కంకణ (కన్నడ సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ఒకరోజు దసరాపండుగ సందర్భంగా ఊళ్ళో ఏర్పాటు చేయబడిన ఎక్జిబిషన్‌కు రమ తన తమ్ముళ్ళను తీసుకుని బయలుదేరింది. అక్కడ ఆమెకు అమృత కనిపించింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగ, సుశీల అడంబరమైన అలంకరణలతో విలాసంగా వెళ్తూ వుండడం చూశారు. సుశీల తప్పుదారిలో నడుస్తున్నట్లుగా రమతో చెప్పింది అమృత.
 
స్నేహితురాలిగా తనకున్న సహజమైన ఆతృతను దాచుకోలేక, సుశీల శ్రేయస్సును కాంక్షించే ధోరణిలో ఆమెకు సలహా చెబుదామని వెళ్ళింది రమ. సుశీల తన సంగతిని దాటవేస్తూ నాగేంద్రను గురించి అడిగేసరికి రమ విస్తుపోయింది.
 
సితారు మాస్టారు సాల్డాన్హాను ప్రేమించిన వేదవల్లి ఒకరోజు అతనితో కలిసి లేచిపోతుంది తనను అతను జీవితాంతం కపాడతాడన్న నమ్మకంతో. కొన్ని రోజుల తర్వాత ఆ సంగతి తెలుసుకున్న రమ వేదవల్లి బాగోగులు తెలుసుకుందామని ఆమె ఇంటికి వెళ్ళి అక్కడి స్థితి చూసి దిగ్భ్రాంతి చెందుతుంది. ఆప్పటికే సాల్డాన్హా గర్భవతి అయిన వేదవల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆమె మానసిక సంక్షోభాన్ని చూడలేక సాల్డాన్హా ప్రతిరూపాన్ని చూడడానికి ఇష్టపడని వేదవల్లి కోరిక మేరకు రమ సుశీలలు ఆమెకు సహాయపడి, వల్లిని ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చుతారు.
 
సమాజంలో స్త్రీలు అడుగడుగునా వంచింపబడుతూ ఉండడం కళ్ళారా చూస్తున్న రమకు జీవితం పట్ల ఒక విధమైన విరక్తి ఏర్పడుతుంది. ఇంతలో స్వయాన తన చెల్లెలే సినిమా గ్లామరు పట్ల ఆకర్షితురాలై - పేపరులోని ఒక ప్రకటన చూసి - తన ఫోటోను పంపించడానికి ఉద్యుక్తురాలౌతుంది. ఆమె సాహసానికి ఆశ్చర్యపడిన రమ - తన తమ్ముడు కేవలం చాక్లెట్ల కోసం డబ్బు దొంగిలించే స్థితికి దిగజారడం చూశాక - ఆమెలో సంఘర్షణ ప్రారంభమౌతుంది.
 
సమాజంలో ఆర్థికపరంగా ఉన్న తేడాలు, వాటి ఫలితంగా ఏర్పడే పరిణామాల కారణంగా మనుషులు ఏ విధంగా పతనమయ్యేదీ చూస్తూ ఉన్న ఆమె - తన భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయానికి వచ్చింది.
 
తరచుగా తన మేనల్లుడికి సంబంధాలు చూడడానికి ప్రయత్నించే పండిట్ అలవాటు ప్రకారం
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కంకణ_(కన్నడ_సినిమా)" నుండి వెలికితీశారు