వంగపండు ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
==జీవిత విశేషాలు==
ఈయన [[పార్వతీపురం]] దగ్గర [[పెదబొండపల్లి]]లో [[1943]] జూన్ లో జన్మించారు. తండ్రి జగన్నాధం తల్లి చినతల్లి.2008, నవంబరు 23 న తెనాలిలో ఈయనకు [[బొల్లిముంత శివరామకృష్ణ]] సాహితీ అవార్డును [[బి.నరసింగరావు]] చేతులమీదుగా ప్రధానం చేశారు.<ref>[http://www.hindu.com/2008/11/24/stories/2008112458330300.htm Vangapandu feted The Hindu నవంబర్ 24, 2008]</ref> ప్రజలకోసం బ్రతికిన [[నాజర్]] లాంటి కళాకారుడని [[వంగపండు]]ను పోలుస్తారు. వంగపండు ప్రసాదరావు, [[గద్దర్]]తో కలిసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన [[జన నాట్యమండలి]]ని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు [[తమిళం]], [[బెంగాళీ]], [[కన్నడ]] మరియు [[హిందీ]] వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి [[అమెరికా]], [[ఇంగ్లాండు]]లో అభిమానం చూరగొన్నది.<ref>[http://www.hindu.com/thehindu/mp/2004/08/02/stories/2004080201670300.htm Sings his way into hearts - The Hindu ఆగష్టు 02, 2004]</ref> విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. [[సుబ్బారావు పాణిగ్రాహి]], వంగపండు ప్రసాదరావు, [[గద్దర్]] మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళారు.
==వంగపండు భావాలు,అనుభవాలు ==
*పూజల పేరిట వృథాగా డబ్బు ఖర్చుపెట్టను. నా చిన్నతనంలో పంట నూర్పిళ్లప్పుడు రాత్రిపూట మా తాత వాళ్లు పొలం దగ్గరకి వెళితే నేనూ వాళ్లతో పోయేవాడిని. అప్పుడు మా తాత, నాయిన, పెదనాయిన దేవుళ్ల కథలు చెప్పేవారు. శివుడు, రాముడు, కృష్ణుడు గురించి చెబుతూ వాళ్లను తలుచుకుంటూ పడుకోమనేవారు.ఇన్నేళ్లయ్యాక కూడా ఇప్పుడు పడుకున్నాసరే నాటి సంఘటనలు, దేవుళ్ల కథలు అన్నీ గుర్తుకువస్తాయి,
*మాది విజయనగరం జిల్లా పెదగొండపల్లి. పెరిగింది గ్రామీణ వాతావరణం. సామాన్య రైతు కుటుంబం. ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ముగ్గురు అన్నదమ్ములం. నేనే పెద్దవాడిని. చదువు పెద్దగా అబ్బలేదు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫెయిల్‌ కావడంతో బొబ్బిలిలో ఐటీఐ చేశాను. అప్పట్లో చైనా యుద్ధంలో పాల్గొనాలనే పిలుపు వస్తే, ఆ ట్రైనింగ్‌ తీసుకున్నా. ఆ యుద్ధం ఆగిపోవడంతో ఊరుబాట పట్టా. అప్పటికే మా నాన్న ఊళ్లో భూమి అమ్మేసి, రాయగఢ్‌లో కొన్నాడు. అక్కడ ఆయనకు వ్యవసాయంలో కొన్నాళ్లు తోడుగా ఉన్నా. ఆ భూమి అడవికి దగ్గరగా ఉండేది. దీంతో అక్కడి గిరిజనులతో పరిచయాలు.. వారి పదాలు నా పాటల్లో బాగా దొర్లాయి. ఈ పనుల్లో పడి తెలిసిన పల్లె పదాలతో తోచిన బాణీలు కట్టుకుని పాడుతుంటే ఊళ్లో అంతా ‘ఓరేయ్‌ కవీ’ అని పిలిచేవారు. అప్పట్లో అర్థంకాని పదాలు రాస్తేనే కవిత్వం అనుకునేవాడిని. నేనేదో లల్లాయ పదాలతో పాటలు అల్లుకుపోయేవాడిని. నాచేత పాటలు పాడించుకుని, సరదా పడేవారు. అంతవరకు సరదా సరదాగా గడిచిపోయింది. పెళ్లైన రెండేళ్లకు మొదలైన నక్సల్స్‌బరి ఉద్యమం నాలో పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఎక్కడ ఉన్నా సరే ఉద్యమమే. అదే జీవితమైంది. ఆ ఉద్యమంలో ఎంతోమందిని కలిశా, ఎందరి కష్టాలనో చూశాను. జనాన్ని జాగృతం చేయడానికి వాటన్నిటినీ పాటగా రూపుకట్టా. ఆ ఊపులో 400కు పైగా జాన పద పాటలు రాసాను. వాటిలో 200కు పైగా గీతాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చాయి.
