"చాకలి" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాగ → బాగా , బందువు → బంధువు, → (4) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాగ → బాగా , బందువు → బంధువు, → (4) using AWB)
గతంలో చాకలి వారు పల్లెల్లో రెండు మూడు పల్లెలకు కలిసి ఒక చాకలి కుంటుంబం ఉండేది. వారు ప్రతి రోజు, ప్రతి ఇంటికి వెళ్ళి, మాసిన బట్టలను మూట గట్టి గాడిదలపైన వేసుకొని దగ్గర్లోని చెరువుకో, వాగులు, వంకలకో వెళ్ళి అక్కడ బట్టలన్నీ ఉతికి సాయంకాలానికి ఎవరి బట్టలను వారి ఇళ్ళకు చేర్చేవారు. ఎవరి బట్టలను వారికే ఇచ్చేవారు. ఏ మాత్రం పొరబాటు జరిగేది కాదు. అందుకే ''చదివినోడికన్నా చాకలోడు మిన్న '' అనే సామెత వాడుకలోకి వచ్చింది. మధ్యాహ్నం ఒక చాకలి ఇల్లిల్లు తిరిగి అన్నం, కూర ఒక బుట్టలో వేయించుకుని వెళ్ళేవారు. అదే విధంగా రాత్రికి కూడా ప్రతి ఇంటివారు చాకలికి కొంత అన్నం, కూర వేయాలి. వారు అన్నాన్ని సేకరించడానికి ఒక బుట్ట, కూరలకు ఒక గిన్నె వెంట తెచ్చుకునేవారు. ఇంటివారు ఒక్కొరకం కూరలు ఆ గిన్నెలోనే వేసేవారు. అవి అన్ని కలిసి పోయేవి. ఆకారణంగానే .... అనేక రకాల రుచులు కలిగిన కూరను ''ఇది చాకలి కూర లాగ ఉన్నదే '' అని అంటుంటారు. ఆవిధంగా పుట్టింది ఈ సామెత.
 
ఇది పల్లెల్లో చాల ప్రధానమైన వృత్తి. '''చాకలి''' లేనిదే పల్లెల్లో సాంప్రదాయమైన పనులు చాల జరగవు. వారిది ముఖ్యమైన పని అందరి బట్టలను వుతికి తేవడం. మధ్యాహ్నం ఒకరు వచ్చి ప్రతి ఇంటి వద్ద కొంత అన్నం కూర తికుని వెళ్లి తింటారు. అలాగె రాత్రికి కూడా కొంత అన్నం పెట్టాలి. వూరి వారి బట్టలి అన్ని కలిపి వున్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారి వారికిస్తారు. బట్టలను వారు అంత బాగబాగా గుర్తు పట్టగలరు. అందుకే ''[[చదివిన వాడికన్న చాకలి మిన్న]]'' అన్న నానుడి పుట్టింది. వారు బట్టలను వుతికే ముందు కొన్ని బట్టలను [[ఉబ్బ]] కెస్తారు, [[ఉబ్బ]] అంటే మూడు పెద్ద మట్టి కుండలను త్రికోణాకారంలో పెద్ద పొయ్యి మీద పెట్టి వాటి చుట్టూ మట్టితో దిమ్మ కడ్తారు. ఆ కుండల మూతులు మాత్రమే కనిపిస్తుంటాయి. వాటిల్లో సగం వరకు నీళ్లు పోసి, ఆమూడు కుండల మీద ఉబ్బకు వేయాల్సిన బట్టలను [[సౌడు]] నీళ్లతో తడిపి చుట్టలు చుట్టలుగా రెండు మూడు అడుగులఎత్తు వరకు అమర్చుతారు. తర్వాత అ బట్టల కుప్పకు ఒక పెద్ద బట్టను కప్పుతారు. ఇప్పుడు కుండల క్రింద మంట పెడ్తారు. కుండలలోని నీరు ఆవిరై అది పైనున్న బట్టలన్నింటికి వ్యాపిస్తుంది. అలా ఒక గంట ఆవిరి పట్టాక వాటిని తీసి నీళ్లలో వుతుకుతారు. అప్పుడు ఆ బట్టలు వాటికి వున్న మురికి వదిలి చాల తెల్లగా వస్తాయి. వీటిలో రంగు బట్టలు వేయరు. ఎందు కంటే ఒకదాని రంగు మరొక దానికి అంటు తుంది.
