విశ్వనాథ సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "''నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింపబడిన సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును'' " . ఆయన వ్రాసిన రచనలన్నీ కలిపితే లక్ష పుటలు ఉండవచ్చును <ref name="తె.పె.">తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు</ref>.
 
విశ్వనాథ ''మాట్లాడే వెన్నెముక'' అని [[శ్రీశ్రీ]] వర్ణించారు. [[జి.వి. సుబ్రహ్మణ్యం]] ఇలా చెప్పారు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా[[మహాకవి]]గా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం - ఈ వ్యక్తిత్వం."<ref name="dn">'''తెలుగు సాహిత్య చరిత్ర''' - రచన: డాక్టర్ ద్వా.నా. శాస్త్రి - ప్రచురణ: ప్రతిభ పబ్లికేషస్స్, హైదరాబాదు (2004)</ref>
 
[[File:Viswanatha satyanarayana statue.jpg|right|300px|thumb|విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం, లెనిన్ సెంటర్, [[విజయవాడ]]]]
పంక్తి 48:
[[File:Name plate at Viswanatha Satyanarayana's home.JPG|thumb|right|300px|<center>విశ్వనాధ సత్యనారాయణ ఇంట్లో పేరు ఫలకం</center>]]
[[File:Name plate at Viswanatha Satyanarayana's home, nearer view.JPG|thumb|right|300px|<center>విశ్వనాధ సత్యనారాయణ వారి ఇంటి పేరు ఫలకం యొక్క దగ్గరగా దృశ్యం</center>]]
విశ్వనాథ [[1895]], [[సెప్టెంబరు 10]]న ([[మన్మథ]] నామ సంవత్సర [[భాద్రపద బహుళ షష్ఠి]])<ref name="వేయి">"వేయి పడగలు" పుస్తకానికి గ్రంథకర్త కుమారులు పావనిశాస్త్రి పీఠిక</ref> ) [[కృష్ణా జిల్లా]] [[నందమూరు]] గ్రామం (నేటి ఉంగుటూరు మండలం)లో జన్మించారు. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి, తల్లి పార్వతి. ఆయనది తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబం. శోభనాద్రి జీవితం చాలా వరకూ వైభవోపేతంగా సాగిన చివరి దశలో దాతృత్వ గుణం వల్ల దారుణమైన పేదరికాన్ని అనుభవించారు. విశ్వనాథ సత్యనారాయణ తన చిన్నతనంలో సుఖప్రదమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన మాటల్లో చెప్పాల్సి వస్తే మరీ చిన్నతనంలో ''నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ.''<ref name="విశ్వనాథలోని నేను">{{cite book|last1=భరతశర్మ|first1=పేరాల|title=విశ్వనాథ శారద (విశ్వనాథలోని నేను వ్యాసం)|date=సెప్టెంబరు, 1982|publisher=విశ్వనాథ స్మారక సమితి|location=హైదరాబాదు|accessdate=13 November 2014}}</ref> అనంతర కాలంలో శోభనాద్రి కేవలం అంగవస్త్రము, పంచె మాత్రమే సర్వవస్త్రాలుగా మిగిలాకా కూడా దానాలిచ్చి ''దూసిన స్వర్ద్రువై మిగులు ధోవతినొక్కడు దాల్చిన'' స్థితిలో జీవించాల్సి వచ్చింది.<ref name="విశ్వనాథలోని నేను" />. తండ్రి శోభనాద్రి మంచి భక్తుడు, ఆయన [[వారణాసి]] వెళ్ళి గంగానదిలో స్నానం చేయగా దొరికిన విశ్వేశ్వరస్వామి లింగాన్ని తీసుకువచ్చి స్వగ్రామమైన నందమూరులో ప్రతిష్ఠించి ఆలయం కట్టించారు. ఆయన ప్రభావం తమపై విపరీతంగా వుందని విశ్వనాథ సత్యనారాయణ అనేకమార్లు చెప్పుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణలోని దాతృత్వము, భక్తి వంటి సుగుణాలు తండ్రి నుంచి వచ్చినవేనని చెప్పుకున్నారు
<ref group='నోట్'>అతని ఆస్తిక్యమింతని యనఁగఁ గలదె<br />
లేదనిన యూహ గలుగని సాదునకును<br />
పంక్తి 72:
=== కష్టదశ (1932-38) ===
ఆయన జీవితంలో 1932 నుంచి 38 వరకూ అత్యంత కష్టదశగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఆయన స్థిరమైన ఉద్యోగం లేకుండా జీవించాల్సిరావడంతో ఆర్థికపరమైన కష్టాలు, అత్యంత ప్రేమాస్పదురాలైన భార్య గతించడంతో మానసికమైన దు:ఖాన్నీ అనుభవించారు. విచిత్రమైన విషయమేమిటంటే విశ్వనాథ సత్యనారాయణ రచనల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవి ఈ దుస్తరమైన కాలంలోనే వెలువడ్డాయి.
[[1976]] [[అక్టోబరు 18]] న ([[నల]] నామ సంవత్సర [[ఆశ్వయుజ బహుళ దశమి]]) విశ్వనాథ పరమపదించాడు. జీవితంలో చాలా కాలం విజయవాడ నగరంలోనే గడచింది. 21 అక్టోబర్,1996న ఆయన శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడలో[[విజయవాడ]]లో ఆయన విగ్రహాన్ని ఆప్పటి రాష్ట్రపతి [[శంకర్ దయాళ్ శర్మ]] ఆవిష్కరించారు.
 
==సాహితీ ప్రస్థానం==