మోల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
2 Mg(l) + TiCl<sub>4</sub>(g) → 2 MgCl<sub>2</sub>(l) + Ti(s), [Temp = 800–850 °C]
 
ఈ రసాయన సమీకరణంల్లో ఎడమ పక్కన ఉన్న ముడి పదార్థాలు ఆయా కొలతలతో వాడితే కుడి పక్కన చూపిన లబ్ది పదార్థాలు వస్తాయి. ఎడమ పక్కన ఉన్న 2 Mg (l) అంటే ద్రవ రూపంలో ఉన్న 2 మోలుల మెగ్నీసియం. కుండలీకరణలలో ఉన్న l అనే అక్షరం liquid అని చెబుతొంది. తరువాత TiCl<sub>4</sub> (g) అంటే ఒక మోలు వాయు రూపంలో ఉన్న టైటేనియమ్ టెట్రా క్లోరైడ్ (టూకీగా, టికిల్ అంటారు). మెగ్నీషియంమెగ్నీసియం క్లోరిన్ తో కలిసి ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది కనుక పైన చూపిన రసాయన సంయోగం జరుగుతుంది. తరువాత కుడి వైపు ద్రవ రూపంలో ఉన్న మెగ్నీసియం క్లోరైడ్, ఘన రూపంలో టైటేనియమ్ వస్తాయి.
 
ఈ ప్రక్రియ జరగడానికి ముడి పదార్థాలని బిగుతుగా మూతి ఉన్న ఒక తొట్టెలో పెట్టి దానిని 800-850 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చెయ్యాలి. అప్పుడు తొట్టెలో అట్టడుగుకి బరువుగా ఉన్న టైటేనియమ్ లోహం మడ్డిలా దిగిపోతుంది. ఆ మడ్డి మీద తేలుతూ ద్రవ రూపంలో మెగ్నీసియం క్లోరైడ్, దాని పైన తేలుతూ ద్రవ రూపంలో ఉన్న మెగ్నీసియం, ఆ పైన తేలుతూ వాయు రూపంలో టికిల్, విడివిడిగా స్తరాల (layers) మాదిరి ఉంటాయి. అభిక్రియ ఉపలబ్ధులు కిందకి దిగిపోతూ ఉంటాయి కనుక పైన తేలుతున్న మెగ్నీసియం కి ఆ పైన ఉన్న ట్రికిల్ కి మధ్య అంతరాయం లేకుండా అభిక్రియ జరుగుతూనే ఉంటుంది.
పంక్తి 58:
 
కానీ సమీకరణం ఏమిటి చెబుతున్నది? ఒక పాలు టికిల్ కి రెండు పాళ్ళు మెగ్నీసియం ఉండాలంటోంది; కానీ కర్మాగారం యజమాని మంజూరు చేసిన ముడిసరుకులో టికిల్, మెగ్నీసియం దరిదాపు సమ పాళ్లల్లో ఉన్నాయి. కనుక టికిల్ లో ఉన్న టైటేనియమ్ అంతా టైటేనియం లోహంగా మారటం లేదు. మనకి ఉరమరగా 515 మోలుల టైటేనియం మాత్రమే వస్తోంది. (ఈ లెక్క కూడా పాఠకులు జాగ్రత్తగా చేసి చూడగలరు!) ఈ రకంగా లెక్క వేసి ముడి పదార్థాలు ఎంతెంత వాడాలో చూసుకుంటే రసాయన చర్య సమర్ధవంతంగా సాగుతుంది.
 
==మూలాలు==
వేమూరి వేంకటేశ్వరరావు, "మోలు అంటే ఏమిటి?," లోలకం, https://lolakam.blogspot.com/2018/02/blog-post.html
"https://te.wikipedia.org/wiki/మోల్" నుండి వెలికితీశారు