ఆంధ్ర మహాసభ (తెలంగాణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అసంపూర్తి}}
'''ఆంధ్ర మహాసభ''' (IAST: <nowiki>''</nowiki>Andhra Mahasabha<nowiki>''</nowiki>) [[నిజాం]] పాలనకు వ్యతిరేకంగా [[తెలంగాణా]] ప్రాంతపు తెలుగువారు[[తెలుగు]]<nowiki/>వారు ప్రారంభించిన [[సంఘం]]. [[తెలుగు]] భాషకు, తెలుగు సంస్కృతికి జరుగుతున్న ఆన్యాయాన్ని సహించలేక [[తెలంగాణ]] ప్రజలు ఆంధ్రమహాసభను[[ఆంధ్రమహాసభ]]<nowiki/>ను స్థాపించారు. 1920వ దశకము చివర్లో [[మాడపాటి హనుమంతరావు]] నేతృత్వములో తెలుగు ప్రజలు సంఘటితమై ఒక సంఘముగా ఏర్పడి 1930 నుండి 1945 వరకు 12 ఆంధ్ర మహాసభలు నిర్వహించారు. తెలంగాణా ప్రాంతములో ఆంధ్ర మహాసభ యొక్క కార్యకలాపాలు [[నిజాం]] వ్యతిరేకముగా ప్రజలలో చైతన్యము సృష్టించి తెలంగాణా సాయుధ పోరాటానికి దారితీసాయి.
 
ఆంధ్రమహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యులు: [[మాడపాటి హనుమంతరావు]],‌ [[రావి నారాయణరెడ్డి]], [[సురవరం ప్రతాపరెడ్డి]], [[బద్దం ఎల్లారెడ్డి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[దాశరథి కృష్ణమాచార్య]], [[పులిజాల వెంకటరంగారావు]], [[అళ్ళంపల్లి వెంకటరామారావు]], [[కాళోజీ నారాయణరావు]], [[కొండా వెంకట రంగారెడ్డి]], [[వట్టికోట ఆళ్వారుస్వామి]], [[పొట్లపల్లి రామారావు]], [[ఆరుట్ల రామచంద్రరెడ్డి]], ఇంకా చాలా మంది ఉన్నారు.
 
==నేపథ్యము==
[[భారతదేశం]]లోని సంస్థానాలలో కెల్లా [[హైదరాబాదు]] సంస్థానం పెద్దది. జనాభా ఒక కోటి ఆరవై లక్షలు. సంస్థానం కింద తెలంగాణ, మరాఠ్వాడ (మహరాష్ట్ర), కర్ణాటకలలోని భాగాలు ఉండేవి. 88 శాతం [[హిందువులు]]. మిగిలిన వారిలో అధిక భాగం [[ముస్లింలు]], [[క్రైస్తవులు]]. నిజాం పాలనలో మత స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉండేది. ఒకసారి [[దసరా]] పండుగ, [[మొహరమ్]] (పీర్ల పండుగ) ఒకేసారి వచ్చాయి. సర్కారు మాత్రం మొహర్రంని మాత్రమే అన్ని ప్రభుత్య కళాశాలలలో జరిపించింది. నవాబు యొక్క బ్రిటీషు ప్రభుత్వ రాజభక్తి వల్ల క్రైస్తవుల పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు.
 
===ఆర్యసమాజ్
పంక్తి 12:
 
