కె.వి.కె.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
== ఉద్యోగ ఆరంగేట్రం ==
లైబ్రరీ సైన్సు డిప్లొమా పొందిన తరువాత నరసరావుపేట పట్టణంలోని తను [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] చదివిన యస్.యస్.యన్.కళాశాలలోని గ్రంధాలయానికి 1965 జూన్ లో మొదటి లైబ్రేరియన్ గా చేరారు.ప్రధాన వృత్తిలోకి చేరినా ఆయనకు ఆసక్తి ఉన్న క్రీడా విభాగం,[[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] రంగాలను వదలి పెట్టలేదు.1965 కు ముందు కళాశాలలో ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి కావు.ఆసమయంలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఇలీంద్ర రంగనాయకులు ఉండేవారు.ఆయనకు కేవలం విద్యార్థుల చదువు మీద మాత్రమే శ్రద్ద చూపేవారు. సాంస్కృతిక,క్రీడా రంగాలు విద్యార్థుల చదువును దెబ్బ తీస్తాయని ఆయన ఒప్పు కునేవారు కాదు.ఆయనకు ఎవరైనా నచ్చ చెప్పాలన్నా భయపడేవారు.అలాంటి తరుణంలో రామారావు తనకు ప్రవృత్తిగా ఆసక్తి ఉన్న సాంస్కృతిక,క్రీడల రంగాలవైపు ప్రిన్సిపాల్ రంగనాయకులును ఒప్పించి ఆయనలో ఉన్న అభిప్రాయాన్ని మరలించారు.రామారావు కృషి వలన కళాశాలలో అంతర్ కళాశాలల నాటక పోటీలను కొన్ని సంవత్సరాలు వరుసగా ఆయన ఆధ్వర్యంలో జరిగాయి.[[కళాశాల]]<nowiki/>లోని లలిత కళాసమితి ఆద్వర్యంలో జరిగిన అనేక కార్యక్రమాలు రామారావురారావు డైరెక్షన్ తో జరిగాయి.
 
== ఈనాడు రామారావుగా గుర్తింపు ==
ప్రధాన వృత్తి, ప్రవత్తులకు తోడు ఈనాడు విలేకరిగా ----- లో చేరి, పట్టణంలోని, గ్రామాలలోని ప్రజలకు దగ్గరయ్యారు.ఈనాడు దిన పత్రిక కొత్తగా వెలువడే రోజుల్లో నరసరావుపేట పట్టణవార్తలుగాని,గ్రామాల వార్తలుగాని ముందుగా ఈనాడులో మాత్రమే వచ్చేవి.నిష్పక్షపాతంగా,జరిగినది జరిగినట్లుగా వార్తలు రాయటంలో రామారావుకు సరిలేరు. ఆ కారణంగా ఇంటిపేరు మరుగున పడి ఈనాడు రామారావు, ఈనాడు విలేఖరిగా ప్రజలకు దగ్గరయ్యారు. జిల్లాలో ఈనాడు విలేఖరిగా, ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు. నరసరావుపేట డివిజనుకు ఈనాడు వార్తల సేకరణ కేంద్రం నిర్వాహకునిగా పనిచేసారు.
"https://te.wikipedia.org/wiki/కె.వి.కె.రామారావు" నుండి వెలికితీశారు