గుర్రం మల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గుర్రం మల్లయ్య''' ప్రముఖ చిత్రకారుడు, శిల్పి మరియు స్వాతంత్య్ర సమరయోధుడు<ref>{{cite news|last1=అక్కల|first1=కోటయ్య|title=దేశభక్తుడు - చిత్రకారుడు|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11279|accessdate=30 January 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 67, సంచిక 294|date=7 November 1980}}</ref>.
==విశేషాలు==
ఇతడు బందరు జాతీయ కళాశాలలోని ప్రముఖ చిత్రకళా కోవిదులు ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద చిత్రకళను అభ్యసించాడు. ఇంటర్‌మీడియట్ వరకు చదివి తరువాత కలకత్తా వెళ్ళి అవనీంద్రనాథ్ ఠాగూర్‌వద్ద మూడు సంవత్సరాలు చిత్రకళాభ్యాసం చేశాడు. ఆ సమయంలో ఇతడు వేసిన చిత్రాలు, వ్రాసిన వ్యాసాలు బెంగాలీ భాషా పత్రికలలోను ఇతర భాషల పత్రికలలోను ప్రచురితమయ్యాయి.
పంక్తి 15:
 
ఇతడు కలకత్తాలో శిక్షణ పొందిన తరువాత తిరిగి బందరు వచ్చి జాతీయ కళాశాలలో చిత్రకళాధ్యాపకుడిగా చేరాడు. కళాశాలలో పనిచేస్తున్నప్పుడే గాంధీజీ పిలుపును అందుకుని మద్యపాన నిషేధము, విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పికెటింగులు నిర్వహించడంతో అరెస్టయ్యాడు. నాగార్జునకొండ నుండి కొన్ని అపురూపమైన శిల్పాలను విదేశీయులు తరలించుకు పోవడాన్ని గమనించి ప్రభుత్వానికి రిపోర్టు చేసి ఆ శిల్పసంపద మన దేశం నుండి తరలిపోకుండా కాపాడాడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఇక్ష్వాకుల కాలం నాటి విజయపురి శిథిలాలను, శిల్పాలను నీటిలో మునిగిపోకుండా భద్రపరచవలసిన ఆవశ్యకతను ఇతడు స్వయంగా నాటి ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]]కు విన్నవిస్తే నెహ్రూ స్వయంగా పరిశీలించి వాటి నమూనాలు తయారు చేయించి కొండపై మ్యూజియం ఏర్పాటు చేసి వాటిలో ఉంచవలసిందిగా ఆదేశించాడు. నెహ్రూ ఆదేశం ప్రకారం ఇతడే అన్ని నమూనాలు తయారు చేశాడు. నాగార్జున శిల్పకళ ప్రావీణ్యతను ప్రజలకు తెలియజేయడానికి ఇతడు [[కోలవెన్ను రామకోటేశ్వరరావు]]తో కలిసి నాగార్జున శిల్పకళా పీఠాన్ని నెలకొల్పి 11 సంవత్సరాలు అనేక మందికి శిక్షణ ఇచ్చి మంచి శిల్పులుగా తయారు చేశాడు. కోస్లా కమిటీని పల్నాడుకు రప్పించి, నంది కొండ ప్రాంతాలను చూపించి, వారు చూసిన, చూడదలచిన ప్రాజెక్టు ఏరియాలు అన్నిటి కంటే నందికొండ అనువైనస్థలమని వారికి నచ్చచెప్పి నాగార్జునసాగర్ ఆ ప్రాంతానికి రావడానికి ఇతడు చేసిన ప్రయత్నం ఎనలేనిది. ఇతడిని ఆచార్య రంగా "అభినవ బ్రహ్మన్న"గా వర్ణించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గుర్రం_మల్లయ్య" నుండి వెలికితీశారు