మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==మాల్గుడి కథలు==
ఈపుస్తకంలోని కథలు '''[[మాల్గుడి]]'''అనే వూరును కేంద్రంగా చేసుకొని, ఆవూరిలోని ప్రజలజీవితంలోని సంఘటనలను ఆధారంచేసుకొని కథలల్లబడ్డాయి. రచయిత చెప్పినదానిప్రకారం ఈ మాల్గుడి అనేది తన కథలలోని కల్పితపాత్రలలా, సంఘటనలలా, తన ఊహాలనుంచిపుట్టిన కల్పిత నగరం.రచయిత మనోభావం ప్రకారం మాల్గుడి లాంటి నగరం,దానిలోని వీథులవంటివి,అందులో కనిపించే జనులు ఎక్కడైన చూడగల్మంటాడు.ఉదాహరణకు తాను 1959 నుంచి అప్పు డప్పుడూ నివసిస్తూవచ్చిన వెస్ట్ ట్వేంటి థర్డ్ స్ట్రీట్‌లో మాల్గుడి లక్షణాలున్నాయంటాడు ఆర్కే.నారాయణ్.మాల్గుడి డేస్ లోని ఈ వూరు ప్రపంచంలోని పాఠకులను ఎంతప్రభావితంచేసిందంటే,చికాగో విశ్వవిద్యాలయంప్రెస్సు ఒక సాహిత్యపత్రాన్ని చిత్రించి,అందులోని భారతదేశంలోని చిత్రపటంలో మాల్గుడిని కూడా చూపించింది(రచయిత తనముందుమాటలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు).కొందరు పాఠకులఉహాగాన ప్రకారం,తమిళనాడులోనీ [[కోయంబత్తూరు]] కావొచ్చునని.కర్నాటకలోని '''లాల్గూడి '''యే మాల్గుడియని కొందరి భావన.
 
ఆచార్య సి.మృణాళిని అనువాదంచేసిన ,ఆర్కె,నారాయణ్ విరచితమైన ఈ పుస్తకంలో మొత్తం 32 కథలున్నాయి.అందులో మొదటి 16 కథలు '''జ్యోతిష్కుడి జీవితంలో ఒకరోజు ''' సంకలమునుండి,మరో ఎనిమిది కథలు '''లాలీరోడ్ '''సంకలమునుండి,చివరి ఎనిమిది కథలు '''అనంతర కథలు '''కథల సంకలమునుండి తెలుగులోకి అనువాదమొనర్చబడినవి.
"https://te.wikipedia.org/wiki/మాల్గుడి_కథలు" నుండి వెలికితీశారు