[[''సౌడు'']] అనగా సౌడు భూములలో పైకి తేలిన ఉప్పటి నున్నటి మట్టి. బట్టలు ఉతికినందుకు చాకలికి ఫలితానికి ఒక సారి 'మేర ' ఇవ్వాలి [[మేర]] అంటే ఐదు బళ్ళ వడ్లు. అలాగె వరికోతలప్పుడు అందరి పని వాళ్లతో బాటు '''చాకలి'''కి కూడా ఒక [[మోపు]] వరిని కూడా వదిలి పెట్టాలి. దాన్ని చాకలి ఇంటికి తీసుకెళ్లి నూర్చు కుంటాడు. పెళ్ళి పత్రికలు రాకముందు పెళ్ళి పిలుపులకు చాకలినే పంపే వారు. తమలపాకులు, వక్కలు ఇచ్చి ప్రతి ఇంటికి వేరె వూర్లో వున్న బందువులకుబంధువులకు చెప్పిరమ్మని చాకలిని పంపేవారు. స్వంత గాళ్లు పిలిచిన పిలిపు కంటే చాకలి పిలుపుకే గౌరవం.... మర్యాద.... సాంప్రదాయ కూడ. ఏశుభ కార్యానికైనా వక్క ఆకు ఇచ్చి పిలిస్తేనె అది మర్యాద. లేకుంటే అయిష్టంగా పిలిచినట్లె భావించే వారు. ఆ సందర్భంగా పుట్టినదే ఈ నానుడి: ''నాకేమైనా వక్క ఆకు ఇచ్చి పిలిచారా నేను రావడానికి?'' అదేవిధంగా పిల్లలు పుట్టినపుడు పురుడుకు వూరివారి నందరిని చాకలే పిలవాలి నీళ్లు పోయడానికి. చాకలే ముందు నీళ్లు పోయాలి. ఆడ పిల్లలు సమర్థాడి నప్పుడు వారి వంటి పైనున్న బట్టలు చాకలికే చెందుతాయి. ఇది పల్లేల్లో ఒకనాటి సంప్రదాయము. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అదేమంటే...... ''సరదాకి సమర్థాడితె చాకలి వచ్చి చీరపట్టు కెళ్లిందట ''. వివరణ: ఒక ఆడపిల్ల సరదాకి సమర్తైనట్లు అపద్దం చెప్పి ఎలా వుంటుందో చూడాలనుకున్నది. ఆ వేడుక ఎలా వున్నా చాకలి వచ్చి సాంప్రదాయం ప్రకారము ఆ ఆడపిల్ల ఒంటిపైనున్న బట్టలన్నీ తీసుకెళ్ళి పోయిందట. ఈ సామెతలో..... సరదాకి కూడా అబద్ధం ఆడ కూడదనే సందేశం ఉంది. ఆడ పిల్లలు సమర్తాడినప్పుడు విషయాన్ని వూరి వారందరికి చాకలితో చెప్పి పంపుతారు. . ఎవరైనా ప్రయాణమై వెళుతున్నప్పుడు చాకలి ఎదురు పడితే సుభ శుభ చూచకంగా బావించేవారు.
