కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంధ్ర క్షత్రియులగు కమ్మ వారి చరిత్ర సూర్యదేవర రాఘవయ్య చౌదరి అనే పుస్తకం ఎంత వెతికినా దొరకలేదు. చారిత్రక క్షత్రియులు అన్న వాదన తీసివెయ్యడం అయినది.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు<ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232]</ref>. [[కమ్మనాడు]], [[కమ్మ రాష్ట్రం]] అను ప్రదేశాల పేర్లు పెక్కు [[శాసనము]]లలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని [[బౌద్ధులు]] పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ [[ధరణికోట]], [[భట్టిప్రోలు]], [[చందవోలు]] మున్నగు ఊళ్ళు ఆనాటి [[చరిత్ర]]<nowiki/>కు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక [[కులము]]గా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు<ref>దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909 [http://www.archive.org/details/CastesAndTribesOfSouthernIndiaVolV Castes and Tribes of Southern India]</ref>. [[గుంటూరు జిల్లా]] [[ముప్పాళ్ళ (గుంటూరు జిల్లా)|ముప్పాళ్ళ]] మండలం [[మాదాల]] గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో తాను దూర్జయ వంశం, వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు కమ్మనాడుకి చెందిన తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు. కాకతీయ సామ్రాజ్యం పతనం తరువాత ముసునూరి నాయకులు అనబడె కమ్మరాజులు ఢిల్లీ సుల్తానులను పారద్రోలి స్వతంత్రంగా తెలుగునేలను పరిపాలించారు. [[విజయనగర సామ్రాజ్యం]] కాలంలో [[కమ్మవారు]] సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. [[సూర్యదేవర నాయకులు]], [[పెమ్మసాని నాయకులు]] దీనికి ఉదాహరణ.
 
 
== కమ్మ రాజ్యాలు ==
శాసనాలు ఆధారంగా కమ్మవారు దుర్జయ వంశీకులని చరిత్రకారుల అభిప్రాయం. దుర్జయ వంశీకులైన [[కాకతీయులు]] కూడా కమ్మ కులస్థులని అత్యధిక చరిత్రకారుల అభిప్రాయం<ref>తెలంగాణ సమగ్ర చరిత్ర, 2016, తెలుఁగు అకాడమీ ముద్రణ</ref>.
 
అయితే కచ్చితంగా కేవలం కమ్మకులానికే చెందిన రాజ్యాలుగా చరిత్రకారులంతా నిర్ణయించిన కమ్మ రాజ్యాలు ఇవి<ref>ముసునూరి నాయకులు, మల్లంపల్లి సోమశేఖర శర్మ ఎమెస్కో పునర్ముద్రణ, 2015</ref> :
*[[ముసునూరి నాయకులు]]
*[[పెమ్మసాని నాయకులు]]
*[[రావిళ్ల నాయకులు]]
 
==కమ్మవారి గూర్చి సామెతలు==
"https://te.wikipedia.org/wiki/కమ్మ" నుండి వెలికితీశారు