నారాయణరావు పవార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎విధ్యభ్యాసం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ను → ను , → using AWB
పంక్తి 4:
నారాయణ రావు పవార్ [[1926]], [[అక్టోబరు]]3న [[వరంగల్లు]]లో జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు.ఈయన తండ్రి పండరీనాథ్ బీదర్ జిల్లా నుంచి వరంగల్ కు వలస వచ్చాడు.
==విధ్యభ్యాసం==
పవార్ ప్రాథమిక చదువంతా.. వరంగల్ లోనే జరిగింది. ఎనిమిదో తరగతి లోతరగతిలో ఉండగానే [[ఆర్య సమాజా]]నికి దగ్గరయ్యాడు. పండిత్ రుద్రదేవ్, పండింత్ నరేంద్రజీలను తన [[గురువు]]<nowiki/>లుగా ప్రకటించుకున్నాడు.1944 లో ఇంటర్ పాసై లా కోర్సు చేయాలని అందులో చేరినా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా దాన్ని కొనసాగించలేదు. రేషన్ డిపార్ట్ మెంటులో ఎన్యుమరేటర్ గా చేరి కొంత ఆర్థికంగా నిలదొక్కుకొని లా కోర్సు చేయడానికి [[హైదరాబాదు|హైదరాబాద్]] వెళ్లాడు.
==ఆర్య యువక్రాంతి దళ్==ష
ఇతను ఎనిమిదవ తరగతిలో వుండగానే [[ఆర్య సమాజం]]తో సంబంధాలుండేవి. ఆర్య సమాజానికి చెందిన [[పండిత రుద్రదేవ్]], [[పండిత నరేంద్రదేవ్]]లు ఈయనకి గురువులు. వారితో కలసి అప్పట్లో మత మార్పిడులను అడ్డుకునేవారు. రాత్రి పూట హరిజన బస్తీలలో బడులు నడిపి వారి పిల్లలకు విద్య గరిపే వారు. మాల మాదిగలతో తిరుగు తున్నందున తండ్రికి కోపంగా వుండేది. ఇంట్లోకి రావాలంటే బయటే బట్టలు తీసేసి, స్నానం చేసిన తర్వాత లోపలికి రానిచ్చే వారు. అలాగే నడుచుకున్న నారాయణరావు [[మహాత్మా గాంధీ]] అస్పృస్యత పై వ్రాసిన ఉపన్యాసా
పంక్తి 14:
హైదరాబాద్ వచ్చి వివరంగా ఒక ప్రతిజ్ఞా పత్రాన్ని తయారు చేశారు. వీరు నిజాంను ఎందుకు చంపాలను కున్నది? దాని సారాంశం ఒక పత్రంలో రాసి, ఆరాసిన నకలును నారాయణ స్వామి వద్ద వుంచారు. పథకం అమలు చేసిన రోజు నారాయణ స్వామి బెజవాడ వెళ్లి ఆనకలు పత్రాన్ని, ముగ్గురు మిత్రులు కలిసి తీసుకున్న పోటోను, పత్రికల వారికి, రేడియో వారికి అంద జేయాలని ముందె నిర్ణయించు కున్నారు. ప్రతిజ్ఞా పత్రంపై ముగ్గురు మిత్రులు....... అనగా నారాయణ రావు పవార్ [[జగదీష్,]] [[గండయ్య]] తమ రక్తంతో సంతకం చేశారు. డిసెంబరు నెల నాల్గవ తారీఖు 1947 సాయంకాలం నాలుగు గంటల సమయం..........[[కింగ్ కోటి]] రోడ్డు, నిజాం నివాసంముందు. రోడ్డు పై ముగ్గురు మిత్రులు దూర దూరంగా అక్కడక్కడా నిలబడాలి, మొదటి వ్యక్తి విఫలమైతే రెండో వాడు పని కానిచ్చాలి, అక్కడా తప్పితే మూడో వాడు పథకాన్ని అమలు కానివ్వాలి. ఇది వారి పథకం. కింగ్ కోఠి రోడ్డులో ప్రతి చౌరస్తా వద్ద ఒక పోలీసు మరొక జవాను ఉన్నారు. కానిస్టేబుల్ ట్రాపిక్ ను నియంత్రిస్తే జవాను ఆచుట్టు పక్కల తిరుగుతున్న జనాలపై నిఘా పెడుతున్నాడు.
 
నారాయణ రావు గల్లీలోంచి రోడ్డు పైకి వచ్చి తన [[సైకిల్]] ను గోడకు ఆనించాడు. ఇది జవాను గమనించాడు. అప్పటికే నిజాము కారు రెండో కానిస్టేబులు వద్దకు వచ్చింది. ఇంతలో నారాయణరావు సంచిలో నుండి బాంబును బయటి తీసి దాని 'పిన్' లాగి [[నిజాం]] వస్తున్న కారు పైకి విసిరాడు. అది పెద్ద శబ్దంతో పేలి పోయింది. అది పడ్డ ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ముగ్గురు సాధారణ పౌరులు తీవ్ర గాయ పడగా ఒక చిన్న పిల్ల అక్కిడికక్కడే మరణించింది. కారు మాత్రం తప్పించు కుంది. నారాయణ రావు జేబులో చేయి పెట్టి రివాల్వర్ తీసే లోపె జవాను వచ్చి అతని చెయ్యి పట్టుకున్నాడు. అతను విషం మింగే అవకాశం కూడా లేదు. బాంబు శబ్దం విన్న మిగతా ఇద్దరు పథకం సఫలం అయిందని అక్కడి నుండి తప్పుకున్నారు. లేక పోతే నిజాముకు ఇదే ఆఖరి రోజు అయ్యేది.
