గూడవల్లి (చెరుకుపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 176:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#ఇక్కడ పూర్వము నాగేశ్వరస్వామి దేవాలయము, మల్లిఖార్జునస్వామి, గణపేశ్వరుల దేవాలయములు వృద్ధిగా ఉండటం తెలుసుకున్న కుళోత్తుంగ చోళ మహారాజు స్వాముల మహిమ గురించి తెలుసుకుని ఆ దేవులకు నిత్యనైవేద్య ధూపదీపారాధనలకు, మహోత్సవములు జరుగుటకు, శాలివాహన శకం 1050 లో (క్రీ.శ 1172 లో) కుముద వెల్లిలో దానము ఇచ్ఛి శిలాశాసనములు వ్రాయించి ఆలయమునకు మండప ప్రాకారాదులు నిర్మాణము చేయించారు. పూర్వము ఈ గ్రామమునకు నడింపల్లివారు, ముక్కామల వారు కరణాలుగా పనిచేసారు. శాలివాహన శకం 1067 (క్రీ.శ 1139 లో) గణపతిదేవ చక్రవర్తి కాలములో ఈ గ్రామాన్ని గోపరాజు రామన్నగారు దానముగా స్వీకరించారు. ఆ రోజులలో ఆగిరిపలిల శోభనాద్రి స్వామివారి అర్చకుడు, వైఖానస సూత్రీకుడు ఉత్తర తాళ్ళపాక అన్నమయ్యగారు తిరుమల వెళ్ళుచూ ఈ గ్రామానికి వచ్చి గ్రామానికి తూర్పుగా ఉన్న కృష్ణపాయలో (కరకట్టలు ఏర్పడటానికి పూర్వము ఇప్పట్టి గంగోలు కాలువ) స్నానము చేసి అనుష్టానము చేసుకొనుచూ గట్టున కూర్చున్నారు. ఆ సమయములో జాలరులు వలలు వేసి దానిలో ఇరుక్కున్న లక్ష్మీనృశింహస్వామివారి విగ్రహన్ని ('''5 అడుగుల ఎత్తు''') తీసి బయట పడవేసినారు (దీనితో పాటు స్తంభోద్భవ నారసింహము సుమారు '''8.6 అడుగుల''' ఎత్తుగల స్తంభము దొరికింది). తాళ్ళపాక సుబ్బయ్య గారు ఆ విగ్రహన్ని చూసి ఆశ్చర్యపడి అంతటి విగ్రహన్ని స్వామి యొక్క అనుగ్రహ బలముతో ఒక్కరే తీసుకువచ్చి గ్రామములో తూర్పుభాగమునకు వచ్చారు. అచ్చట నుంచి ఆ విగ్రహము ఒక్క అడుగు కూడా కదలలేదు. ఆ స్వామివారిని అచ్చటనే ప్రతిష్ఠ చేసి సుబ్బయ్య గారు తమకు బంధువైన బృందావనం వారు అనే వైఖానసలైన వారిని అర్చకత్వములో నియోగించారు. కుళోత్తుంగ చోళ మహారాజు చేసిన దానశాసనము నృశింహస్వామివారి గుడి గోడపైననూ, ఘంటావారి బజారులో ఉన్న తిరుగుట నంది ఉన్న స్తంభముపైననూ కనిపిస్తాయి. పూర్వము ఈ తిరుగుడు నందిని త్రిప్పితే గర్బవతులు తేలికగా ప్రసవించే వారని పెద్దలనే వారు. ఆ [[నంది]] కాలక్రమేణ కాలగర్బములో కలసిపోయిన నాగేశ్వరస్వామివారి దేవాలయ ధ్వజస్తంభమని అంటారు. ప్రస్తుతము శ్రీ లక్ష్మీనృశింహస్వామివారి ఆలయము ఒక్కటే మంచి స్థితిలో వుంది. మిగిలిన ఆలయాలన్నీ లక్ష్మీనృశింహస్వామివారి ఆలయానికి వాయువ్య మూల భూమిలో పూడిపోయివున్నవి.
