పాపఘ్ని: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''పాపాఘ్ని''' [[పెన్నా నది]]కి ఉపనది. పాపాఘ్ని నది [[కర్ణాటక]] రాష్ట్రం, చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని సిడ్లఘట్ట గ్రామం వద్ద పుట్టి, [[చిత్తూరు]] జిల్లా ద్వారా [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]]<nowiki/>లో ప్రవేశిస్తుంది. [[పాలకొండ]] శ్రేణుల గుండా ప్రవహించి, [[వైఎస్ఆర్ జిల్లా]] మైదానపు ప్రాంతంలోకి పారుతుంది. పాపాఘ్ని వైఎస్ఆర్ జిల్లాలోని [[కమలాపురం]] వద్ద పెన్నా నదిలో కలుస్తుంది. పాపాఘ్ని ఉపనదుల్లో మొగమేరు చెప్పుకోదగినవి. మొత్తం 205 కిలోమీటర్ల పొడవున్న పాపాఘ్ని నది యొక్క మొత్తం పారుదల ప్రాంతం 7,423 చ.కి.మీలు. ఇది మొత్తం పెన్నా నది పారుదల ప్రాంతంలో 14.14%. పాపాఘ్ని నది యొక్క పారుదల ప్రాంతం [[చిత్తూరు]], [[అనంతపురం]], [[వైఎస్ఆర్ జిల్లా]]<nowiki/>లో ఉన్నా, ప్రధాన భాగం చిత్తూరు జిల్లాలోని పశ్చిమభాగంలోని కొండప్రాంతంలో ఉంది. [[వైఎస్ఆర్ జిల్లా]]లో ప్రవహించే పాపాఘ్ని పై [[గాలివీడు]] మండలం, [[వెలిగల్లు]] గ్రామం వద్ద మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
==పాపాఘ్ని మఠం==
పాపాఘ్ని నదీ తీర ప్రాంతంలో చిక్‌బళ్లాపూర్ వద్ద అత్యంత పురాతనమైన పాపాఘ్ని మఠం ఉంది.
"https://te.wikipedia.org/wiki/పాపఘ్ని" నుండి వెలికితీశారు