తూర్పు గోదావరి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
== ఆర్ధిక స్థితి గతులు ==
[[File:Hindu Pilgrimage sites map of Andhra Pradesh.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రాలు.]]
[[File:View from Talupulamma Temple.jpg|thumb|తలుపులమ్మ లోవ, తుని]]
[[దస్త్రం:Dowleswaram barrage.JPG| right|thumb|[[ధవళేశ్వరం]] బేరేజి]]
గోదావరి డెల్టాలో అధికభాగం ఈ జిల్లాలోనే ఉన్నందున వ్యవసాయం మరియు నీటిసంబంధిత వృత్తులు(అక్వా కల్చర్) జిల్లా ప్రజలకు ప్రధాన వృత్తులుగా ఉన్నాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా సహజవాయువు నిలువలు బయటపడడం వలన ఈ ప్రదేశం పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతున్నది. జిల్లాలో రెండు ఎరువుల కర్మాగారాలు, సహజ వాయువుతో తయారయ్యే విద్యుత్ వుత్పత్తి కేంద్రాలు మరియు చమురు శుద్ధి కర్మాగారాలున్నాయి. ప్రస్తుతం ఇది దేశంలో అతి పెద్ద చమురు మరియు సహజవాయు ఉత్పత్తి కేంద్రంగా ఉంది.
 
=== వనరులు ===
తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయం ప్రధానంగా వున్న జిల్లా. అలాగే తూర్పు గోదావరి సంపన్నభరితమైన జిల్లా కూడా. రాష్ట్రంలో సంపన్నతలో మొదటి స్థానంలోనూ దేశంలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇది దేశంలో సమృద్ధిగా సహజ వాయువు మరియు చమురు నిలువలు విస్తారంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లాలో చమురు మరియు సహజవాయువు నిల్వలు ఉన్న ప్రదేశాలు అనేకం ఉన్నట్లు భావించబడుతుంది.
 
=== జీవనప్రమాణం ===
2007-2008 జనాభాగణాంకాలను అనుసరించి '''అంతర్జాతీయ జనసంఖ్యా శాస్త్రశిక్షణాలయం'''(ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ) జిల్లా మొత్తంలో 38 గ్రామాలలో 1019 మంది అభిప్రాయాలను సేకరించింది. వారి పరిశోధనలో 92.5% ప్రజలు విద్యుత్తు వసతిని, 96.7% ప్రజలు మంచినీటి వసతిని, 50.4% ప్రజలు మరుగుదొడ్ల వసతిని మరియు 30.9% పక్కా గృహాల వసతి కలిగి ఉన్నట్లు తేలింది. 28.6 మంది యువతులు చట్టపరమైన 18 సంవత్సరాలకంటే ముందే వివాహం చేసుకున్నారు.
 
శెట్టబలిజ, కాపులు, రెడ్డి, కమ్మ, కొండా రెడ్డిలు అధికంగా ఉన్నఈ జిల్లాలో ఇంకా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంది. రాచపల్లి వంటి మెట్ట ప్రాంతాల్లో ఇంకా క్షత్రియ రాజుల జమీందారీ వ్యవస్థ కొనసాగుతున్నది. ఈ జిల్లా వాసులకు ఎక్కువగా [[పశ్చిమ గోదావరి జిల్లా]] వాసులతో వివాహ సంబంధాలుంటాయి. ఈ జిల్లాలో [[రాజమండ్రి]], [[కాకినాడ]] వంటి పట్టణాలలో కొద్దిగా ఆధునికత కనిపించినా మిగిలిన మండలాల్లో చాలావరకూ గ్రామీణ సంస్కృతి కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాతో పోలిస్తే ఈ జిల్లాలో ఉన్న మహిళల్లో అక్షరాస్యత తక్కువ, ఎక్కువశాతం ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండగానే వివాహాలు జరుగుతాయి. బాల్య వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతూవుంటాయి. యువతులు, స్త్రీలు ఒంటరిగా బయట తిరగడం అంతగా కనిపించరు. [[సంక్రాంతి]], [[ఉగాది]], [[వినాయక చవితి]], [[క్రిస్టమస్]] మరియూ గ్రామీణ పండుగలు వైభవంగా జరుపుకుంటారు గట్టిగా
 
== పాలనా వ్వవస్ధ. ==