ముదిగంటి సుజాతారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహిళా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 29:
 
==సాహిత్యసేవ==
కథ, నవల, యాత్రా కథ, సాహిత్య విమర్శ, [[సాహిత్యం|సాహిత్య]] చరిత్ర గ్రంథాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఈమె. ఎన్నో గ్రంథాలకు సంపాదకత్వం వహించింది. ఎన్నో కథలు, సాహిత్య వ్యాసాలు వివిధ పత్రికలల్లో ప్రచురితాలైనాయి. ఈమె నవలలు, కథలు హిందీ, ఇంగ్లీషు భాషలలోనికి తర్జుమా చేయబడ్డాయి. ఈమె తన రచనలలో తెలంగాణ భాషలో తెలంగాణ జీవితాన్ని, [[వ్యవసాయదారుడు|రైతుల]], సామాన్య జనుల, ఛిద్రజీవితాలను చిత్రించింది. సాఫ్ట్‌వేర్ రంగపు జీవితాలను, సన్నగిల్లుతున్న మానవ జీవితాలను, కుటుంబ వ్యవస్థలను ప్రపంచీకరణం, వ్యాపారీకరణం, మార్కెట్ వాదం కళ్ళకు కట్టేటట్లు తన కథలలో వర్ణించింది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని, చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలంగాణ సాహిత్య చరిత్రను వెలువరించడంలో [[మహిళ]]<nowiki/>గా ఈమె అగ్రస్థానంలో ఉంది. ‘రస చర్చ – ఆధునికత’లో సుజాతారెడ్డి ‘రస సిద్ధాంతాన్ని’ నవలకు కూడా వర్తింప జేయవచ్చునని ప్రతిపాదించింది.
 
==రచనలు==