గిడుగు వేంకట సీతాపతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 45:
1945లో [[మాగంటి బాపినీడు]] సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో [[తెలుగు భాషా సమితి]] ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. [[సూర్యరాయాంధ్ర నిఘంటువు]]కు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.
 
వీరు రచించిన [[తెలుగు]] కావ్యాలలో ముఖ్యమైనవి: '[[భారతీ శతకము(గిడుగు సీతాపతి)|భారతీ శతకము]]', 'సరస్వతీ విలాసము', 'కొద్ది మొర్ర'. వీరు రాసిన 'బాలానందము' వంటి బాల [[సాహిత్యం|సాహిత్య]] రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు [[బైబిల్]] లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. [[కేంద్ర సాహిత్య అకాడమీ]] వారి అభ్యర్ధనపై [[తెలుగు సాహిత్య చరిత్ర]]ను ఇంగ్లీషులోకి[[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లోకి అనువదించారు. వీరు రచించిన 'తెలుగులో ఛందోరీతులు' అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
 
వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. [[పర్లాకిమిడి]] తాలూకాను [[ఒడిషా]] రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు [[లండన్]] వెళ్ళి, శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒడిషా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.
 
తండ్రి అనంతరం [[రాజమండ్రి]] చేరిన సీతాపతి రాజకీయాలలో పాల్గొని జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.