సురభి కమలాబాయి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[సురభి కమలాబాయి]]''' ([[1907]] - [[1971]]) తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని.<ref name="సినిమా వ్యాసాలు">{{cite book|last1=కుటుంబరావు|first1=కొడవటిగంటి|title=వ్యాస ప్రపంచం 4, సినిమా వ్యాసాలు - 1|date=డిసెంబరు 2000|publisher=విప్లవ రచయితల సంఘం|location=విశాఖపట్నం|page=7|edition=మొదటి|url=http://dli.ernet.in/handle/2015/489095|accessdate=21 September 2016}}</ref> ఈమె [[1931]]లో [[హెచ్.ఎం.రెడ్డి]] నిర్మించిన తొలి తెలుగు టాకీ చిత్రము [[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]] లో లీలావతి పాత్ర ధరించింది.
 
== జననం ==
కమలాబాయి [[1907]]లో [[సురభి నాటక సమాజం|సురభి నాటక కళాకారుల]] [[కుటుంబము]]<nowiki/>లో జన్మించింది. ఈమె తండ్రి కృష్ణాజీరావు. తల్లి వెంకూబాయి కమలాబాయితో [[గర్భవతి]]గా ఉండి ఒక నాటకములో [[దమయంతి]] పాత్ర వేస్తున్నప్పుడు పురిటినొప్పులు రాగా తెరదించి ఆ రంగస్థలముమీదే కమలాబాయిని ప్రసవించడం విశేషం. [[ప్రేక్షకులు]] ఇదికూడా నాటకములో భాగమనుకొన్నారు. తీరా విషయం తెలిసిన తర్వాత ప్రేక్షకులు చంటిబిడ్డ మీద డబ్బుల వర్షం కురిపించారు.
 
[[దస్త్రం:Surabhi Kamalabai.JPG|thumb|right|సురభి కమలాబాయి]]
 
రంగస్థల కుటుంబంలో పుట్టిన కమలాబాయికి చిన్నప్పటి నుండే నటన అలవాటయ్యింది. బాల్యంలో కృష్ణుని[[కృష్ణుడు|కృష్ణు]]<nowiki/>ని, ప్రహ్లాదుని[[ప్రహ్లాదుడు|ప్రహ్లాదు]]<nowiki/>ని పాత్రలు వేస్తుండేవారు. యుక్తవయసు వచ్చిన తర్వాత మగపాత్రలు ఆపేసి ఆడపాత్రలు ధరించడం ప్రారంభించింది. అందరూ మహిళలే నటించి విజయవంతమైన సావిత్రి నాటకంలో ఆమె సావిత్రి పాత్రను పోషించింది.
 
==భక్త ప్రహ్లాద ==
పంక్తి 49:
 
==సినీ ప్రస్థానం==
కమలాబాయి ప్రతిభ గురించి విని, ప్రత్యక్షంగా చూసి ముగ్ధుడైన సాగర్ ఫిల్మ్ అధినేత కమలాబాయిని [[బొంబాయి]]కి ఆహ్వానించాడు. అక్కడే పదేళ్లపాటు ఉండి సాగర్ ఫిల్మ్ నిర్మించిన సినిమాలలో నటించింది. [[మహా భారతము|మహాభారతం]] వంటి 25 చిత్రాలలో నటించింది. [[హిందీ సినిమా రంగం|హిందీ]] సినిమాలలో నటిస్తున్నప్పుడే ఈమెకు సిగరెట్లు త్రాగటం అలవాటయ్యింది. షాట్ షాట్కి మధ్యలో ఆదరాబాదరాగా వెళ్ళి సిగరెట్టు త్రాగేది. సిగరెట్టు తనకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకునేది.
 
1939లో విడుదలైన [[భక్తజయదేవ]] సినిమాతో మళ్ళీ [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో నటించడం ప్రారంభించింది. విశాఖపట్నంలోని ఆంధ్రా సినీ టోన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగు, [[బంగ్లా భాష|బెంగాళీ]] భాషలలో నిర్మించారు. ఈ రెండు భాషలలోనూ కమలాభాయే కథానాయకి. ఆ చిత్రంలో రెంటచింతల సత్యనారాయణ, సురభి కమలాబాయి ముఖ్య పాత్రధారులు. ఆ చిత్రానికి హిరేన్ బోస్ అనే [[బంగ్లా భాష|బెంగాలీ]] ఆయన దర్శకుడు. అయితే ఆయన సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రం కావడంతో చిత్ర నిర్మాణం సరిగా సాగలేదు. నిర్మాణం ఆగిపోయి నిర్మాతలకు భారీగా నష్టం వచ్చే పరిస్థితిలో కథానాయిక పాత్ర ధరించడంతో పాటు దర్శకత్వం, ఎడిటింగ్ కూడా తనే నిర్వహించి, చిత్రాన్ని పూర్తి చేసి అందర్నీ ఆశ్చర్యపరచింది కమలాబాయి. అయితే చిత్రం టైటిల్స్ లో మాత్రం దర్శకుడిగా హిరెన్ బోస్ పేరే కనబడుతుంది.<ref>[http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_3792.html శిరాకదంబం: ఎప్పుడో ' లేచింది మహిళాలోకం ']</ref>
 
అలాగే తొలి ద్విభాషా చిత్రమైన [[తుకారాం]] (1940) తెలుగు వెర్షన్లో ఈమె నటించింది. అప్పటి వరకు కథానాయకి పాత్రలు పోషించిన కమలాబాయి ఆ తర్వాత సినిమాలలో కారెక్టర్ రోల్సు వెయ్యటం ప్రారంభించి. ఈ విధంగా నటించిన సినిమాలలో పత్ని, మల్లీశ్వరి, లక్ష్మమ్మ, [[పాతాళభైరవి]], సంక్రాంతి, [[అగ్నిపరీక్ష]] ముఖ్యమైనవి.
"https://te.wikipedia.org/wiki/సురభి_కమలాబాయి" నుండి వెలికితీశారు