డాప్లర్ ప్రభావం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరింస్తున్నాను. భాష మార్చేను. వివరణ సరళ పరచేను.
చి చిన్న మార్పు
పంక్తి 1:
{{మొలక}}
డాప్లర్ [[ప్రభావం]] లేదా (డాప్లర్ మార్పు) అనే దృగ్విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవడం తేలిక. తరంగాలని పుట్టించే ఉత్పత్తి స్థానం (సోర్స్), ఆ తరంగాలని పరిశీలించే పరిశీలకుడు మరియు (అబ్జర్వర్) ఉన్నాయనుకుందాం. ఇవి శబ్ద తరంగాలు కావచ్చు, కాంతి తరంగాలు కావచ్చు, విద్యుదయస్కాంత తరంగాలలో ఏవైనా కావచ్చు. ఈ తరంగాల ఉచ్చ స్థానాల మధ్య దూరాన్ని "తరంగాల పొడుగు" (వేవ్ లెంగ్త్) అంటారు. ఈ తరంగాలు ఉత్పత్తి స్థానం నుండి బయలుదేరి అన్ని దిశలలోకీ ఒక నియమిత వేగంతో ప్రయాణం చేస్తాయి. ఒక సెకండు కాల వ్యవధిలో ఎన్ని తరంగాలు మన దృష్టి పథాన్ని దాటుకు వెళతాయో దానిని "సెకండుకి ఇన్ని తరంగాలు" అని కొలుస్తారు. ఈ కొలమానాన్ని తరచుదనం అని కానీ, [[పౌనఃపున్యం]] (ఫ్రీక్వెన్సీ) అని కానీ అంటారు.
 
ఇప్పుడు ఒక ఉదాహరణని తీసుకుందాం. మనం రైలు చపటా మీద నిలబడి ఉండగా ఈల వేసుకుంటూ ఒక రైలు బండి దూసుకుపోయిందనుకుందాం. రైలు ఇంజను (ఉత్పత్తి స్థానం) వేసే ఈల కీచుదనంలో మార్పు ఉండదు కాని మన (పరిశీలకుడు) చెవికి ఆ ఈల కీచుదనంలో మార్పు ఉన్నట్లు వినిపిస్తుంది. ఇది ఎలాంటి మార్పు? రైలు బండి మనని సమీపిస్తూన్నప్పుడు కీచుదనం పెరుగుతుంది, రైలు మనకి దూరం అవుతూన్నప్పుడు కీచుదనం తరుగుతుంది. ఎందువల్ల? ఈల వేస్తూన్న రైలు బండి మనని సమీపిస్తూన్నప్పుడు ఆ శబ్ద తరంగాలు ఒకదానిమీద మరొకటి పడి నొక్కుకు పోతాయి. అనగా వాటి తరంగాల పొడుగు తగ్గుతుంది. అందుకని ఎక్కువ కీచుగా వినిపిస్తుంది. బండి దూరం అవుతూన్నప్పుడు ఆ శబ్ద తరంగాలు "సాగుతాయి." కనుక మనకి కీచుదనం తరిగినట్లు (లేదా బొంగురుతనం పెరిగినట్లు) అనిపిస్తుంది.
 
ఈ దృగ్విషయాన్ని ఆస్ట్రేలియా భౌతిక శాస్త్రవేత్త క్రిస్టియన్ డాప్లర్ 1842 లో గమనించి దానికి పైన చెప్పిన విధంగా వివరణ ఇచ్చేడు. ఆయన గౌరవార్థం ఈ దృగ్విషయాన్ని డాప్లర్ ప్రభావం అనడం మొదలు పెట్టేరు.
పంక్తి 15:
 
===ట్రాఫిక్ విభాగములో===
*డాప్లర్ ప్రభావం యొక్క అనువర్తనాలను మనము మనకు తెలియకుండానే మన నిత్య జీవితములో ఉపయోగిస్తున్నాము. ట్రాఫిక్వీధులలో పొలీస్లుగస్తీ తిరిగే పొలీసులు దీనిని ఉపయోగించి వాహనాల యొక్క వేగాన్ని చెప్పగలడుచెప్పగలరు. పొలీసు అధికారి మొదటగా తనకు ఏ వాహనం యొక్క [[వేగము]] కావాలో నిర్ణయించుకుంటాడు. అతని వద్ద ఉన్న రాడార్ గన్ సహాయంతో ఆ వాహనాన్ని షూట్ చేస్తాడు. ఆ రాడార్ గన్ యొక్క తరంగాలు ఆ వాహనాన్ని డీకొట్టి మరలా ఆ గన్ ను చేరతాయి. ఆ గన్ లో ఒక కంప్యూటర్ ఉంటుంది. ఇది ఆ వాహనము యొక్క వేగాన్ని [[లెక్క]]కట్టి అతనికి తెలియజేస్తుంది.
 
===డాప్లర్ రాడార్===
"https://te.wikipedia.org/wiki/డాప్లర్_ప్రభావం" నుండి వెలికితీశారు