వెలమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
==చరిత్ర==
ప్రముఖ సాంఘికవేత్త, చరిత్రకారుడు ఎడ్గార్ థర్ స్టన్ ప్రకారము వెలమ, [[కమ్మ]] కులములు ఒకే మూలమునుండి విడిపోయినవి. ఈ ఘటనపై తెలుగు సాంప్రదాయములో బహు కథనాలు ప్రచారములోఉన్నాయి కాని దేనికీ చారిత్రకాధారములు లేవు. ఈ రెంటి కులములలోని ఆచారవ్యవహారములు, గోత్రములు, ఇంటిపేర్లలో చాల సామీప్యత గలదు. వెలమ అను పదము మొదటిసారిగా [[నెల్లూరు]] మండలములో దొరికిన 16వ శతాబ్దమునాటి ఒక శాసనములో గలదు. చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము 11వ శతాబ్దములో వెలనాటినుండి ([[గుంటూరు]] మండలములోని ఒక భాగము) ఓరుగల్లుకు వెడలిన యోధుల వంశముల వారు వెలమలయ్యారు.
 
క్రీ. శ. 12వ శతాబ్దమునుండి వీరు ఆంధ్ర చరిత్రలో ప్రముఖ పాత్ర వహించారు. క్రీ. శ. 1361 నుండి ఒక శతాబ్ద కాలము [[రాచకొండ]] మరియు [[దేవరకొండ]] రాజధానులుగా [[తెలంగాణా]] ప్రాంతము పాలిచారు. అటు పిమ్మట [[బహమనీ సుల్తానుల]]కు సామంతులుగా ఉన్నారు. [[విజయనగర సామ్రాజ్యము]]లో సేనాధిపతులుగా పేరుప్రఖ్యాతులు పొందారు.
 
కాకతీయ చక్రవర్తి రుద్రుని కాలములో బడబానల భట్టు వెలమవారికి, కమ్మవారికి గోత్రములు నిర్ణయించాడు. దీనిని బట్టి వీరు పూర్వకాలములో బౌద్ధులు, జైనులు గా ఉండిఉండవచ్చును. వెలుగోటివారి వంశావళి, పద్మనాయక చరిత్ర వీరి చరిత్రకు కొంత ఆధారములు<ref>నేలటూరి వెంకటరమణయ్య, వెలుగోటివారి వంశావళి ఆంగ్ల అనువాదము</ref><ref>సర్వజ్ఞ సింగభూపాల, పద్మనాయక చరిత్ర</ref>. వ్యవసాయిక వృత్తిచేసుకొను కాపులు వెలమ, కమ్మవారిగా విడిపోయారు.
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు