చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ధృవ → ధ్రువ, స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB |
||
పంక్తి 206:
;సాగునీటికి జలాశయాలు ఏర్పాటు
[[దస్త్రం:Thousand Pillar Temple pond.JPG|thumb|వేయిస్తంభాల గుడి వద్ద కాకతీయులు నిర్మించిన చెరువు]]
వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం కావడంతో సాగునీటి వనరుల పెంపుకు వర్షపునీటిని నిల్వచేసుకునే లక్ష్యంతో కాకతీయుల కాలపు నిర్మాణాలు సాగాయి. కాకతీయ చక్రవర్తులు నిర్మించిన జలాశయాలు నాలుగు విధాలుగా విభజించవచ్చు: సరస్సులు, చెరువులు, కాలువలు, బావులు. ప్రతీ ఊరికీ అనుబంధంగా, ఆలయానికి ఈశాన్యంగా ఒక చెరువు నిర్మాణం చేసేవారు. ఊరికి దిగువన చెరువు, చెరువుకు దిగువన పొలాలు ఉండేలా జాగ్రత్తపడడంతో ఊరిలో పడిన వాననీరు చెరువును నింపడంతోపాటు ఊరికి వరదల ముప్పు కూడా ఉండేది కాదు. వర్షపు నీటిని నిలువ చేయడం మాత్రమే కాక సమీపంలోని భారీ జలాశయానికి దీన్ని అనుసంధానించేవారు. 1052 నుంచి చాళుక్యుల సామంతునిగా రాజ్యపాలన చేసిన కాకతీయ పాలకుడు మొదటి ప్రోలయరాజు నిర్మించిన కేసీయసముద్రం సరస్సుతో కాకతీయుల చెరువుల నిర్మాణం ప్రారంభమైంది. తర్వాత్తర్వాత
;వ్యవసాయ భూముల పెంపు
సాగునీటి వనరుల పెంపుతోపాటు సాగుభూములను విస్తరించుకుంటూ పోయారు. ఈ క్రమంలో పలు చర్యలు తీసుకున్నారు: అడవులను నరికించి సాగులోకి తీసుకువచ్చి వందలాది గ్రామాలను నిర్మించారు. <ref group=నోట్>ఉదాహరణకు నేటి కర్నూలు ప్రాంతంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు స్వయంగా విడిసి ఈ పనిని చేపట్టినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది.</ref> నిరుపయోగంగా ఉన్న బీడు భూములను సాగులోకి తీసుకువచ్చినవారికి ఆ సాగుపై పన్నులో రాయితీలు కల్పించారు. గ్రామాలకు దూరంగా సాగులోలేని భూములను బ్రాహ్మణులు, పండితులు, వృత్తులవారికి, అధికారులకు, దేవాలయాలకు కానుకలుగా, అగ్రహారాలుగా ఇవ్వడం ద్వారా సాగులోకి తీసుకువచ్చారు. వ్యవసాయం పెంపొందిద్దామని అడపగట్టు అనే పద్ధతిలో రాచభూములను సగం ఆదాయాన్ని ప్రభుత్వానికి జమకట్టడానికి ఇష్టపడేవారికి కౌలుకు ఇచ్చేవారు. ఈ విధానాలు వ్యవసాయానికి, కాకతీయుల ఆర్థిక స్థితికి సాయం చేశాయి.<ref name="గంగాదేవి చెరువు గణపేశ్వరాలయం" />
|