ఈక: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 62 interwiki links, now provided by Wikidata on d:q81025 (translate me)
చి →‎క్విల్ ఈక నిర్మాణము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
పంక్తి 13:
[[దస్త్రం:Parrot-feather.jpg|thumb|Featherstructure of a [[Blue-and-yellow Macaw]]]]
క్విల్ ఈకలు పొడవుగా ఉంటాయి. ప్రతి ఈకలో మధ్య అక్షము మరియు విస్తరించిన పిచ్ఛపాలము ఉంటాయి. మధ్య అక్షపు సమీపాగ్ర భాగమును కెలామస్ లేదా క్విల్ అని, దూరాగ్ర భాగమును విన్యాసాక్షము లేక షాఫ్ట్ అని అంటారు.
* కెలామస్ (Calamus) : కెలామస్ లేదా క్విల్ బోలుగా, గొట్టము వలె ఉండి పాక్షిక పారదర్శకముగా ఉంటుంది. దీని అడుగు భాగము బాహ్యచర్మపు పుటిక లోనికి చొచ్చుకొని ఉంటుంది. కెలామస్ చివర చిన్న [[రంధ్రము]] ఉంటుంది. దీనిని నిమ్ననాభి అంటారు. ఈ రంధ్రము ద్వారా అంతశ్చర్మపు సూక్షాంకురము ఒకటి ఈక లోపలికి వెళుతుంది. దీనిని పిచ్ఛ సూక్ష్మాంకురము అని అందురుఅంటారు. దీని ద్వారా రక్త కేశనాళికలు ప్రవేశించి పెరిగే ఈకకు పోషక పదార్ధాలను, వర్ణకాలను సరఫరా చేస్తుంది. క్విల్, విన్యాసాక్షము కలిసే ప్రాంతంలో ఉదరతలములో మరొక సూక్ష్మ రంధ్రము ఉంటుంది. దీనిని ఊర్ధ్వనాభి అని అంటారు. దీని దగ్గర కొద్ది సంఖ్యలో మెత్తటి ఈకలు ఉంటాయి. వీటిని అనుపిచ్ఛము అని అంటారు.
* విన్యాసాక్షము (Rachis) : మధ్య అక్షము యొక్క దూరాగ్రభాగమును విన్యాసాక్షము లేదా షాఫ్ట్ అని అంటారు. ఇది ఘనముగా ఉండి, అడ్డుకోతలో కోణీయంగా కనిపిస్తుంది. దీని ఉదరతలపు మధ్య భాగములో ఉన్న గాడిని అంబిలికల్ గాడి అని అంటారు.
* పిచ్ఛపాలము (Vexellum) : విన్యాసాక్షముకు ఇరుపక్కలా అతుక్కొని కంటకాలు (Barbs) ఉంటాయి. ఈ కంటకాలు విన్యాసాక్షము నుండి ఏటవాలుగా ఉద్భవిస్తాయి. విన్యాసాక్షాన్ని కంటకాలతో సహా కలిపి పిచ్ఛపాలము అని అంటారు. కంటకాలు సన్నగా పొడవుగా ఉండి ఒకదానితో ఒకటి సమాంతరముగా ఉంటాయి. కంటకాల పరిమాణము క్రమముగా సమీపాగ్ర భాగము నుండి దూరాగ్ర భాగము పోయే కొలది తగ్గుతూ ఉంటాయి. ప్రతి కంటకమునకు ఇరువైపుల ఏటవాలుగా విస్తరించిన సున్నితమైన వెంట్రుకల వంటి నిర్మాణాలు రెండు శ్రేణులలో అమరి ఉంటాయి. వీటిని కంటక కీలితాలు (Barbules) అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/ఈక" నుండి వెలికితీశారు