#'''<big>శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం :</big>''' ఇది చాలా పురాతనమైన దేవాలయము. పూర్వము ఈ ఆలయమందు శ్రీ జ్వాలానారసింహ సాలగ్రామము గలదు. ఈ స్వామి చాలా శక్తిగలవారు. ఈ స్వామికి ఎదురుగా గ్రామస్థులు గడ్డివాములు, ఇండ్లు మొదలైనవి వేసిన ఆ స్వామి జ్వాలకు అవి అన్నియు మండిపోయెడివి.అందువలన గ్రామస్తులందరు స్వామి దృష్టి తప్పించి నిర్మంచుకొనేవారు. ఈ గ్రామమునకు దక్షిణమున అనగా శ్రీ నరసింహ స్వామి వారికి యెదురుగా నిర్మంచినవి తగలబడిపోవుటచే శ్రీ స్వామి వారి దృష్టికి ఎదురుగా ఒక వీధి వదలి గ్రామము నిర్మంచినారని ప్రతీతి. కొంతకాలము జరిగిన పిదప [[గూడవల్లి]]కి పడమటి దిక్కున పదునాల్గుమైళ్ళ దూరంలో పొన్నూరు గ్రామము ఉంది. ఆ గ్రామములో శ్రీ భావనారాయణ స్వామివారి ప్రతిష్ఠ జరుగు సమయమున ఈ జ్వాలానారసింహ సాలగ్రామము, స్వామివద్ద వుంచిన చాలా ప్రతిభ వచ్చునని అప్పుడు సాలగ్రామము ఎవరికి తెలియకుండా దొంగిలించి తీసుకుపోయిరి. అట్లు తీసుకుపోవునప్పుడు వారి వళ్ళు అంతా బొబ్బలెక్కి మంటలతో బాధపడలేక భావనారాయణస్వామి వారికి ఎదురుగా ఉన్న కోనేరులో పడవేసిన ఆ కోనేటిలోని నీరు తుక తుకా ఉడికి ఇంకిపోయినదట. ఆ సమయమున కృష్ణానది ఒడ్డున కోటిపల్లె అనే గ్రామములో [[శివాలయ]] ప్రతిష్ఠ జరుగుతోంది. ఈ జ్వాలానారసింహ సాలగ్రామము లింగము క్రింద వుంచి ప్రతిష్ఠచేసిన శివునికి గొప్ప మహత్యం వస్తుందని పొన్నూరు కోనేరులో గల సాలగ్రామమును అనేక బాధలకు ఓర్చి తీసుకువెళ్ళి లింగం క్రింద వుంచి ప్రతిష్ఠ జరుప ప్రయత్నించిరి. ఆ సమయమున ప్రజలందరు చూస్తుండగా పెద్ద ధ్వనితో లింగము బ్రదలై కంటినలుసు లంతగా పగిలిపోయి దేదీప్యమనమైన తేజస్సు తాళ్ళ వృక్షము ఎత్తున వెలుగుతూ ఐదు ఘడియల కాలము నిలచి అంతర్థానమయిపోయిందట! ఈ ఆలయము సుమారు '''37 సం"ల నుండి దేవాదాయశాఖ''' వారి స్వాధీనంలో వుంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నృసింహ జయంతి కార్యక్రమం కన్నులపండువగా నిర్వ్షించెదరునిర్వహించెదరు.
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మరియు శ్రీ గోకర్ణేశ్వరస్వామివారి ఆలయం:- ఈ శివకేశవుల దేవస్థానములను మహయోగిని శ్రీ సూరమ్మగారు 1961 సం" మే 7,8 తేదీలలో నిర్మాణం గావించారు. ఈ ఆలయాలలో జీవ, ధ్వజ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మార్చ్-9వ తేదీ, [[సోమావారం]] నాడు, వైఖానస, శైవాగమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శాంతికళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారలను కొలిచేటందుకు పోటీ పడినారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొని, స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు. [3]
#శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం.