లక్ష్మీదీపక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Laxmideepak.jpg|thumb|right|300px|లక్ష్మీదీపక్]]
'''లక్ష్మీదీపక్''' తెలుగు సినిమా దర్శకుడు. ఇతడు [[హైదరాబాద్]]లో [[1935]]లో జన్మించాడు. ఇతని అసలు పేరు లక్ష్మీనారాయణ. ఇతడి చదువు ఉర్దూ మాధ్యమంలో సాగింది. ఇతడు హైస్కూలు చదువుకొనే సమయంలోనే సినిమాల పట్ల ఆకర్షితుడై దర్శకుడు కావాలనే కోరికను పెంచుకున్నాడు. హిందీ సినిమారంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని 1958లో బొంబాయి వెళ్ళాడు. కానీ అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. తిరిగి హైదరాబాదు వచ్చేశాడు. హైదరాబాదులో ఇతనికి [[అట్లూరి పూర్ణచంద్రరావు]], [[ప్రత్యగాత్మ]], [[గుత్తా రామినీడు]]లు పరిచయమయ్యారు. [[గుత్తా రామినీడు|రామినీడు]] ఇతనికి తొలిసారిగా [[చివరకు మిగిలేది (సినిమా)|చివరకు మిగిలేది]] సినిమాలో సహాయ దర్శకుడిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చాడు. తరువాత [[గుత్తా రామినీడు|రామినీడు]] , [[కొల్లి హేమాంబరధరరావు|హేమాంబరధరరావు]]ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నాడు. మద్రాసులో ఇతడు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న సమయంలో ఇతనికి నటుడు [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]] పరిచయమై స్నేహితుడిగా మారాడు. [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]] తన స్వంత బ్యానర్ బి.ఎస్.మూవీస్ బ్యానర్‌పై [[పచ్చని సంసారం]] సినిమా తీస్తూ ఇతడికి మొదటి సారిగా దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఆ సమయంలోనే లక్ష్మీనారాయణ పేరును లక్ష్మీదీపక్‌గా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఇతడు సుమారు 30 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇతడి సినిమాలు ఎక్కువ భాగం విజయవంతమయ్యాయి. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకోవడమే ఇతని విజయాలకు కారణం. ఇతని మొదటి, చివరి సినిమాలకు [[మందాడి ప్రభాకర రెడ్డి|ప్రభాకరరెడ్డి]] నిర్మాత కావడం గమనార్హం. ఎన్నో ఉదాత్తమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఇతడు [[2001]], [[జూన్ 10]]వ తేదీన మరణించాడు<ref>మన లక్ష్మీదీపక్ - హెచ్.రమేష్ బాబు - బతుకమ్మ(ఆదివారం అనుబంధం) - [[నమస్తే తెలంగాణ]] - 10 జూన్ 2012 - పేజీలు 12,13</ref>.
 
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీదీపక్" నుండి వెలికితీశారు