పనసకాయ కూర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
కూర పనస - పావుకాయ (పైతొక్క, లోపలి నార తీసేసి, తొనల్ని, గింజల్ని వేరుచేసి విడివిడిగా సన్నగా తరిగి ఉంచుకోవాలి), కారం - పావు టీ స్పూను, [[బెల్లం]] - గోలీకాయంత, పసుపు - చిటికెడు, [[ఉప్పు]] - రుచికి తగినంత, [[చింతపండు]] 2 రెబ్బలు, పచ్చికొబ్బరి కోరు - 1 కప్పు, ఆవాలు - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, మెంతులు - అర టీ స్పూను, [[వెల్లుల్లి]] - 6 రేకలు, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
== పొడికోసం ==
ఎండుమిర్చి - 5, [[ధనియాలు]] - అర టేబుల్ స్పూను, [[జీలకర్ర]] - 1 టీ స్పూను (ఇవన్నీ వేగించుకోవాలి), ఇంగువ - చిటికెడు
== తయారుచేసే విధానం ==
పాన్‌లో గింజల్ని ఉడికించి తీసి పక్కనుంచాలి. అదే పాన్‌లో తొనల ముక్కలు, పసుపు, బెల్లం, కారం, ఉప్పు వేసి ముక్కలు మెత్తబడ్డాక గింజల్ని కలపాలి. కూరలో ధనియాలపొడి మిశ్రమం, చింతపండు, పచ్చికొబ్బరి వేసి కొద్ది నీరు చేరుస్తూ మరికాసేపు ఉడికించాలి. వేరే చిన్న కడాయిలో నూనె వేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లితో తాలింపు పెట్టి కూరలో కలపాలి.<ref>http://www.andhrajyothy.com/sundayPageshow.asp?qry=2010/aug/1/sunday/vantasala&more=2010/aug/1/sunday/sundaymain</ref>
"https://te.wikipedia.org/wiki/పనసకాయ_కూర" నుండి వెలికితీశారు