రాజన్న: కూర్పుల మధ్య తేడాలు

→‎కథ: కథ సంగ్రాహం
→‎కథ: కథ సంగ్రాహం
పంక్తి 21:
 
ఇదిలావుండగా, గ్రామంలోని పిల్లలు ఎవరైనా చదువుకోవాలంటే దొరసానికి చదువు పన్ను కట్టి పాఠశాలలో చేరాలి. అందుకోసం మల్లమ్మను దొర ఘడికి తీసుకొనివెళ్తాడు సాంబయ్య. అక్కడ దొరసాని కూతురు సంగీతం నేర్చుకుంటూవుండగా, దానికి ఆకర్షితురాలై పాట పాడిన మల్లమ్మను దొరసాని కొరడాతో కొట్టి, ఇకపై మల్లమ్మ పాట తనకు వినబడకూడదని చెబుతుంది.
 
ఓ రోజు, మల్లమ్మ తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటూ పాడే పాటను విన్న దొరసాని మల్లమ్మను చంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం నుండి తన మనవరాలిని కాపాడుకున్న సాంబయ్య దొరసానికి దొరకకుండా ఊరు వదిలి పారిపోవడానికి నిశ్చయించుకొని రైల్వేస్టేషనుకి వెళ్తాడు. మల్లమ్మ రైలు ఎక్కలేదని గ్రహించి తనని వెతుక్కుంటూ వెళ్ళగా, ఓ మూల కూర్చొని ఏడుస్తున్న మల్లమ్మను నిలదీస్తాడు. తమ ఊరిని, అందులోవున్న రాజన్నను వదిలి రాలేనని చెబుతుంది మల్లమ్మ. అప్పుడు మల్లమ్మ రాజన్న కూతురేనని చెబుతాడు సాంబయ్య. ఇంతలో వీరిద్దరి ఆచూకి తెలుసుకున్న దొరసాని సాంబయ్యను హతమార్చి, మల్లమ్మను గుడిసెలో బంధించి దానికి నిప్పు పెట్టిస్తుంది. రాజన్న సమాధిని కూల్చివేస్తుంది. తమ ఊరిలోని సంగీత మాష్టారు కులకర్ణి ([[నాజర్ (నటుడు)|నాజర్]]) సాయంతో మల్లమ్మ తప్పించుకుంటుంది. గుడిసెతో పాటు మల్లమ్మ కూడా కాలిపోయిందనుకొని దొరసాని వెళ్ళిపోతుంది.
 
==నటినటులు==
"https://te.wikipedia.org/wiki/రాజన్న" నుండి వెలికితీశారు