బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
== జననం ==
[[కృష్ణా జిల్లా]], [[అవనిగడ్డ]] దగ్గర [[పోతుగడ్డ]] లో [[1936]], [[ఫిబ్రవరి 9]] న జన్మించాడు.
 
శాస్త్రి మేనమామ కొటేశ్వరరావు స్వతహాగా [[హరిదాసు]]. ఉత్తమ [[గాయకుడు]]. [[మేనమామ]] పర్యచేక్షణలో [[పద్యాలు]], పాఠాలు శ్రావ్యముగా పాడుట నేర్చుకున్నాడు. వానపాముల సత్యనారాయణ వద్ద పద్యాలు భావయుక్తముగా పాడుట, [[చిత్రకళ]]<nowiki/>లోని మెలకువలు నేర్చుకున్నాడు. శాస్త్రి నటనా విశిష్ఠత గుర్తించిన బి.వి. నరసింహారావు నాట్యశాస్త్రములోని నూతన ప్రయోగ రీతులన్నీ నేర్పాడు. శాస్త్రి అన్న తగినంత ప్రోత్సాహమిచ్చి నాటకరంగాన నిలిపి ఉత్తమ [[స్త్రీ]] పాత్రధారిగా తీర్చి దిద్దాడు. అకుంఠిత కార్యదీక్షతో ఉత్తమ [[స్త్రీ]] పాత్రలైన [[సత్యభామ]], [[చింతామణి (నాటకం)|చింతామణి]], [[సక్కుబాయి (సినిమా)|సక్కుబాయి]], చంద్రమతి, [[మోహిని]], [[మాధురి (సినిమా)|మాధురి]] మొదలైన పాత్రలు ధరించి ఆంధ్ర దేశ ముఖ్య పట్టణాలలో స్త్రీ పాత్రధారణలో "ఔరా" అనిపించుకున్నాడు. స్వంతంగా [[సత్యసాయిబాబా]] నాటక సమాజము స్థాపించి నాటక ప్రదర్శనలిచ్చి రసజ్ఞులందరి మెప్పు పొందాడు. శాస్త్రి పాత తరం నటుల సంప్రదాయాలైన [[క్రమశిక్షణ]], పట్టుదల, నిరంతర అన్వేషణ, నిత్యసాధన, కొత్త ప్రయోగాలపై తపన, ఆశయసాధన కనిపిస్తాయి.
 
శాస్త్రి స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక నూతనత్వం గోచరిస్తుంది. [[కవి]] సృష్టించిన పాత్రకు న్యాయము చేస్తూ, మరొకవైపు [[సృజనాత్మక కవులు - పగటి కలలు|సృజనాత్మక]] రూపం పాత్రకు ఆపాదింపచేసి సజీవ [[శిల్పం]] తో రాణింపు కలగచేస్తాడు. భావయుక్తమైన [[సంభాషణ]] విధానమూ, ఆ విధానానికి తగిన సాత్విక చలనమూ, ఆ చలనముతో సమ్మిళితమైన నేత్రాభినయనమూ, పలుకూ, కులుకూ, సొంపూ, ఒంపూ, హొయలు, ఒయ్యారాలతో నాట్యమయూరిలా, [[శృంగారం|శృంగార]] రసాధిదేవతగా ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరయ్యేటట్లు నటించేవాడు. చూపు మన్మధ బాణంలా ఉండేది. ప్రేక్షకుల కరతాళధ్వనితో నిండిపోయేది. శాస్త్రి స్త్రీ పాత్రాభినయానికి ముగ్ధులైన [[విశ్వనాధ సత్యనారాయణ]] "నాట్యాచార్య" బిరుదునిచ్చాడు. ఆంధ్ర ప్రజానీకం "అభినయ సరస్వతి" అని, కొండవీటి వెంకటకవి "నాట్యమయూరి" అని బిరుదులిచ్చారు. అనేక చోట్ల ఘన సన్మానాలు, [[బంగారు]] కంకణాలనూ అందుకున్నాడు.
 
1937లో చలనచిత్ర రంగం లో ప్రవేశించి పోతన, [[స్వర్గసీమ]], [[వేమన]], [[పెద్ద మనుషులు]], [[త్యాగయ్య]], నా యిల్లు, [[రామదాసు]] చిత్రాల్లో నటించాడు.