నిత్య సంతోషిణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
'''నిత్య సంతోషిణి''' పేరు పొందిన తెలుగు గాయని. ఈమె మొదట శాస్త్రీయ సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని ఆలపించి ప్రజల అభిమానాన్ని చూరగొంది. ఆ తరువాత లలిత సంగీతం, సినిమా సంగీతం పాడటం మొదలు పెట్టింది. ఈమె తల్లి రామలక్ష్మి పద్మాచారి సంగీత ప్రియురాలు. ఆమెనే నిత్య సంతోషిణి ప్రథమ గురువు. ఈమె సంగీతపాఠాలను చిన్నతనం నుండే వినడం వల్ల సంగీతం పట్ల అభిరుచి ఏర్పడింది. తరువాత ఈమె తంపెల్ల సూర్యనారాయణ, ఆకెళ్ల మల్లికార్జునశర్మల వద్ద సంగీతం అభ్యసించింది. ఈమె తన అక్కతో కలిసి అనేక శాస్త్రీయ సంగీత, భక్తి సంగీత కచ్చేరీలను ఇచ్చింది. ఎన్నో భక్తి పాటల ఆల్బమ్‌లను విడుదల చేసింది<ref>{{cite news|last1=editor|first1=metroplus|title=Awards make me tense|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/awards-make-me-tense/article5954223.ece|accessdate=13 April 2017|work=The Hindu|date=24 April 2014}}</ref>.
==సినిమా సంగీతం==
ఈమెకు 1998లో నిర్మించిన [[నీలి మేఘాలు]] సినిమాలో పాట పాడటానికి తొలి అవకాశం లభించింది. ఆ సినిమా సంగీత దర్శకుడు దుగ్గిరాల. అది మొదలు ఈమె ఎన్నో తెలుగు, కన్నడ చిత్రాలలో నేపథ్య గానాన్ని పాడింది.
|