 
నారాయణ రావును పోలీసులు చుట్టుపక్కల వున్న ప్రజలు విచక్షణా రహితంగా కొట్టారు. ఒకడు రాయితో మూతి మీద కొట్టగా పళ్ళు రాలి పోయాయి. బాంబు పేలిన ప్రాంతంలో ఒక డాక్టర్ గారి ఇల్లు ఉంది. నిజాం కారు డ్రవర్ తెలివిగా కారును ఆ ఇంటి లోనికి పోనిచ్చాడు. నారాయణ రావు బాంబు వేస్తున్నప్పుడు మొదట చూసిన వ్యక్తి ఆ డాక్టర్ ఇంటి వాచ్ మాన్. అతను అరబ్బువాడు. వాడు నారాయణ రావును తన మొలలో వున్న బాకు తీసి చంప బోయాడు. అక్కడున్న ఇనస్పెక్టర్ చేయి అడ్డం పెట్టి "ఇప్పడే చంపొద్దు...రహస్యాలు రాబట్టాలి " అని వారించాడు. అతని చేతికి గాయం అయింది. కోర్టు విచారణలో కూడా ఈ అరబ్బు కాపలాదారుడే మొదటి సాక్షి. పోలీసు స్టేషనులో విచారణ సమయంలో నారాయణ రావుని నీవు హిందువువా మిస్లిం వా, నీ పేరేమిటని అడగ్గా హిందు/ ముస్లిం తేడా తెలియకుండా వుండ డానికి తన పేరు "బాబు" అని అన్నాడు. కాని పోలీసులు నారాయణ రావు బట్టలన్నీ వూడ దీసి అతను హిందువని నిర్దారించారు. ఇంతలో [[నైజామ్]] ప్రధాని [[మీర్ లాయక్ అలి]] అక్కడికి వచ్చి నారాయణ రావునుద్దేసించి "నిన్ను ఎవరు పంపారు? రాజ కుటుంబీకులా? లేక [[సర్దార్ పటేల్|సర్దార్ పటేలా?]] " అని ప్రశ్నించాడు. దానికి నారాయణ రావు తనే స్వయంగా ఈ పనికి పూనుకున్నానని చెప్పాడు. అలా రెండు రోజులు పలు రకాలుగా చిత్ర హింసలు పెట్టారు పోలీసులు. ఆ మరు దినం ఎదురు సెల్ గదిలో [[గండయ్య]] ఉన్నాడు. అతను అద్దెకు తీసుకున్న సైకిల్ పైన వున్న పేరును బట్టి దాని ఆధారంతో పోలీసులు గండయ్యను అరెస్ట్ చేశారని ఆ తర్వాతి తెలిసింది. పోలీసులు వరంగల్లు వెళ్లి నారాయణ రావు ఇంటిని శోధించారు. నారాయణ రావు తండ్రి తన కొడుకు అంత సాహసికుడు కాదన్నాడు. నిజ నిర్దారణకు, అతడిని హైదరాబాదు తీసుకొచ్చి ఖైదీని చూపగా అతడు తన కొడుకే నని ఒప్పుకున్నాడు. ఆ తండ్రి తన కొడుకు ఇంత పనిచేశాడని కోప్పడలేదు, కొట్టలేదు, అసహ్యించు కోలేదు. కొడుక్కి అంతా మంచి జరుగు తుందని, దేవుడు రక్షిస్తాడని, దైర్యం చెప్పాడు కొడుక్కు. నారాయణ రావు తన కేసును వాదించ డానికి ఏ వకీలును నియమించు కోలేదు. తన కేసును తనే వాదించు కున్నాడు. విచారణ సమయంలో నారాయణ రావు తండ్రి వచ్చి నప్పుడు మిఠాయి తెచ్చి ఇచ్చే వాడు. దైర్యం చెప్పేవాడు. నారాయణ రావు విచారణ సందర్భంలో తను తయారు చేసుకున్న ప్రతిజ్ఞా పాటాన్ని మళ్లి, మళ్ళి చెప్పేవాడు. నారాయణ రావు తండ్రి తనయుడి విడుదల కొరకు, పండరి నాథుడు విఠల్ దేవునికి మొక్కుకొని జుట్టు, గడ్డం, మీసాలు పెంచి సాధువులా జీవించాడు. చివరకు అత్యున్నత న్యాయస్థానం నారాయణ రావు పవార్ కు [[ఉరి శిక్ష]] విధించింది. అపుడు నారాయణ రావు పవార్ గర్వంగా "సర్ కటా సక్తే హై లెకిన్ స్ర్జుఆ సక్తే నహీ" అని[[పండిత రాం ప్రసాద్ బిస్మిల్ల]] కవిత చరణాలను బిగ్గరగా పాడుకున్నాడు.<ref>ఆంధ్ర జ్యోతి ఆదివారం. 23 జనవరి; 2011</ref>
"https://te.wikipedia.org/wiki/నారాయణరావు_పవార్" నుండి వెలికితీశారు