భాగ్యలక్ష్మి (1943 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
imdb_id = 0255837

'''భాగ్యలక్ష్మి''' 1943లో వెలువడిన తెలుగు సినిమా. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి లెక్కల ప్రకారం ఇది 100వ తెలుగు టాకీ సినిమా. చిత్తూరు నాగయ్య నిర్మాతగా ఇది తొలి సినిమా.
==కథ==
ధర్మన్నకు తిరుపతిలో ఒక పిల్లవాడు దొరికితే తెచ్చుకుని, శ్రీనివాసరావు అనే పేరు పెట్టి పెంచుకున్నాడు. ఆ అబ్బాయి పుట్టుపూర్వోత్తరాలు ధర్మన్నకు తెలియవు. శ్రీనివాసరావు విద్యాబుద్ధులు నేర్చుకుని సంగీతంలో కూడా ప్రావీణ్యం సంపాదించి బడిపంతులుగా ఉంటున్నాడు. ఊరి వారందరికీ శ్రీనివాసరావు అంటే అమితానురాగం. ధర్మన్న పొరుగింట్లో రంగమ్మ అనే ఆమె ఉంటున్నది. ఆమె ధర్మన్నకు దూరపు బంధువు. రెండిళ్ళ మధ్య గోడ అడ్డుగా ఉన్నా రెండు కుటుంబాలూ ఒకే ఇంట్లో ఉన్నట్టే ఉంటున్నాయి. రంగమ్మకు ఇద్దరు సంతానం. గోపి, భాగ్యలక్ష్మి. గోపి శ్రీనివాసరావులు ప్రాణమిత్రులు. భాగ్యలక్ష్మి అంటే కూడా శ్రీనివాసరావుకు అమిత ప్రాణం. భాగ్యలక్ష్మి చిన్నతనం నుంచీ ధర్మన్న దగ్గరే పెరిగింది. శ్రీనివాసరావు ఆటా, పాటా నేర్పి విద్యావంతురాలిని చేశాడు. భాగ్యలక్ష్మి, శ్రీనివాసరావులకు ఈడొచ్చినాసరే, వారి స్నేహాన్ని ఎవరూ అనుమానించలేదు. భాగ్యలక్ష్మి అమాయకురాలు. తన అన్నతో ఆడుకున్నట్టే, శ్రీనివాసారావుతోనూ ఆడుకుంటున్నది. ఆ యిద్దరూ ఒకరి హృదయాన్ని మరొకరు తెలుసుకోకుండా కాలం గడుపుతున్నారు.
Line 36 ⟶ 37:

==తారాగణం==
[[చిత్తూరు నాగయ్య]](శ్రీనివాసరావు),
[[మాలతి]] (భాగ్యలక్ష్మి),
[[దొరస్వామి]],
[[టి.సూర్యకుమారి]],
[[గిరి]] (విశ్వనాధరావు),
[[వెల్లాల ఉమామహేశ్వరరావు|ఉమామహేశ్వరరావు]],
[[కమలా కోట్నీస్]],
ఎన్.ఎస్.కృష్ణన్,
టి.ఎ. మధురం,
గౌరీపతి శాస్త్రి,
పార్వతీబాయి

==సాంకేతికవర్గం==
* పాటలు, మాటలు : [[సముద్రాల రాఘవాచార్య]]
* సంగీతం : భీమవరపు నరసింహారావు
* ఛాయాగ్రహణం : ఎం.వి.రెహమాన్
* శబ్దగ్రహణం: ఎ.కృష్ణన్
* కళ : ఎన్.వి.ఎస్.రామారావు
* నృత్యం :శ్రీనివాస కులకర్ణి
* కూర్పు : టి.ఎ.ఎస్.మోని
* స్టిల్స్: ఎం.సత్యం

==పాటలు==