సముద్రాల రాఘవాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
'''సముద్రాల రాఘవాచార్య''' ('''Samudrala Raghavacharya''') ([[జూలై 19]], [[1902]] - [[మార్చి 16]], [[1968]]) [[తెలుగు సినిమా]] పరిశ్రమలో '''సముద్రాల సీనియర్''' గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు [[సముద్రాల రామానుజాచార్య]] సముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాశాడు. అనేక పాటలు కూడా వ్రాశాడు. ఈయన వినాయకచవితి (1957), భక్త రఘునాథ్ (1960), బభృవాహన (1964) సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.
==జీవిత విశేషాలు==
సముద్రాల వేంకట రాఘవాచార్య [[గుంటూరు జిల్లా]], [[రేపల్లె]] సమీపంలోని [[పెదపులివర్రు]] గ్రామంలో [[1902]], [[జూలై 19]]వ తేదీన పండితవంశంలో జన్మించాడు. ఇతడు తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వం చెప్పడం ప్రారంభించాడు. ఇతడు ప్రాచీన ఆధునిక సాహిత్యాలను విస్తృతంగా చదివి 1925లో "భాషాప్రవీణ" పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని కారాగారశిక్షను అనుభవించాడు. 1918 నుండి అవధానాలను చేయడం మొదలుపెట్టాడు. ఇతని అవధాన ప్రావిణ్యాన్ని గురించి విన్న [[జాగర్లమూడి కుప్పుస్వామిచౌదరి]] ఇతడిని తన కుమారునికి తెలుగు నేర్పవలసినదిగా కోరాడు. అతని అభ్యర్థనను మన్నించిన సముద్రాల తన మకామును గుంటూరుకు మార్చాడు.
సముద్రాల వేంకట రాఘవాచార్య [[గుంటూరు జిల్లా]], [[పెదపులివర్రు]] గ్రామంలో [[1902]], [[జూలై 19]]వ తేదీన పండితవంశంలో జన్మించాడు.
 
==తెలుగు చిత్ర పరిశ్రమ==