కోహినూరు వజ్రం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1913 ను 1913 గా మార్చాను |
|||
పంక్తి 7:
== చరిత్ర ==
భారతదేశానికి చెందిన ఓ అసాధారణ వజ్రం కోహినూరు<ref>ఘనమైన మరియు ప్రసిద్ధిగాంచిన వజ్రాలు; http://www.minelinks.com/alluvial/diamonds_1.html</ref>. కోహినూరు వజ్రం తెలుగునాట [[కొల్లూరు గనులు]]లో ఈ ప్రఖ్యాతమైన వజ్రం లభించింది. మాల్వా రాజు [[మహలక్ దేవ్]] దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ఆయన చేతిలో క్రీ.శ.1300లో ఈ వజ్రం ఉండేదని, క్రీ.శ.1305లో వింధ్యకు నర్మదకు మధ్యభాగాన్ని దాదాపు వేయి సంవత్సరాలు పరిపాలించిన మాల్వా పాలకవంశాన్ని తుదకు అల్లాఉద్దీన్ జయించి అక్కడి ధనరాశులన్నిటితో పాటుగా కోహినూరును కూడా స్వాధీనం చేసుకున్నారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=kathalu%20gaathalu%20modat%27i%20bhaagamu&author1=raavu%20digavalli%20vein%27kat%27a%20shiva&subject1=GENERALITIES&year=1944%20&language1=Telugu&pages=168&barcode=2030020024649&author2=&identifier1=&publisher1=digavalli%20vein%27kat%27a%20shiva%20raavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT©rightowner1=©rightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/740|accessdate=1 December 2014}}</ref> చాలామంది చరిత్రకారుల ప్రకారం కాకతీయ చక్రవర్తి [[ప్రతాపరుద్రుడు]] క్రీ. శ. 1310 లో ఢిల్లీ సుల్తాను పంపిన [[మాలిక్ కాఫుర్]]తో సంధిచేసుకొని అపారమైన సంపదతో బాటు , కోహినూరు వజ్రము సమర్పించుకున్నాడు.<ref>India Before Europe, C.E.B. Asher and C. Talbot, కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్, 2006, ISBN 0-521-80904-5, p. 40</ref><ref>A History of India, Hermann Kulke and Dietmar Rothermund, Edition: 3, Routledge, 1998, p. 160; ISBN 0-415-15482-0</ref>. ఢిల్లీ సుల్తానుల పరమైన కోహినూరు వజ్రం ఢిల్లీని పరిపాలించిన పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోఢి మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబరు చేతిలో ఓటమిపాలై, చివరకు మరణించారు. ఇబ్రహీం లోఢీ మరణానంతరం కోహినూరు వజ్రం సుల్తానుల ఖజానాతో పాటుగా బాబర్ వశమయ్యింది. హుమాయున్‌కు విపరీతమైన అనారోగ్యం చేసి మరణానికి సిద్ధమైనప్పుడు అతని తండ్రి బాబర్‌తో కొందరు ఆస్థానికులు తమకు అత్యంత ప్రియమైన అమూల్యవస్తువులు దానం చేయాల్సిందిగా సలహాఇచ్చారు. తనవద్దనున్న అత్యంత విలువైన కోహినూర్ వజ్రం ఎవరికీ ఇచ్చేందుకు సిద్ధపడలేదని, ఆపైన కొద్దిరోజుల్లో తన ప్రాణమే కొడుకు ప్రాణం నిలబెట్టేందుకు భగవదర్పణం చేసినా వజ్రాన్ని నిలపుకున్నారని అక్బరునామాలో వ్రాశారు. ఈ కారణంగా 1530లో మొఘలుల వద్ద ఈ వజ్రం ఉండేదన్న విషయం స్పష్టమైంది.
|