పల్లవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి పల్లవుల శిల్పశైలి
పంక్తి 11:
స్కందవర్మ తరువాత బుద్ధవర్మ కుమారుడగు రెండవ కుమారవిష్ణువు రాజయ్యాడు. ఈతని తరువాత మొదటి స్కందవర్మ కుమారుడు వీరవర్మ రాజరికము గ్రహించాడు. వీరవర్మ కుమారుడు రెండవ స్కందవర్మ, అతని కుమారుడు మొదటి సింహవర్మ వరుసగా రాజ్యం చేశారు. క్రీ.శ. 300ప్రాంతమున సింహవర్మ ఇక్ష్వాకులను కూలద్రోశాడు. తరువాత పినతండ్రి విష్ణుగోపుని సాయంతో మూడవ స్కందవర్మ రాజయ్యెను. క్రీ. శ. 345లో విష్ణుగోపుడు రాజ్యము చేయాల్సివచ్చింది. ఈసమయములో ఉత్తరదేశమునుండి [[సముద్రగుప్తుడు]] దక్షిణదేశదండయాత్రకై వచ్చి [[శాలంకాయనుల]]ను, పలక్కడలో ఉగ్రసేనుని, తరువాత విష్ణుగోపుని జయించి తిరిగివెళ్ళాడు. క్రీ. శ. 360లో విష్ణుగోపుని మరణానంతరము ఆతని అన్న మనుమడు మొదటి నందివర్మ రాజయ్యాడు. క్రీ. శ. 383లో విష్ణుగోపుని కుమారుడు రెండవ సింహవర్మ రాజై పల్లవరాజ్యానికి పూర్వప్రతిష్ఠలు కలిగించాడు. ఈతని అనంతరము కుమారుడు రెండవ విష్ణుగోపుడు, మనుమడు మూడవ సింహవర్మ, మునిమనుమడు మూడవ విష్ణుగోపుడు, మునిమునిమనుమడు నాలుగవ సింహవర్మ క్రమముగా రాజులైరి. నాలుగవ సింహవర్మ [[విష్ణుకుండిన]] రాజులగు ఇంద్రభట్టారక వర్మ, రెండవ విక్రమేంద్ర వర్మలకు సమకాలీనుడు. క్రీ. శ. 566లో సింహవర్మను రెండవ విక్రమేంద్ర వర్మ జయించాడు. దీనితో పాకనాటికి ఉత్తరాననున్న తెలుగుదేశం విష్ణుకుండినుల వశమైనది. అదే సమయములో కళభ్రులను యోధజాతి (జైనులు) [[కంచి]]ని వశముచేసుకొన్నది. పల్లవరాజన్యులు పాకనాటిలో తలదాచుకున్నారు. పల్లవ సామ్రాజ్యం అంతరించిపోయింది.
 
===పల్లవుల శిల్పశైలి===
 
పల్లవుల శిల్పశైలి విజాతీయ శైలి అని కొదంరు శాస్త్రజ్ఞల అభిప్రాయము. దీనికి ఆధారముగా వీరు మహాబలి పురము నందు గల గంగావతరణ శిల్ప చిత్రములోని దిగువున జటామకుటధారి చేతిలో '''కార్నుకోపియా''' అనే లేడికొమ్ము ఆకారపు పాత్ర ధిరించాడు, ఇది వస్త్రము కానేకాదు, అట్లాంటి పాత్ర మనదేశానిది కాదు అన్నది వీరి విషయము. మరియొక ఆధారముగా పల్లవులు శిల్పించిన సింహపుజూలు రింగురింగులూ- గాంధార బుద్ధిని జుట్టు రీతిగా- తీర్చి ఉంటుంది.మహిషమర్దిని చిత్రములో ఆమెవాహనమూ ధర్మరాజ సింహాసమనే బండకు ఒక అంచునగల సింగపుజూలు, పల్లవుల స్తంభాలకూ దిగువునగల సింహాల జూలూ రింగు రింగులుగానే ఉంటుంది అనునది మరియొక అభిప్రాయము.
"https://te.wikipedia.org/wiki/పల్లవులు" నుండి వెలికితీశారు