తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
[[
 
== భౌగోళిక స్వరూపం ==
[[File:CanalRoad.jpg|thumb|కాలువ గట్లు]]
[[File:View of Banana plants at Ryali village in East Godavari district.jpg|thumb|కోనసీమలో అరటి పొలాలు]]
[[దస్త్రం:Konaseema-1.jpg|right|thumb|కోనసీమ పొలాలు]]
[[File:Kon2.jpg|thumb|కోనసీమ పొలాలు]]
తూర్పుగోదావరి జిల్లా వైశాల్యం 10,807 చదరపు కిలోమీటర్లు ఉంటుంది(4,173 మైళ్ళు). ఇది వైశాల్యంలో ఇండోనేషియా యొక్క ద్వీపంతో సమానం. ఈ జిల్లా పశ్చిమాన కొండాకోనలతో నిండి ఉటుంది. అలాగే తూర్పున మైదానాలతో నిండి ఉంటుంది. ఈ జిల్లాకు తూర్పున బంగాళాఖాతం ఉటుంది. ఈ జిల్లా కేంద్రమైన [[కాకినాడ]] సముద్రతీరాన ఉపస్థితమై ఉంది.
 
తూర్పు గోదావరి జిల్లాకు ఉత్తరాన [[విశాఖపట్నం]] జిల్లా, [[ఒడిషా]] రాష్ట్రము, తూర్పున, దక్షిణాన [[బంగాళా ఖాతము]], పశ్చిమాన [[పశ్చిమ గోదావరి]] జిల్లా, వాయవ్యాన [[ఖమ్మం]] జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా జిల్లాను మూడు ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు. అవి: డెల్టా, మెట్ట ప్రాంతం, కొండ ప్రాంతాలు. వివిధ ప్రాంతాల ఎత్తులు సముద్ర మట్టం నుండి 300 మీ.ల వరకు ఉన్నాయి.
 
డెల్టా ప్రాంతంలో [[కోనసీమ]], [[కాకినాడ]]లోని ప్రాంతాలు, పూర్వపు [[రామచంద్రపురం]], [[రాజమండ్రి]] తాలూకాలు ఉన్నాయి. ఈ ప్రాంతం [[వరి]] పొలాలతో, [[అరటి]], [[కొబ్బరి]], [[తమలపాకు]] తోటలతో, లెక్కలేనన్ని [[తాటి|తాడి చెట్ల]]తో కళకళ లాడుతూ ఉంటుంది. సారవంతమైన ఒండ్రు నేలలు, ఇసుకతో కూడిన మట్టి నేలలు డెల్టా ప్రాంతంలో కనిపిస్తాయి.
 
[[మండపేట]], [[తుని]], [[పిఠాపురం]], [[పెద్దాపురం]], [[కాకినాడ]], [[రామచంద్రాపురం]] మరియు [[రాజమండ్రి]]లలో కొన్ని ప్రాంతాలను మెట్ట ప్రాంతాలుగా పిలుస్తారు.<!-- Red loamy soil in upland and hill tracts of the district. --> [[తూర్పు కనుమలు]] సముద్ర మట్టం నుండి అంచెలంచెలుగా లేస్తూ, పూర్వపు మన్యం తాలూకాలైన [[రంపచోడవరం]], ఎల్లవరం అంతటా వ్యాపించాయి. [[గోదావరి]], పంపా, [[తాండవ నది|తాండవ]] మరియు ఏలేరులు జిల్లాలో ప్రవహిస్తున్న ప్రముఖ నదులు. పెద్దాపురం సంస్థానం ప్రసిద్ధికెక్కింది.
=== వాతావరణం ===
ఈ జిల్లాలో ఈశాన్య ఋతుపవనాలు మరియు నైరుతీ ఋతుపవనాల కారణంగా జూన్ నుండి అక్టోబరు వరకు వర్షాలు కురుస్తుంటాయి. ఈ జిల్లా పశ్చిమ కొండ ప్రాంతాలలో సుమారు 140 సెంటిమీటర్లు మరియు ఉత్తర కోస్తా ప్రాంతంలో సరాసరి వర్షపాతం 100 సెంటిమీటర్లు ఉంటుంది.
ఏడాది పొడుగునా వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు మాత్రం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరుగుతాయి. జిల్లా లోని సాధారణ వర్షపాతం - 1280.0 మి మీ. సగానికి పైగా వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలగగా మిగిలినది ఈశాన్య ఋతుపవనాల వలన కలుగుతుంది.
 
== ఆర్ధిక స్థితి గతులు ==