==ఆంధ్ర మహాసభ అవిర్భావము==
[[1922]]లో హైదరాబాదులోని[[హైదరాబాదు]]<nowiki/>లోని వివేకవర్ధిని థియేటరులో ఒక హిందూ సాంఘీక సభ జరిగింది. ఆ సభలో ప్రసంగాలన్నీ [[ఉర్దూ]], [[మరాఠీ]] భాషలలోనే జరిగాయి. ఒకే ఒక వక్త - ఒక ప్లీడరు, తెలుగులో మాట్లాడబోగా సభ్యులంతా గేలి చేసి, గోల చేసి ఆతనిని మాట్లాడనివ్వలేదు. ఆ రోజుల్లో హైదరరాబాదు నగరంలో మహారాష్ట్రుల సంఖ్య తెలుగువారి కంటే చాల తక్కువ. అయినా అన్ని రంగాలలోను తమ ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉండేవారు. తెలుగు భాషకు మర్యాద, మన్నన ఉండేవికావు. ఆనాటి దుస్థితిని గూర్చి మాడపాటి హనుమంతరావు తన [[ఆంధ్రమహాసభ చరిత్ర]]లో వివరించాడు. ఆ సభలో తెలుగు భాషకు, తెలుగు వక్తకు జరిగిన అవమానాన్ని గమనించిన కొందరు యువకులు కలిసి, ఆంధ్రభాషకు, సంస్కృతికి నగరంలో సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో "ఆంధ్రజన సంఘం"ను స్థాపించారు. నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమానికి అదే నాంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు నిజాం రాష్ట్రంలోని అన్ని తెలుగు సంస్థలను కలిపి ఒక ఆంధ్రజన కేంద్ర సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఈ సంఘం సమావేశాలు జరుగుతూ ఉండేవి. ఆంధ్రభాష, ఆంధ్ర సంస్కృతి అభివృద్ధికి తీసుకొనవలసిన చర్యల గూర్చి, సాధక బాధకాలు గురించి చర్చించేవారు. నిజాం రాష్ట్రంలోని ఏ తెలుగు సంస్థ ఆయినా సరే, తమ ప్రతినిధిని ఈ కేంద్ర సంఘానికి పంపవచ్చును. ఈ కేంద్ర సంఘానికి మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా వుండేవాడు. రాష్ట్రంలోని తెలుగు సంస్థల అభివృద్ధికి కేంద్ర [[సంఘం]] ప్రచారకులను పంపించి తోడ్పడుతూ వుండేది. ఈ కాలంలో ఈ సంఘం "వెట్టిచాకిరి", "వర్తక సంఘం" అన్న రెండు ముఖ్యమైన కరపత్రాలను ప్రచురించింది.
 
==మహాసభలు==
;మొదటి ఆంధ్రమహాసభ:
ఆంధ్రజన కేంద్ర సంఘం ఆధ్వర్యాన తెలుగు భాష, సంస్కృతుల పునరుజ్జీవనం కోసం, ఫ్యూడల్ దురంతాలకు వ్యతిరేకంగానూ చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు వాగులన్నీ చేరిన మహానది అయినట్లుగా మహోద్యమ స్థాయికి చేరాయి. [[1930]]లో [[జోగిపేట]]లోప్రథమాంధ్ర మహాసభ జరిగింది. ఆ మహాసభకు రాష్ట్రంలోని తెలుగు ఉద్యమాలన్నీ వచ్చి కలిశాయి. [[రూపాయి]] రుసుము చెల్లించిన ప్రతివారు ఆ మహాసభకు ప్రతినిధే. అప్పటికి ఒక నిర్ధిష్టమైన నిబంధనావళి ఈ మహాసభకు లేదు. దానికి [[సురవరం ప్రతాపరెడ్డి]] అధ్యక్షత వహించాడు. ఈ మహాసభలో ఇతర సమస్యలెన్ని వున్నా, సాంఘిక సమస్యలే తీవ్రమైన చర్చకు వచ్చాయి. బాల్యవివాహాలు, [[వితంతు వివాహం|వితంతు]] వివాహాల మీద మహాసభ తీర్మానాలు చేసింది. ఈ సభలో మరాఠీ నాయకుడైన వామన్ నాయక్ ప్రధాన పాత్ర వహించాడు. ఆనాటికింకా ప్రజల్లో తగు చైతన్యం రాలేదనడానికి ఆ సభలో జరిగిన ఒక సంఘటన చెపితే చాలును. భాగ్యరెడ్డి అనే హరిజన నాయకుడు మహాసభకు ప్రతినిధిగా వచ్చాడు. అతను ఒక సమస్యపైన మాట్లాడబోయే సరికి సవర్ణులైన వర్తకులు కొందరు ఆసమ్మతిగా సభ నుంచి వెళ్ళిపోయారు. ఏది ఏమైనా ఈప్రథమాంద్ర మహాసభలో ఛాందసులదే పైచేయి ఆయింది.
 