 
==సామాజిక పాత్ర==
పెళ్లిల్లలో చాకలి చేయాల్సిన సాంప్రదాయ పనులు చాల వుంటాయి. [[దీవిటి పట్టడం]], [[''చాకలి సాంగెం'']] అనె ఒక కార్యక్రమం వుండేది. అది లేక పోతె చాల లోటు. పంతులు గారు కూడా కొన్ని సందర్భాలలో చాకలి ఎక్కడ అని పిలుస్తుంటాడు. పెళ్ళి సందర్భంగా చాకలికి ప్రత్యేకించి డబ్బులు ఇవ్వరు. కాని అక్కడ [[తలంబ్రాలు]] పోసిన బియ్యం చాకలికే చెందుతాయి. అలాగే [[మంగళ స్నానం]] తర్వాత విడిచిన బట్టలు కూడా చాకలికె చెందు తాయి. జాతరలు, గ్రామ దేవతల పూజలందు చాకలే పూజారి. సమాజంలో ముఖ్యమైన పాత్ర వహించిన ఈ చాకలి వృత్తి ప్రస్తుతం పూర్తిగా కనుమరుగైనది. అప్పట్లో వంకల్లో వాగుల్లో ఎక్కడ పడితె అక్కడ నీళ్లు లభించేవి. వారి పని సులువయ్యేది. రాను రాను నీటి లబ్యత తక్కువయ్యె కొద్ది నీటి కొరకు పొలాలలోని బావుల వద్దకు పరుగులు తీసి, అవికూడ అడుగంటగా, రైతులు వరి పండించడం మానేయగా.. వారికి రావలసిన [[మేర]] సరిగా రాక, ఇలా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని క్రమంగా ఆ వ్వవస్థ కనుమరుగైనది. చాల తక్కువగా వుండే చాకలి కులం సామాజిక మార్పులతో చెల్లా చెదురై అంతరించి పోయింది. తరతరాలుగా బట్టలుతికిన చాకిరేవులలో [[చాకి బండలు]] నునుపు దేలి చాకలి వృత్తికి సాక్షిభూతంగా నేటికి అక్కడక్కడా పడి ఉన్నాయి. పల్లె ప్రజలు ఎవరి బట్టలు వారె వుతుక్కుంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. కాక పోతె బట్టల మురికి అతి సులభంబా వదల గొట్ట డానికి అనాడు లేని [[డిటర్జెంటు]]లు, [[పౌడర్లూ,]] [[సబ్బులు,]] [[బట్టలు ఉతికే యంత్రాలు]] ఇప్పుడొచ్చాయి. పైగా మురికి అంతగా అంటని, అంటినా సులభంగా వదిలిపోయే [[టెర్లిన్,]] [[టెరికాట్,]] [[పోలిస్టర్]] వంటి బట్టలు ఎక్కువైనాయి. దాంతో గృహస్తుల బాధ కొంత వరకు తీరింది. చాకలి లేని లోటు కొంత వరకు తీరింది. చాకలి వృత్తి కేవలం మురికి బట్టలను వుతకడం మాత్రమే కాదు.... అతనికి అనేక సామాజిక పనులు కూడా వుండేవి. అన్ని ప్రాంతాలలోను చాకలి వృత్తి ఇంచు మించు కనుమరుగైనది. ఎవరి బట్టలను ఎక్కువగా వారే వుతుక్కుంటున్నారు. మరి.... ఇతర సామాజిక కార్యక్రమాల సంగతి...... అవి ఏవంటే..... ముట్టు బట్టలను ఉతకడం, ఆడపిల్లలు సమర్థాడినప్పుడు స్నానం చేయించడము, పురుడు పోసినప్పుడు స్నానం చేయించడము, చావు వంటి అశుభ కార్యాలకు దీవిటి పట్టడం, పెళ్ళి వంటి శుభ కార్యాలకు దీవిటి పట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ఏనాడో కనుమరుగైనవి. పాత సంప్రదాయాలను మరువలేని వారు ఆ యా సమయానికి ఒక చాకలి కులస్తుని అద్దెకు పిలిపించి[[తూ తూ మంత్రం]]గా ఆకార్యక్రమం జరిగిందని పిస్తున్నారు. దీన్ని బట్టి చాకలికి ఆ రోజుల్లో ఎంతటి [[పరపతి]] ఉండేదో ఊహించు కోవచ్చు. అది ఆనాటి చాకలి ప్రాముఖ్యత.
 
==[[తురక చాకలి]] ==
==మూలాలు==
*http://www.suryaa.com/showNews.asp?category=4&subCategory=19&ContentId=11453
*[http://rajakaikyavedhika.com/ http://www.rajakaikyavedhika.com/] - రజకులకు ఎస్సీ హోదా పై అవగాహన కొరకు ఏర్పాటు చేసిన అత్యద్భుతమైన వెబ్ సైట్
*[http://www.rajaka.in www.rajaka.in] - ఆంధ్ర ప్రదేశ్ రజక / చాకలి వర్గ బంధువుల దిక్సూచి
*[http://www.rst.org.in RST.org.in] - రజక / చాకలి ప్రజలు కొరకు సంక్షేమ ట్రస్ట్
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2433594" నుండి వెలికితీశారు