కంగనా రనౌత్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1987 జననాలు తొలగించబడింది; వర్గం:1986 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 23 మార్చి 1986 → 1986 మార్చి 23, శాఖాహార → శాకాహార, ) → ) , ( → ( (15) using AWB
పంక్తి 1:
'''కంగనా రనౌత్''' (జననం 231986 మార్చి 198623) ప్రముఖ భారతీయ నటి. బాలీవుడ్ లో అతి ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఈమె ఒకరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలోనూ, ఫ్యాషన్ గా ఉండే నటిగానూ మీడియాలో ఎక్కువ ప్రసిద్ధమయ్యారు కంగనా. ఆమె ఇప్పటివరకూ మూడు జాతీయ పురస్కారాలు, నాలుగు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్నారు.
 
[[హిమాచల్ ప్రదేశ్]] లోని భంబ్లా అనే పల్లెటూరిలో జన్మించారు కంగనా.  ఆమె  తల్లిదండ్రుల గట్టి పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని  అనుకునేవారు ఆమె చిన్నప్పుడు. కానీ తన 16వ ఏట తన  కెరీర్ తానే నిర్మించుకోవాలనే సంకల్పంతో ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ  తరువాత కొన్నాళ్ళకు మోడల్ అయ్యారు కంగనా. నాటక దర్శకుడు అరవింద్ గౌర్ శిక్షణలో నటన నేర్చుకున్న ఆమె 2006లో గాంగ్ స్టర్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారామె. వోహ్ లమ్హే (2006), లైఫ్ ఇన్ ఎ.. మెట్రో (2007), ఫ్యాషన్ (2008) సినిమాల్లోని ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కంగనా. ఈ మూడు సినిమాలకు జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారాలు అందుకున్నారు ఆమె.
 
రాజ్: ది మిస్టరీ కంటిన్యూస్ (2009), వన్స్ అపాన్ ఎ టైమిన్ ముంబై (2010) వంటి హిట్ సినిమాల్లో నటించారు కంగనా. మానసిక ఇబ్బందులతో ఉండే పాత్రల్లో ఎక్కువగా నటించడంతో కొన్ని విమర్శలు ఎదురైనా, ఆమె నటనకు మాత్రం ప్రశంసలే లభించాయి. 2011లో మాధవన్ తో కలసి నటించిన తను వెడ్స్ మను సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె గ్లామర్ పాత్రల్లో నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. [[హృతిక్ రోషన్|హృతిక్]] సరసన ఆమె నటించిన క్రిష్ 3 (2013) సినిమా బాలీవుడ్ లో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో  ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటించిన క్వీన్ (2014) సినిమాలో ఆమె నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడమే కాక జాతీయ, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు కంగనా. 2015లో తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు ఆమె. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ విమర్శకుల పురస్కారం, వరుసగా రెండో జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు లభించాయి.
 
== తొలినాళ్ళ జీవితం, నేపథ్యం ==
23 మార్చి 1986న [[హిమాచల్  ప్రదేశ్]] మండి జిల్లాలోని భంబ్లా  అనే చిన్న పట్టణం (ప్రస్తుతం సురజ్ పూర్) లో రాజ్ పుత్ కుటుంబంలో  జన్మించారు కంగనా.<ref><cite class="citation news">ANI (21 May 2016). </cite></ref><ref><cite class="citation news">Singh, Prashant (23 March 2013). </cite></ref><ref name="hit"><cite class="citation web">Deshmukh, Ashwini (1 July 2011). </cite></ref><ref name="debut"><cite class="citation news">Sharma, Chander S. (21 December 2004). </cite></ref> ఆమె తండ్రి అమర్ దీప్ రనౌత్  వ్యాపారవేత్త, తల్లి ఆశా పాఠశాలలో ఉపాధ్యాయిని.<ref name="biography"><cite class="citation web">[http://zeenews.india.com/entertainment/celebrity-profile/Kangna-Ranaut.htm "Biography of Kangna Ranaut"]. </cite></ref> ఆమెకు అక్క రంగోలీ, తమ్ముడు అక్షత్  ఉన్నారు.<ref name="think"><cite class="citation news">Singh, Suhani (5 March 2014). </cite></ref><ref name="peek"><cite class="citation news">KBR, Upala (3 December 2010). </cite></ref> కంగనా ముత్తాత సంజు సింగ్ రనౌత్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఆమె తాత  ఐ.ఎ.ఎస్ అధికారిగా పనిచేశారు.<ref name="toi"><cite class="citation news">Gupta, Priya (13 March 2013). </cite></ref> భంబ్లాలోని వారి పూర్వీకుల హవేలీలో ఉమ్మడి కుటుంబంలో పెరిగారు కంగనా.<ref name="peek" /><ref name="cosmo"><cite class="citation news">Dobhal, Pratishtha (October 2010). </cite></ref>
 
