తిరుమల రామచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎యితర లింకులు: +{{Authority control}}
పంక్తి 81:
# '''[[హంపీ నుంచి హరప్పా దాక]]:''' కేంద్ర సాహిత్య అకాడమీ (2002) పురస్కారం పొందిన పుస్తకం . తిరుమల రామచంద్ర రచనా వ్యాసంగంలో ప్రముఖమైన స్వీయచరిత్ర . దీని తొలి ముద్రణ ఆయన పరమపదించిన రెండునెలలతరువాత ప్రచురించబడింది. దీనికి ముందు మాట రాసిన అక్కిరాజు రమాపతిరావు ఈ పుస్తకం నవలకన్నా వేగంగా , ఆకర్షకంగా, ఉత్తేజభరితంగా చదివిస్తుంది అని పేర్కొన్నాడు. దీనిలో బొమ్మలు జి.వి.అమరేశ్వరరావు ఆకర్షణీయంగా వున్నాయన్నాడు. కరుణం, శుచిరుజ్జ్వలమైన శృంగారం, సుకుమార హాస్యం, పరమ మనస్విత ఈ గ్రంథం నిండా పాఠకులు పూలతోటలో విహరించేంత సంతోషాన్ని కలిగిస్తాయని పేర్కొన్నాడు. <ref> హంపి నుంచి హరప్పాదాక- శ్రీతిరుమల రామచంద్ర, అభో విజోకందాళం ప్రచురణ, నాలుగవ ముద్రణ, ఆగష్టు, 2010 పేజీ. vii-xiv </ref>
# [[చెప్పుడు మాటలు]] నాటికల సంపుటిని [[కన్నడ భాష|కన్నడం]]<nowiki/>లో శ్రీరంగ ఎన్.కస్తూరి రాశారు. ఆ పుస్తకాన్ని తిరుమల రామచంద్ర తెలుగులోకి అనువాదం చేశారు.
ఇంకా తెలుగు పత్రిక సాహిత్య సేవ, బృహదారణ్యకం, [[మరపురాని మనీషులు]], గాథాసప్తశతిలో తెలుగు పదాలు, హిందువుల పండుగలు - పర్వాలు, హాల గాథలు, వీరగాథలు, దక్షిణాంధ్రవీరులు, [[కాటమరాజు కథ]], శశాంకవతి, ధర్మదీక్ష మొదలైన పుస్తకాలు వ్రాశాడు. సంస్కృతంలో సత్యాగ్రహవిజయం, సుమతీశతకం వ్రాశాడు. అనువాదకుడిగా కన్నడనవలలు శాంతల, మరల సేద్యానికి తమిళం నుండి రాజాజీ కథలు, ఆంగ్లం నుండి భక్తి వేదాంతస్వామి కమింగ్ బ్యాక్, హిందీనుండి సుశీలా నయ్యర్ వ్రాసిన గాంధీజీ కారాగారగాథ, [[సంస్కృతము|సంస్కృతం]] నుండి క్షేమేంద్రుని బృహత్కథామంజరి, [[ప్రాకృతం]] నుండి లీలావతి కావ్యం తెలుగులోనికి అనువదించాడు.
 
==బిరుదులు==
"https://te.wikipedia.org/wiki/తిరుమల_రామచంద్ర" నుండి వెలికితీశారు