గారె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Gare-vada-.jpg|left|thumb|గారెలు]]
'''గారెలు''' అనగానే ప్రతీ [[తెలుగు]] వారికి ఒక లోకోక్తి గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." అనేవారు. గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని [[కొబ్బరి]] పచ్చడి తో గాని, [[వేరుశనగ]] పప్పు పచ్చడి తో గాని, [[శనగ]] పప్పు పచ్చడి తో గాని, [[అల్లం]] పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. కొందరు గారెలను బెల్లపు పాకంలో ముంచి మరికొద్దిరోజులు నిలువ ఉంచుతారు. ఇవి మరింత రుచికరంగా కూడా ఉంటాయి. తెలుగువారి ప్రతి [[పండుగలు|పండుగకు]] ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని [[ఆవడలు]] అంటారు. వీటి రుచి అమోఘం. గారెలలో మరికొన్ని రకాలు కూడా కలవు. అవి మినప గారెలు, పెసర గారెలు, చెక్క గారెలు, శనగ గారెలు.
 
గారెలు మరింత రుచిగా ఉండుటకు నూతనంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. మినుములతో పాటు కొద్దిగా [[బొబ్బర్లు]], కొద్దిగా [[జీడిపప్పు]], కొంత [[బంగాళాదుంప]] కలపడం జరుగుతుంది. వీటి కలయికతో గారె రుచి మరింత పెరుగుతుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/గారె" నుండి వెలికితీశారు