విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 105:
| demographics1_info1 = [[తెలుగు]]
}}
'''విజయవాడ''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో రెండవ అతి పెద్ద నగరం<ref>https://en.wikipedia.org/wiki/List_of_cities_in_Andhra_Pradesh_by_population</ref>. [[కృష్ణా జిల్లా]] లో, [[కృష్ణా నది]] ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర [[కోస్తా]] ప్రాంతంలో ప్రసిద్ధ [[వ్యాపారి|వ్యాపార]]<nowiki/>కేంద్రం. [[చెన్నై|మద్రాసు]]-[[హౌరా]] మరియు మద్రాసు-[[ఢిల్లీ]] [[రైలు మార్గం|రైలు]] మార్గములలో [[విజయవాడ]] వస్తుంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో విజయవాడ అతి పెద్ద కూడలి. [[భారత దేశము|భారత దేశం]] లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను '''బెజవాడ''' అని కూడా పిలుస్తారు. విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత [[కనకదుర్గ|కనక దుర్గ]] ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఇక్కడ ఉన్న అనేక కార్పొరేటు విద్యాసంస్థల వలన దీనికి విద్యలవాడ అనే పేరు కూడా వచ్చింది. ఎండాకాలములో మండిపోయే ఇక్కడి ఎండలను[[ఎండ]]<nowiki/>లను చూసి [[కట్టమంచి రామలింగారెడ్డి]] ఇది [[బెజవాడ]] కాదు ''బ్లేజువాడ'' అన్నాడట.
 
విజయవాడ, పడమరన [[ఇంద్రకీలాద్రి పర్వతం|ఇంద్రకీలాద్రి]] పర్వతములతో, ఉత్తరాన [[బుడమేరు]] నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది. [[కృష్ణా జిల్లాలోజిల్లా]]<nowiki/>లో 61.8 చదరపు కి.మీ. విస్తీర్ణములో ఉంది. [[2001]] జనాభా లెక్కల ప్రకారం విజయవాడ జనాభా 851,282. అంతేకాదు విజయవాడ కృష్ణా జిల్లాకు వర్తక/[[వాణిజ్యం|వాణిజ్య]] రాజధాని.
 
== స్థల నామకరణ ==
విజయవాడకు ఆ పేరు రావటం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఇలా సాగుతుంది: [[పంచపాండవులు|పాండవులు]] వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు, వారిని వేద[[వ్యాసుడు]] కలిసి, వారిలో ఒకరిని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రమును పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి ఆర్జునుడిని ఎన్నుకొంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతముపై (ఇంద్రకీలాద్రి) ఒంటికాలిపై, చేతులు పైకెత్తి, పంచాగ్నుల మధ్య (నాలుగు సృష్టించినవి ఐదవది సాక్షాత్తూ సూర్య భగవానుడు), ఘోరమయిన [[తపస్సు]] చేసాడు. [[శివుడు]], అర్జునుడి భక్తికి[[భక్తి]]<nowiki/>కి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపము ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ [[ఎలుగుబంటి]] అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడయిన అర్జునుడు వెంటనే తన విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి [[బాణము]] విసురుతాడు. అదే సమయములో వేటగాని రూపములో ఉన్న [[శివుడు]] కూడా బాణము విసిరుతాడు. ఈ రెండు [[బాణము]]<nowiki/>లు ఒకేసారి తగిలి, ఎలుగుబంటి మరణిస్తుంది. ఇద్దరూ ఆ ఎలుగును చంపింది తానంటే తానేనని తగువుకి దిగుతారు. మాటలు కాస్తా యుద్ధానికి దారితీస్తుంది. అర్జునుడు ఎంత గొప్పవీరుడయినా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా ఆలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగమును[[శివ లింగము|శివలింగము]]<nowiki/>ను తయారు చేసి పూజిస్తాడు. తాను [[శివ లింగము|శివలింగము]] మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి, సాక్షాత్తూ శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై, అర్జునుడు కోరుకునే పాశుపతాస్త్రమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి వారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇంద్రకీలాద్రిపై బోలెడన్ని రాతి గుడులు ఉండేవి. కాలక్రమంలో అవి శిథిలమైపోయాయి. రాళ్ళ కోసం క్వారీలలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు బయటపడ్డాయి. వాటిని భద్రపరిచారు.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు