"చాకలి" కూర్పుల మధ్య తేడాలు

170 bytes removed ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
కైలాసంపైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కొలువై వున్న సమయంలో దేవాసురులులందరూ అక్కడకేతెంచి [[శివుడు|శివు]]<nowiki/>ని స్తుతిస్తుండగా దక్షుడు అక్కడికి వస్తాడు. శివుడు వారినందరిని గౌరవించిన అనంతరం [[దక్షుడు|దక్షు]]<nowiki/>ణ్ని గౌరవించాడు. అందుకు దక్షుడు [[శివుడు]] తనని అవమానించినట్లు భావించి, కొపగించి ప్రతికారంగా ఒక యాగాన్ని చెయ్యడానికి నిశ్చయించుకొంటాడు. [[దేవతలు]], మునులు అందరినీ ఆహ్వానించి శివుడు లేకుండా యజ్ఞాన్ని ప్రారంభించాడు.
దక్ష ప్రజాపతి తాను నిర్వహిస్తున్న యజ్ఞానికి శివుడిని పిలువడు. అయినా పార్వతి ఆ యజ్ఞగుండం వద్దకు వెళుతుంది. దక్షుడు తన కూతురైన పార్వతిని, అల్లుడైన శివుడిని తూలనాడతాడు. పార్వతి అవమాన భారంతో యజ్ఞగుండంలోకి దుమికి ఆత్మాహుతి అవుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు వీరభద్రున్ని దక్షయజ్ఞాన్ని నాశనం చేసి రమ్మని పంపుతాడు. దక్షయజ్ఞాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, త్రిమూర్తుల వద్దకు వెళ్లి దక్షున్ని చంపి కాల్చి, మాడ్చి, ఊడ్చి ఉస్సోమన్నానని చెప్తాడు వీరభద్రుడు. అప్పుడు త్రిమూర్తులు ''యజ్ఞాన్ని నాశనం చెయ్యమంటే దానితోపాటు స్త్రీ హత్య, శిశు హత్య, బ్రహ్మహత్యలు కూడా చేసి పాప పంకిలుడైనావు. గాబట్టి నీ నీడ మాపై పడకూడదు. నువ్వు పాలగుండంలో స్నానం చేసి మడేలయ్య అవతారం ఎత్త''మంటారు. అప్పుడు వీరభద్రుడు పాలగుండంలో దుమికి భీకరించే సరికి, ఆ భీంకారానికి ఇద్దరు ప్రవాస కర్తలు పుడతారు. వాళ్లే మడేలయ్య , మాచయ్యలు.
మడేలయ్య బట్టలు ఉతకడం, మాచయ్య దేవునికి పూజ చేయడం చేస్తుండేది. మాచయ్య అన్నం ఆహారం లేకుండా పూజలోనే ఉండేది. ఎవరైనా వచ్చి ఇస్తేనే తినేది. లేకుంటే లేదు. ఒకరోజు బాగా ఆకలి వేసిన మాచయ్య, మడేలయ్య అడుక్కుని తెచ్చుకున్న అన్నాన్ని ఒక్కడే తింటాడు. స్నానం చేసి భోజనానికి వచ్చిన మడేలయ్య కోపించి మాచయ్యతో ''పంచినదాన్ని మారుపంచుడయితే లేదు. నేను అడుక్కున్న అన్నాన్ని నువ్వు తిన్నోనిని కాబట్టి యాడాదికోసారి అర్తివాడివయ్యి నా ఇంటికి వస్తే నీకు త్యాగం ఇసా''్తనంటాడు. అందుకే వీరి మధ్య మంచం పొత్తు ఉన్నప్పటికి వియ్యపు పొత్తు లేదు. చాకలి వారికి మాచయ్యలు ఆడబిడ్డలు అర్తివారు వంటివారు. అందుకే అర్తి బిడ్డ దీవెన, ఆడబిడ్డ దీవన జంగం దీవెనతో సమానం అంటారు.
వీరభద్రుని అవతారం అయిన మడేలయ్య సురాముప్పది కోట్ల దేవతలు విడిచిన వస్త్రాలను పాపపరిహారం చేసుకోవడానికి పన్నెండు సంవత్సరములు పిండుతాడు. పన్నెండు సంవత్సరములు పిండడం పూర్తయిన తరువాత ఒకసారి పరమశివుడు మడేలయ్యను పరీక్షించదలిచి వృత్తిపరమైన కఠినమైన కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. ఆ పరీక్షల్లో నెగ్గిన మడేలయ్యకు శివుడు ప్రత్యక్షమై ఏదైన వరం కోరుకొమ్మంటాడు. అప్పుడు మడేలయ్య తనకు చాకలి వృత్తి కావాలని; వండని కూడు, వడకని బట్ట, పిండని పాడి ఇంటి ముందు తడి వస్త్రాలు పాడి వస్త్రాలు తరగకుండా ఉండాలని ఎటువంటి రాజపుంగవులు కోకలు అయినా తాము ధరించినప్పటికీ తమనేమి అనకుండా ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు పరమశివుడు అలాగేనని దీవించి ''ముందుగా నీకు అన్నం పెట్టినవారు ముక్తి పొందుతారు. పెట్టనివారు నరకం వెళతారు. మరు జన్మలో బండకింద కప్పగా జన్మిస్తారు. ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా నీకు కట్నాలు కానుకలూ ఇస్తార''ని ఆశీర్వదించి మాయమవుతాడు. ఈ విధంగా జీవించే మడేలయ్య వంశం వారే చాకలివారు.
11

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2473163" నుండి వెలికితీశారు