రసాయన శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
 
=== మూలకాలు ===
ఒకే ఒక 'జాతి' అణువులతో ఉన్న పదార్థాన్ని మూలకం (element) అంటారు. ఇదే విషయాన్ని మరొక విధంగా కూడా చెప్పొచ్చు. ఒక మూలకంలో ఉన్న అణువులన్నిటిలోనూ ప్రోటానుల జనాభా ఒక్కటే. ఈ ప్రోటానుల జనాభానే ఆ మూలకం యొక్క [[పరమాణు సంఖ్య]] (atomic number) అంటారు. ఉదాహరణకి, ఆరే ఆరు ప్రోటానులు కణికలో ఉన్న అణువులన్నీ కూడా కర్బనం అణువులే! కనుక [[కర్బనం]] (carbon) అనే రసాయనిక మూలకం యొక్క అణుపరమాణు సంఖ్య 6. ఇదే విధంగా 92 ప్రోటానులు కణికలో ఉన్న అణువులన్నీ కూడా [[యురేనియం]] (uranium) అణువులు. కనుక యురేనియం యొక్క అణు సంఖ్య 92.
 
మూలకాలని, వాటి లక్షణాలని అధ్యయనం చెయ్యటానికి ఎంతో అనుకూలమైన పనిముట్టు [[ఆవర్తన పట్టిక]] (periodic table). ఈ పట్టికని హొటేలు భవనంలా ఊహించుకోవచ్చు. ఈ భవనంలో ఏడు అంతస్తులు, రెండు నేలమాళిగలు ఉన్నట్లు ఊహించుకోవాలి. ప్రతి అంతస్తులోను ఒకటి నుండి పద్నాలుగు గదులు వరకు ఉండొచ్చు. ఒకొక్క గదికి ఒకొక్క మూలకాన్ని కేటాయించేరు. రసాయనిక లక్షణాలలో పోలికలు ఉన్న మూలకాలన్నీ దగ్గర దగ్గర గదులలో (అంటే, ఒకే నిలువ వరుసలో ఉండే గదులు, పక్క పక్కని ఉండే గదులు అని తాత్పర్యం) ఉండేటట్లు అమర్చబడి ఉంటాయి. ఈ భవనంలో ఎన్నో అంతస్తులో, ఎన్నో గదిలో ఏ మూలకం ఉందో తెలిసిన మీదట ఆ మూలకం రసాయనిక లక్షణాలన్నీ మనం పూసగుచ్చినట్లు చెప్పొచ్చు. ఇది ఎలా సాధ్య పడుతుందంటే - ఒక మూలకంలోని కణికలో ఎన్ని ప్రోటానులు ఉన్నాయో ఆ కణిక చుట్టూ పరిభ్రమించే మేఘంలో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి కదా. ఈ మేఘమే అణువు యొక్క బాహ్య ప్రపంచంతో సంపర్కం పెట్టుకోగలదు. కనుక అణువు యొక్క రసాయనిక లక్షణాలు ఎలా ఉండాలో ఈ మేఘం నిర్ణయిస్తుంది. ఆవర్తన పట్టికని అధ్యయనం చెయ్యటం వల్ల ఈ రకం విషయాలు కూలంకషంగా అర్ధం అవుతాయి.
"https://te.wikipedia.org/wiki/రసాయన_శాస్త్రం" నుండి వెలికితీశారు