;రెండవ ఆంధ్రమహాసభ:
నిజాం రాష్ట్ర రెండవ ఆంధ్రమహాసభ [[దేవరకొండ]]లో [[1931]]లో జరిగింది. అప్పటికే [[గాంధీ ఇర్విన్ ఒడంబడిక]] కుదిరింది. ఈ సభకు [[బూర్గుల రామకృష్ణారావు]] అధ్యక్షుడు. ఈ మహాసభలో కూడా సాంఘిక సమస్యలే ప్రముఖ స్థానం వహించాయి. మొదటి మహాసభలో ప్రధానపాత్ర వహించిన వామన్ నాయక్‌కు ప్రత్యర్థిగా రెండవ సభలో మరో మరాఠీ నాయకుడు కేశవరావు కూడా వచ్చాడు. సాంఘిక సమస్యలపైన వీరిద్దరికీ మహాసభలో తీవ్రమైన వాగ్వాదాలు జరిగాయి. కేశవరావు సంస్కరణవాది. యువకుల కృషితో ఈ మహాసభలో ఛాంధసులు ఓడిపోయారు. చర్చలలో [[మరాఠీ భాష|మరాఠీ]] నాయకులు ప్రధానపాత్ర వహించినప్పటికీ చర్చలన్నీ తెలుగులోనే[[తెలుగు]]<nowiki/>లోనే జరిగాయి. తీర్మానాలు మాత్రంప్రథమ మహాసభలాగే ఈ మహాసభలో కూడా ప్రభుత్వాన్ని ప్రార్థించి, ప్రాధేయపడే రీతిగానే ఉన్నాయి.
 
;మూడవ ఆంధ్రమహాసభ:
రెండవ ఆంధ్రమహాసభ జరిగిన తర్వాత ప్రభుత్వ దృష్టి పూర్తిగా యిటు పడింది. ఆంధ్రమహాసభల నిర్వహణకు అనుమతి దొరకడం కష్టమైంది. ఎట్టకేలకు అనుమతి సంపాదించేసరికి మూడేళ్ళు పట్టింది. అందుకనే తృతీయ ఆంధ్రమహాసభను [[1934]]లో జరపవలసి వచ్చింది. ఇది [[ఖమ్మం]]లో జరిగింది. ఆనాడు ఖమ్మం, [[వరంగల్లు]] జిల్లాలో ఉండేది. ఖమ్మం ఆంధ్ర మహాసభకు [[పులిజాల వెంకటరంగారావు]] అధ్యక్షత వహించారు. ప్రతి ఆంధ్రమహాసభ సందర్భంలోనూ మహిళాసభ కూడా జరగడం రివాజు. ఈ మహాసభలో ప్రవేశపెట్టడానికి వీలులేదని [[ప్రభుత్వం]] నిషేధించిన తీర్మానాలను మహిళా మహాసభలో ప్రవేశపెట్టారు.
 
;నాల్గవ ఆంధ్రమహాసభ:
నాల్గవ ఆంధ్రమహాసభ [[1935]] డిసెంబరులో [[సిరిసిల్ల]]లో జరిగింది. దీనికి [[మాడపాటి హనుమంతరావు]] అధ్యక్షుడు. వివిధ విషయాలపై అనేక తీర్మానాలు ఆమోదించాల్సిన మహాసభ గతానుగతంగానే నడిచింది. ఆంధ్రోద్యమానికి వ్యవస్థాపకుడు ఆయిన మాడపాటి హనుమంతురావు మహాసభకు, ఆయన సతీమణి మాణిక్యమ్మ మహిళా మహాసభకు ఆధ్యక్షత వహించటం ఈ మహాసభ ప్రత్యేకత. మారాఠీ నాయకుల ప్రాబల్యంతో ప్రారంభం ఆయిన ఆంధ్రమహాసభలో దేవరకొండ సభ నాటికే అందరూ తెలుగులోనే మాట్లాడటం మొదలు పెట్టేరు. ఆరోగ్యకరంగా సాగుతున్న ఈ పరిణామాలు సిరిసిల్ల మహాసభలో తీవ్రతరమయ్యాయి. ఆంధ్రమహాసభ వ్యవహరాలన్నీ తెలుగులోనే జరగాలనీ, తీర్మానాలు, ప్రసంగాలు అన్నీ తెలుగులోనే ఉండాలని భాషావాదులు మహాసభ నిబంధనావళిలో పెట్టేరు. నిజాం సంస్ధానంలో తెలుగు భాషకు, సంస్కృతికి[[సంస్కృతి]]<nowiki/>కి జరుగుతున్న ఆన్యాయాన్ని ఎదుర్కొనడం కోసం ఉద్రిక్తులైన కొందరు యువకులు ఆలాంటి క్లాజును చేర్పించారు. అందుకని వారి సదుద్దేశాన్ని ఎవరూ శంకించవలసిన పనిలేదు. అయితే [[రావి నారాయణరెడ్డి]] ఈ క్లాజును సమర్థించలేదు.
 
;ఐదవ ఆంధ్రమహాసభ:
పంక్తి 31:
 
;ఆరవ ఆంధ్రమహాసభ:
ఆరవ ఆంధ్రమహాసభ [[1937]]లో [[నిజామాబాదు]]లో జరిగింది. దీనికి [[మందుముల నరసింగరావు]] ఆధ్యక్షత వహించాడు. భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాజు వలన ఎదురైన దుష్ఫలితాలు ఈ మహాసభలో మరీ స్పష్టంగా బయటపడ్డాయి అని రావి నారాయణరెడ్డి అన్నాడు. మరాఠా నాయకుడైన కాశీనాథరావు ముఖ్ పాల్కర్, మౌల్వి గులాం భషానీ, వీరిద్దరూ ఆహ్వాన సంఘం సభ్యులు. మహాసభ నియమావళి మేరకు వీరిద్దరూ కూడా విషయ నిర్ణయసభకు ఎన్నికైనారు. ఈ సభలో వీరు ఆంధ్రేతర భాషలో మాట్లాడ్డానికి ప్రయత్నించారు. అందుకు భాషావాదుల క్లాజు అడ్డం వచ్చింది. నియమావళిలోని 31వ క్లాజు ప్రకారం ఆంధ్రేతర భాషలో ఎవరూ ప్రసంగించడానికి వీల్లేదని నందగిరి వెంకటరావు నాయకత్వాన భాషావాదులు అభ్యంతరం లేవదీశారు. దీనిపైన విషయ నిర్ణయసభలో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చివరికి రావి నారాయణరెడ్డి జోక్యంతో వారికి మాట్లాడే ఆవకాశం లభించింది. రాజకీయ హక్కులు ఏ కోశానాలేని ఆ రోజుల్లో మహాసభ నాయకులు తమకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పుకున్నా అప్పటికున్న చట్టాలకు లోబడి అతికష్టం మీద సభను నిర్వహిస్తూ వున్నా ఆసలు ఆంధ్రోద్యమం పుట్టుకలోనే గల రాజకీయ ప్రాముఖ్యాన్ని విస్మరించరాదు. ఆనాడు రాష్ట్రం నలుచెరగులా ఆంధకారంఅంధకారం వ్యాపించి ఉంది. ఆలాంటి రోజుల్లో ఆంధ్రోద్యమం ఒక చిన్న దీపంలాగా వెలిగేది. ప్రజలకు మార్గం చూపించేది.
 
;ఏడవ ఆంధ్రమహాసభ: