రఘు కుంచే: కూర్పుల మధ్య తేడాలు

12 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
 
==కెరీర్==
రైలులో పరిచయమైన [[ఈసీఐఎల్]] ఉద్యోగి రాధాకృష్ణ సహాయంతో సికింద్రాబాదులోని[[సికింద్రాబాదు]]లోని ఒక సంగీత కళాశాలలో చేరాడు. ఒక గదిలో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నపుడు [[పూరీ జగన్నాథ్]] తో పరిచయం ఏర్పడింది. అప్పటికి జగన్ తనకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి ఒకే గదిలోకి మారారు. రఘు హీరోగా జగన్ కొన్ని సింగిల్ ఎపిసోడ్లకి దర్శకత్వం వహించాడు. రఘు గాయకుడిగా అవకాశాల కోసం తిరుగుతున్నపుడు అతని గొంతులో ఇతర గాయకుల అనుకరణ కనిపిస్తున్నదని నిరాకరించడంతో సొంతంగా పాటలు రాసుకుని బాణీలు కట్టడం ప్రారంభించాడు.
 
జీ.కే మోహన్ అనే స్నేహితుడు విజేత అనే టెలీఫిల్మ్ [[దర్శకత్వం]] చేస్తుంటే అందులో రఘుకు హీరోగా అవకాశం వచ్చింది. వ్యాఖ్యాత [[ఝాన్సీ (నటి)|ఝాన్సీ]] కూడా దీని ద్వారానే బుల్లితెరకు పరిచయమైంది. తరువాత మరికొన్ని టీవీ కార్యక్రమాల్లో వరసగా అవకాశాలొచ్చాయి. తరువాత ''యువర్స్ లవింగ్లీ'' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా పనిచేశాడు. అది మంచి ఆదరణ పొందడంతో తరవాత ''పోస్ట్‌బాక్స్‌ నెం 1562'', ''సాంగుభళా'', ''అంత్యాక్షరి'' లాంటి కార్యక్రమాలో అవకాశాలు వచ్చాయి. వ్యాఖ్యాతగా టీవీ నంది పురస్కారాన్ని అందుకున్నాడు.
 
టీవీ కార్యక్రమాలలో బిజీ అవడంతో గాయకుడు కావాలనే అసలు లక్ష్యం పక్కకు మళ్ళింది. అప్పుడే పూరీ జగన్నాథ్ [[బాచి]] సినిమాను మొదలు పెట్టాడు. అందులో ''లచ్చిమీ లచ్చిమీ'' అనే మాస్ పాట పాడే అవకాశం వచ్చింది. సంగీత దర్శకుడు [[చక్రి]]కి కూడా అదే మొదటి సినిమా. ఆ పాట మంచి ఆదరణ పొందడంతో సినిమాలో అవకాశాలు రావడం ప్రారంభించాయి. తరువాత [[చిరంజీవి]] తన [[మృగరాజు]] సినిమాలో ఒక పాటను పాడే అవకాశం కల్పించాడు. తరువాత [[దేశముదురు]], [[శివమణి (సినిమా)|శివమణి]] లాంటి చిత్రాల్లో పాడిన పాటలతో కెరీర్ మరింత పుంజుకుంది. మరో పక్క [[వినీత్]], [[అబ్బాస్]], [[అరవింద్‌ స్వామి]], [[దీపక్‌]] లాంటి చాలామందికి డబ్బింగ్‌ కూడా చెప్పాడు. [[సంపంగి (సినిమా)|సంపంగి]] సినిమాకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నంది పురస్కారాన్నీ అందుకున్నాడు.
1,98,353

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1997547" నుండి వెలికితీశారు