చిన్నప్పట్నుంచీ పట్టుదల గల వ్యక్తిత్వం  తనదని వివరిస్తారు కంగనా. తన తండ్రి తమ్ముడికి ప్లాస్టిక్ గన్ తెచ్చి, తను ఆడుకోవడానికి మామూలు బొమ్మలు తెస్తే ఈ తేడా చూపొద్దనీ అబ్బాయిలు ఆడుకునేవాటితో తానూ ఆడుకుంటానని చెప్పవారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆమె.<ref name="htinterview"><cite class="citation news">Ahmed, Afsana (7 July 2013). </cite></ref> అందరు ఆడపిల్లలూ వేసుకునే బట్టలు కాక, తన కంటూ విలక్షణమైన ఫ్యాషన్ సృష్టించుకునేవారట కంగనా.<ref name="cosmo" /><ref name="htinterview" /> [[చండీగఢ్]] లోని డిఎవి పాఠశాలలో చదువుకున్నారు ఆమె. సైన్స్ బాగా ఇష్టంగా చదివేవారు. చదువులో ఎప్పుడు ముందు ఉండేవారట కూడా.<ref name="swan"><cite class="citation news">Thind Joy, Jagmita (23 April 2012). </cite></ref><ref><cite class="citation web">[http://movies.ndtv.com/bollywood/kangana-ranaut-enjoyed-the-anonymity-that-came-with-studying-abroad-492336 "Kangana Ranaut: Enjoyed the anonymity that came with studying abroad"]. </cite></ref> మొదట్లో తన తల్లిదండ్రుల పట్టుదల ప్రకారం డాక్టర్ అవ్వాలని అనుకునేవారు ఆమె.<ref name="doctor"><cite class="citation news">Nag, Nilanjana (1 June 2010). </cite></ref> అయితే 12వ క్లాస్ చదివేటప్పుడు ఒక యూనిట్ టెస్ట్ లో కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తన డాక్టర్ కలల్ని వదిలేసుకుని వైద్య విద్యకు ఎంట్రెన్స్ పరీక్ష అయిన అఖిలభారత వైద్య పరీక్షకు హాజరు కూడా కాలేదు కంగనా.<ref name="doctor" /> తన 16వ ఏట ఢిల్లీకి  నివాసం మార్చారు ఆమె.<ref name="think" /><ref name="soul"><cite class="citation news">[http://timesofindia.indiatimes.com/entertainment/bollywood/news-interviews/Kangana-Ranaut-bares-her-soul/articleshow/2497438.cms?referral=PM "Kangana Ranaut bares her soul"]. </cite></ref> వైద్య విద్య చదవనని ఆమె తీసుకున్న నిర్ణయంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లక్ష్యం లేకుండా ఉంటే తనకు నచ్చదని ఆమెపై వత్తిడి తీసుకొచ్చేవారట ఆమె తండ్రి.<ref name="htinterview" />
పంక్తి 22:
== వ్యక్తిగత జీవితం ==
[[దస్త్రం:Kangana_Ranaut.jpg|alt=Kangana Ranaut is walking the ramp|కుడి|thumb|2011 ఫెమినా మిస్ ఇండియా ఫంక్షన్ లో కంగనా]]
[[ముంబై]]<nowiki/>లో అక్క రంగోలీతో కలసి ఉంటారు కంగనా. ఆమె అక్క యాసిడ్ దాడి బాధితురాలు.<ref><cite class="citation web">Shetty-Saha, Shubha (10 March 2014). </cite></ref> ప్రతి ఏటా ఒకసారి తన స్వంత ఊరు భంబ్లాకు వెళ్తారు ఆమె.<ref name="htinterview" /> స్వామి వివేకానంద బోధనలు పాటించే కంగనా ధ్యానమే దేవునికి అసలైన పూజ అని భావిస్తారు.<ref><cite class="citation news">Gupta, Priya (28 October 2013). </cite></ref> శాఖాహారిశాకాహారి అయిన ఆమె 2013లో  పెటా సంస్థ నిర్వహించిన పోల్ లో భారత హాటెస్ట్ వెజిటేరియన్ గా ఎంపికయ్యారు.<ref><cite class="citation news">[http://indiatoday.intoday.in/story/kangana-ranaut-and-vidyut-jamwal-named-peta-hottest-vegetarians/1/334531.html "Kangana Ranaut, Vidyut Jamwal named PETA's hottest vegetarians"]. </cite></ref> నటేశ్వర్ నృత్య కళా మందిర్ లో 2009 నుండి కథక్ నేర్చుకుంటున్నారు కంగనా.<ref><cite class="citation news">Pinto, Rochelle (13 September 2013). </cite></ref> సినిమా అంటే మక్కువ ఉన్న కంగనా 2014లో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో రెండు నెలల స్క్రీన్ ప్లే రైటింగ్ కోర్సులో చేరారు.<ref><cite class="citation news">Gupta, Priya (9 January 2014). </cite></ref><ref><cite class="citation web">[http://www.firstpost.com/bollywood/dont-know-if-i-deserve-this-stardom-kangana-ranaut-1422393.html "Don't know if I deserve this stardom: Kangana Ranaut"]. </cite></ref> 
 
== సినిమాలు, పురస్కారాలు ==
పంక్తి 37:
 
=== పురస్కారాలు ===
ఫ్యాషన్ (2008) సినిమాకు జాతీయ ఉత్తమ సహాయ నటి పురస్కారం, క్వీన్ (2014), తను వెడ్స్ మను రిటర్న్స్ (2015) సినిమాలలోని నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు కంగనా. గాంగ్ స్టర్ (2006) సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఫ్యాషన్ (2008) సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి అవార్డు, క్వీన్ (2014), తను వెడ్స్ మను రిటర్న్స్ (2015) సినిమాలోని నటనకు విమర్శకుల ఉత్తమ నటి పురస్కారాలు పొందారు ఆమె. ఇప్పటికి 3 జాతీయ పురస్కారాలు, 4 ఫిలింఫేర్ పురస్కారాలు గెలిచారు కంగనా.<ref name="bio" /><ref name="ff15" /><ref name="ff16" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కంగనా_రనౌత్" నుండి వెలికితీశారు