మార్కాపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
[[File:Markapuram lakshmi Chenakesava temple mukadwaram.JPG|thumb|మార్కాపురం లక్ష్మి చెన్నకేశవ దేవస్థానం ముఖద్వారం]]
*మార్కాపురములో చెన్నకేశవ స్వామి వారి ఆలయము నకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక పుణ్యక్షేత్రము.
#శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం నిర్మితమైంది.లక్ష్మీచెన్నకేశవస్వామివారికి ఎడమచేతిలో శేషచక్రం కలిగి ఉండటం విశేషం. మార్కండేయ మహర్షి తపస్సును కేశి అనే రాక్షసుడు భగ్నం చేయకుండా మహావిష్ణువు రాక్షసుని సంహరిస్తాడు.గర్భాలయాన్ని మారిక అనే యాదవస్త్రీ నిర్మించింది. స్వామివారు మారికను అనుగ్రహించారు. ఆమె పేరుతో వాడుకలోకొచ్చిన మారికాపురం కాలక్రమేణ మార్కాపురంగా వాసికెక్కింది. ధాన్యకటకాన్ని జయించిన శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మను పరిణయమాడి తిరిగివస్తూ ఈ ఆలయంలో బసచేశారు. శ్రీకృష్ణదేవరాయలు మధ్యరంగ మండపాన్ని నిర్మించారు. ఆలయానికి ముందున్న రాతిస్తంభాన్ని 'విజయసూచిక'గా ఆయనే నిలిపారు. పలనాటి రాజుల ఏలుబడిలో బ్రహ్మనాయుడు ఈ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ మధ్యరంగంలో మొత్తం 40 రాతి స్తంభాలున్నాయి. మధ్యరంగం చుట్టు నిర్మించిన రాయి వివిధ వంపులు తిరిగి మార్కాపురం చుంచు, దిగువపాలెం రచ్చబండ, అన్నదమ్ముల స్తంభాలు అని ప్రసిద్ధిలోకి వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం మొదటి అంతస్తుతోనే నిలిచిపోయింది. 1937లో మిగిలిన తొమ్మిది అంతస్తులను పూర్తిచేసుకుంది.
 
చెన్నకేశవస్వామి ఆలయం యొక్క స్థలపురాణం ప్రకారం, గుండికానది (ప్రస్తుతపు గుండ్లకమ్మ నది) తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేశి అనే రాక్షసుడు బాధలు పెట్ట సాగాడు. ఆ రాక్షసుని ఆగడాలను భరించలేని మార్కండేయ మహర్షి, విష్ణువుకై తపస్సు చేయగా కేశిని సంహరించడానికి ఆదిశేషున్ని పంపి, అతని విషజ్వాలలతో కేశిని అంతం చేసాడు. ప్రసన్నుడైన విష్ణువు, మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమనగా మహర్షి, విష్ణువును ఆ స్థలంలో అర్చనామూర్తిగా వెలియమని కోరడంతో, స్వామివారు చెన్నకేశవునిగా ఇక్కడ వెలశారని ప్రతీతి.
పంక్తి 41:
శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గాలి గోపుర జీర్ణోధరణ కార్యక్రమం, 2013, నవంబరు 24 నుండి మొదలు పెట్టి, 27 తో, సంప్రోక్షణా కుంభాభిషేకంతో ముగిసినవి. [1]
మార్కాపురంలో తర్లుపాడు రహదారిలో వేంచేసియున్న ఈ ఆలయంలో, 2015,ఫిబ్రవరి-22వ తేదీ, ఆదివారం నాడు, ఆదివారోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైనవి. ఉగాది పర్వదినానికి ముందు నెల (ఫాల్గుణ మాసం) లో వచ్చే ఆదివారాలలో అమ్మవారికి ప్రత్యేక మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారిని, రజత ఆభరణాలు, పట్టుచీరతో శోభాయమానంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు, వేకువఝామున ఐదు గంటల నుండియే, అమ్మవారి దర్శనానికి బారులుదీరినారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పొయ్యిలలో, మహిళలు పొగళ్ళు వండి, తరువాత, తమను చల్లంగ చూడమని కోరుకుంటూ వీటిని అమ్మవారికి సమర్పించారు. నాగమయ్య దేవతలు, నాగపుట్టల వద్ద భక్తులు పాలు పోసి పూజలు చేసారు. [3]
 
===శ్రీ రామనామ క్షేత్రం===
ఈ క్షేత్రం స్థానిక జవహర్^నగర్ లో ఉంది.
"https://te.wikipedia.org/wiki/మార్కాపురం" నుండి వెలికితీశారు