ప్రహ్లాదుడు: కూర్పుల మధ్య తేడాలు

79 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి
==హిరణ్యకశిపుని మరణం==
 
ప్రహ్లాదుడు పెరుగుతూ హరిభక్తిని కూడా పెంచుకొంటుంటాడు. తండ్రికి అది ఇష్టముండదు. హరి మనకు శత్రువు, అతడిని ద్వేషించమని చెప్తాడు. అయినా హరినామ స్మరణ చేస్తూ తన తోటి వారిని కూడా హరి భక్తులుగా మార్చుతుంటాడు. అనేక విధాలుగా చెప్పి చెప్పి విసిగిన [[హిరణ్యకశిపుడు]] ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని చంపుటకు తీసుకొని పోయిన వారు అతడిని అనేక విధాలుగా చంపుటకు ప్రయత్నించిననూ ప్రహ్లాదుడు హరి ప్రభావము వలన చనిపోడు. హిరణ్య కశిపుని వద్దకు వచ్చి వారు మహారాజా! పాములతో కరిపించితిమి, కొండలపై[[కొండ]]<nowiki/>లపై నుండి తోయించితిమి, ఏనుగులతో[[ఏనుగు]]<nowiki/>లతో తొక్కించితిమి, మంటలలో[[అగ్ని|మంట]]<nowiki/>లలో వేయించితిమి, సముద్రములో పడవేసితిమి అయిననూ ప్రహ్లాదునికేమియు అవ్వలేదని చెపుతారు. హిరణ్యకశిపుడు తన చేతులతో విషము తాగించినా ప్రహ్లాదుడు చనిపోక తనను అనుక్షణం ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటాడని చెపుతాడు. నిన్ను రక్షించిన శ్రీహరి ఎక్కడున్నాడని అడిగిన తండ్రితో సర్వాంతర్యామి అయిన [[శ్రీహరి]] ఎక్కడైనా, అంతటా తానై ఉంటాడని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభములో ఉంటాడా నీ శ్రీహరి చూపించు అని, స్తంభమును బ్రద్దలు కొడతాడు హిరణ్యకశిపుడు. స్తంభమునుండి [[నృసింహావతారము]]న వెలువడిన శ్రీ మహావిష్ణువు పగలు రాత్రి గాని సంధ్యా సమయమున, ఇంటి బయటా-లోపలా కాని గడపపై, మానవ శరీరము-జంతువు కాని నృసింహావతార రూపములో, [[ఆయుధం|ఆయుధము]] లేకుండా తన వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు.
 
==భార్య - కుమారులు==
2,03,115

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2111459" నుండి వెలికితీశారు