ఉద్యమంలోకి వెళ్లిన ఏడాదికే విశాఖ షిప్‌ యార్డులో ఫిట్టర్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగం కంటే ఉద్యమమే నాకు ఆత్మసంతృప్తినిచ్చేది. షిప్‌యార్డులో పని చేస్తూ ఉన్నా మనసంతా ఉద్యమం వైపే ఉండేది. దీంతో పదిరోజులు పనికెళ్లడం, ఇరవై రోజులు పాటలు పాడుకుంటూ ఊళ్లమ్మట పడి తిరగడం చేశా. అలా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ , కర్ణాటక రాష్ట్రాలన్నీ తిరిగా. ఇలా తిరుగుతూ ఉంటే ఏమౌతుంది.. ఇంట్లో పూట గడవని స్థితి. ఒక పూట తింటే మరో పూట పస్తే! అయినా సరే నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఆరేళ్ల సర్వీసులో ఉన్నా తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పూర్తిస్థాయి ఉద్యమంలోనే ఉన్నాను.
*మధ్యతరగతి కుటుంబాలకు ఉద్యమాలు కరెక్ట్‌ కాదని అనుకున్నా. ఉద్యోగం వదులుకున్నప్పుడైతే పడిన మానసిక క్షోభ మాటల్లో చెప్పలేను. ఇంట్లో నలుగురు పిల్లలు, భార్య. వారికి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేనప్పుడు ఈ ఉద్యమాలెందుకన్న ఆలోచన. బాగా మధనపడేవాడిని. మళ్లీ కొన్నాళ్లు సొంతూళ్లో వ్యవసాయం చేశాను. కలిసిరాలేదు. అన్నీ నష్టాలు. అప్పులు. ఆకలి బాధ కోసం ఆత్మాభిమానం చంపుకోకూడద నిపించింది. దీంతో మళ్లీ ఉద్యమం బాటే పట్టాను.
*దర్శకులు టి.కృష్ణ, ఆర్‌. నారాయణమూర్తిలతో పాటు మరికొందరు మా సినిమాలకు పాటలు రాయమని కోరారు. అలా 30 సినిమాల వరకు రాశాను. అలాగే ఆరేడు సినిమాల్లోనూ నటించాను. కొన్ని సినిమాలకు పాటలు రాసే అవకాశాలొచ్చినా జననాట్యమండలి నిబంధనలకు కట్టుబడ్డాను. వాటిని వదులు కున్నా. సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే నా జీవితం మరోలా ఉండేది.
*అదృష్టం, దురదృష్టం వంటి పదాలను ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. వాటి మీద నమ్మకమూ లేదు. ఇప్పటికైతే ఆస్తులూ లేవు, అప్పులూ లేవు. ఇది కావాలని కోరుకుంటూ ఎన్నడూ గుళ్లకు వెళ్లింది లేదు. కనపడని దైవాన్ని నిందించడం, కోపం తెచ్చుకోవడం అంటూ ఏముంటాయి. అప్పుడు మనలోని శక్తిని మనమే తిట్టుకున్నట్టు అవుతుంది కదా! దైవం, దైవత్వం అంటే ఆపదలో ఉన్నవాడికి సాటిమనిషిగా సాయపడటం అని నమ్ముతాను.ఆదిభట్ల కైలాసం అని నాకు మంచి మిత్రుడు. ఉద్యమకారుడు. నమ్మిన సిద్ధాంతం కోసం సెంటు భూమికూడా ఉంచుకోకుండా తనకున్న 150 ఎకరాలను నిరుపేదలకు రాసిచ్చేశాడు. ఆ భూములు పొందిన వారు ఇళ్లలో ఆయన్ని ఓ దేవుడిగా కొలుస్తారు. మూర్తీభవించిన మానవత్వానికి ఇంతకంటే ఉదాహరణ ఉంటుందా? ఇలాంటి వారు మన కళ్లెదుటే చాలా మంది ఉంటారు. మనం గమనించం. ఎదుటివాడికి సాయపడమనే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ బోధిస్తున్నాయి. మనమేం చేస్తున్నాం వాటిని మతగ్రంథాలుగానే చూస్తున్నాం.
*నాకు చిన్నప్పటి నుంచి శివుడంటే ఇష్టం. ఆయన చాలా సింపుల్‌గా ఉంటాడు. జంతు చర్మం కట్టుకుంటాడు. శ్మశానంలో తిరుగుతాడు. పిలవగానే పలుకుతాడని పేరు. ఆయన ది సామాన్యుల జీవితం. అందుకే చాలామంది శివుడ్నే కొలుస్తారు. అమ్మవారి మీదా, శివుడి మీదా .. ‘ఓమ్‌ ఉమాశంకరా .. వందిత పురంధరా.. హిమాచలాద్రి మందిరా.. ’ అంటూ చాలా పాటలు పాడాను. శివయ్య బుర్ర కథలకూ బాణీలు కట్టా. అలాగని, ఏనాడూ శివాలయానికి వెళ్లిందీ లేదు. ఇప్పుడు కూడా శ్రీకాకుళంలోని ఓ పల్లెటూరులో ‘శివకోలలు’ అని పండుగ జరుగుతుంది. దీనికి నన్ను అతిథిగా పిలిచారు. ఇక్కడ వేదిక మీద జానపద పాటలు పాడాలి. అన్నింటితో పాటు శివుడికి సంబంధించిన పాటలూ ఉంటాయి. దైవం అంటే భక్తి ఉండాలా, భయం ఉండాలా.. అంటే భక్తే ఉండాలంటాను. ఎందుకంటే మనం నమ్మి భక్తిగా ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది. భయంతో ఏ పని చేసినా ఫలితం దక్కదు.
 
==వంగపండు గీతాలు నృత్యరూపకాలు==
"https://te.wikipedia.org/wiki/వంగపండు_ప్రసాదరావు" నుండి వెలికితీశారు