కంచర్ల సుగుణమణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
భర్త ఉద్యోగరీత్యా [[అరకు]] వెళ్ళినప్పుడు అక్కడి గిరిజనుల పూరిళ్ళు, ఆహారం, భాష, కట్టుబాట్లు విచిత్రంగా వుండటం ఆమె గమనించింది. అక్కడి అనారోగ్యాలూ, విషజ్వరాలూ, కొండదేవతలకిచ్చే నరబలులు, జంతుబలులూ చూసి చలించిపోయి, మద్రాసులోని స్త్రీ శిశు సంక్షేమ అధికారి పారిజాతం నాయుడికి లేఖ వ్రాసింది. ఆమె సహకారంతో ఒక సంక్షేమ కేంద్రాన్ని స్థాపించి, తమ కాలనీలోని స్త్రీల సహకారంతో పిల్లలకు చదువు, ఆటపాటలు, కుట్లు, పారిశుధ్యం నేర్పుతూ సుగుణమణి ఐదు సంవత్సరాలు వారికి సేవ చేసింది. ఇప్పటికీ అక్కడ ఆ కేంద్రంలో స్త్రీలకు, పిల్లలకు చదువు, వృత్తివిద్యలు, ఆరోగ్యసూత్రాలు నేర్పుతున్నారు.
===ఆంధ్రమహిళాసభ===
ఈమె దుర్గాబాయమ్మ కోరిక మేరకు 1957 అక్టోబర్‌లో హైదరాబాదు వచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంది. ”ఆంధ్రమహిళాసభ” హైదరాబాద్‌ శాఖను అప్పటి రాష్ట్రపతి [[బాబూ రాజేంద్ర ప్రసాద్‌ప్రసాద్]] ప్రారంభించాడు. అప్పుడు విద్యానగర్‌లో ప్రారంభించిన ”ఆంధ్రమహిళాసభ” మెటర్నిటీ హాస్పిటల్‌, హేండీక్రాఫ్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌, హైస్కూల్‌, హాస్టల్‌, అసెంబ్లీహాల్‌లతో నిండిపోతే, ఉస్మానియా యూనివర్సిటీలో కూడా స్థలం తీసుకుని ఆర్ట్స్‌, సైన్స్‌, లా కాలేజీలు, కంప్యూటర్‌ కోర్స్‌, సంగీతం క్లాసులు, లిటరసీ భవన్‌, గాంధీభవన్‌, హాస్టల్‌, వికలాంగుల స్కూలు, ఫిజియోథెరపీ, నర్సింగు హాస్టల్‌ అలా ఎన్నో ఏర్పాటు చేశారు. 260 మంది పిల్లలు ఎన్నో వృత్తి విద్యలు నేర్చుకుంటున్నారు.
మద్రాసు, హైదరాబాద్‌లలోనే కాకుండా, కర్నూలు, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఇబ్రహీంపట్నంలలో కూడా ఆంధ్రమహిళాసభ ఎంతో కృషి చేస్తున్నది. ఎడల్ట్‌ ఎడ్యుకేషన్‌ రూరల్‌ ఏరియాలలో లిటరసీ హౌస్‌ దక్షిణ భారతంలో ”ఆంధ్రమహిళాసభ”లో మాత్రమే వున్నది. వాలంటరీ సెక్టార్‌లో కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఇచ్చే మొదటి సంస్థ యిదే. ఇన్ని సంస్థలు దుర్గాబాయమ్మ తదనంతరం కూడా అంత ఘనంగానూ నడుస్తున్నాయంటే, అది ఈమె ఓర్పు, నేర్పు, సహనం, సమయపాలనల వల్లనే.
 
”ఆంధ్రమహిళ” పత్రిక పూర్తి బాధ్యత సుగుణమణి తీసుకుంది. అందులో [[కనుపర్తి వరలక్ష్మమ్మ]], [[ఆచంట రుక్మిణమ్మ]], [[కాంచనపల్లి కనకాంబ]] మొదలైన ఆనాటి ప్రముఖ రచయిత్రుల వ్యాసాలను ప్రచురించటమే కాదు, తనూ స్వయంగా వ్రాసి పత్రికను తీర్చిదిద్దింది.
ప్రూఫులు దిద్దటం దగ్గరనుంచీ, స్టాంపులు అంటించి నడిచివెళ్ళి పోస్ట్‌ చెయ్యటం దాకా అన్ని బాధ్యతలూ ఈమే నిర్వర్తించేది.
 
===ఆంధ్ర బాలానందసంఘం===
"https://te.wikipedia.org/wiki/కంచర్ల_సుగుణమణి" నుండి వెలికితీశారు