నందిగామ (ఎన్టీఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 115:
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు==
===కె.వీ.ఆర్.కళాశాల===
నందిగామలో మొదట్లో ఎన్.టి.రామారావుగారి పేరిట కాలేజీని స్థాపించారు. కానీ ఆ మహానటుడి నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందకపోవడంతో ఆ తరువాత ఈ కాలేజీని ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు [[కాకాని వెంకటరత్నం]] గారి పేరిట కె.వీ.ఆర్ కాలేజీగా.కళాశాలగా మార్చారు. ఈ కాలేజీలో చదవి ఐఐఎస్, డాక్టర్లు, ఇంకా జర్నలిస్టులు వంటి అనేక రంగాల్లో ప్రముఖులైన వారు ఉన్నారు. ప్రస్తుతం ఈ కాలేజీకి తుర్లపాటి కోటేశ్వరరావు ప్రిన్స్ పాల్ గా ఉన్నారు. తుర్లపాటి నాగభూషణ రావు కేవీఆర్ కాలేజీలో చదివి (బీఎస్సీ ఫస్ట్ బ్యాచ్- 1975 - 78) అనంతరం జర్నలిస్ట్ గా ఈనాడు, ఆంధ్రప్రభ, టివీ5 వంటి సంస్థల్లో పనిచేశారు. వీరు యునెసెఫ్, నంది అవార్డులు అందుకున్నారు.
===కాకతీయ అపోలో విద్యాసంస్థలు===
ఈ విద్యాసంస్థల అధినేత శ్రీ కాపా రవీంద్రనాధ్, 2016,అక్టోబరు-15న, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా, ఢిల్లీలో '''అబ్దుల్ కలాం ఎక్సెలెన్సీ''' పురస్కారం అందుకున్నారు. విద్యారంగంలో ఆయన చేయుచున్న కృషికి గుర్తింపుగా, "సిటిజెన్స్ ఇంటెగ్రేషన్ పీస్ సొసైటీ" అను సంస్థ వారు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేసినారు. [10]