటే జగన్నాథానికి ద్వేషం ఏర్పడి పత్రికను నాశనం చేయడానికి, మధును అంతమొందించడానికి జగన్నాథం శతవిధాల ప్రయత్నిస్తాడు. కాని ఫలితం లేకపోతుంది. ఆ పరిస్థితిలో మధు సాంస్కృతిక ప్రతినిధివర్గం నాయకుడిగా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. మధు విదేశాలనుండి తిరిగి వచ్చేసరికి జ్యోతి అపవాదులకు గురై ఇల్లు వదిలి వెళ్లిపోయి ఉంటుంది. మధు తల్లి కూడా జ్యోతిని శంకిస్తుంది. మధు ఎంతో విచారిస్తాడు. జ్యోతికోసం అన్నిచోట్లా వెదుకుతాడు.
 
మధు తల్లి మనోవ్యాధితో మంచం పడుతుంది. ఆమె తుది కోర్కె చెల్లించడానికి జగన్నాథం కుమార్తె నీలను పెళ్లి చేసుకోవడానికి తల ఒగ్గుతాడు మధు. నీల రవిని పేమించిన సంగతి మధుకు తెలియదు. మధు నీలను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినా జ్యోతిని మరచిపోలేక పోతాడు. రవి బ్రతికి ఉన్నాడని, నీల రవి ఒకరినొకరు ప్రేమించారని మధుకు తెలుస్తుంది. మారువేషంలో వచ్చిన రవికి నీలకు వివాహం చేసి జగన్నాథం మోసాలను, దురాగతాలను బట్టబయలు చేయడానికి ప్రయత్నిస్తాడు మధు. చివరకు ఆ స్వార్థపరుని కబంధ హస్తాలనుండి బయటపడి జ్యోతిని వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది<ref>{{cite journal|title=చిత్ర ప్రభ - మాయని మమత|journal=ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక|date=4 March 1970|page=48|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=853139|accessdate=19 October 2016}}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మాయని_మమత" నుండి వెలికితీశారు